బూడిద తెగులు

 • లక్షణాలు

 • ట్రిగ్గర్

 • జీవ నియంత్రణ

 • రసాయన నియంత్రణ

 • నివారణ చర్యలు

బూడిద తెగులు

Erysiphaceae

శీలీంధ్రం


క్లుప్తంగా

 • ఆకుల పై పిండి లాంటి పదార్ధం కప్పబడి ఉంటుంది.
 • దీనిని చేతితో తుడిచేయవచ్చు.

ఆతిధ్యం ఇచ్చేవారు:

ఆపిల్

పియర్

రాస్బెర్రీ

చిక్కుడు

వంకాయ

చెర్రీ

అప్రికోట్

ప్లం

పీచ్

బఠానీ

కీర దోస

గుమ్మడికాయ

కీర దోస

టమాటో

లెట్టూస్

బంగాళదుంప

మినుములు మరియు పెసలు

పసుపు కంది పప్పు మరియు ఎరుపు కంది పప్పు

శనగలు & సెనగ పప్పు

ప్రత్తి

ఇతరములు

మొక్కజొన్న

నిమ్మజాతి

పుచ్చకాయ

కందులు

అలంకరణ

లక్షణాలు

మొదట, ఆకుల పై భాగంలో పసుపురంగు మచ్చలు కనబడతాయి. తెగులు యొక్క తరువాతి దశలో , తెల్లటి, ఆ పై బూడిద రంగు పొడి లాంటి పదార్ధం ఆకులు, ఆకు కాడలు ఇంకా పండ్లను కప్పివేస్తుంది. ఈ ఫంగస్ మొక్కల నుండి పోషకాలను గ్రహించి ఒక బూడిద లాంటి పదార్ధాన్ని ఆకులపై ఏర్పరుస్తుంది. దీనివలన కిరణజన్య సంయోగక్రియ జరగకుండా ఆగిపోతుంది. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఈ తెగులు పెరుగుతున్న కొద్దీ సంక్రమణకి గురైన భాగాలు ముడుచుకుపోతాయి, ఆకులు కుచించుకుపోతాయి మరియు మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. డౌనీ మైల్డ్యూ తెగులు తో పోల్చుకుంటే బూడిద తెగులును కొంతవరకు నియంత్రించవచ్చు.

ట్రిగ్గర్

శిలీంధ్ర బీజాంశాలు ఆకు మొగ్గలు మరియు మొక్కల అవశేషాలలో ఉంటాయి. గాలి, నీరు మరియు క్రిములు, ఈ బీజాలను దగ్గరగా ఉన్న మొక్కలకు అంటుకునేటట్టు చేస్తాయి. బూడిద తెగులు ఒక శిలీంధ్రం అయినప్పటికీ సాధారణంగా ఇది పొడి వాతావరణంలో పెరుగుతుంది. ఇది 10 నుండి 12°C మధ్యలో ఉన్న ఉష్ణోగ్రతల్లో జీవిస్తుంది. కానీ 30°C వీటికి సరైన పరిస్థితులు. కొద్దిపాటి వర్ష పాతం మరియు ఉదయం సమయాల్లో పొగ మంచు ఈ బూడిద తెగులు వ్యాపించటానికి సహకరిస్తాయి.

జీవ నియంత్రణ

తోటల కోసం పాలు-నీళ్ల మిశ్రమం ఒక సహజ శీలింద్ర నాశిని వలె పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని ఆకుల పైన రెండు రోజులకొకసారి పిచికారీ చేయాలి. ఇంట్లో తయారు చేసిన విరుగుడు మందు దోస జాతి ( కీరా దోస, గుమ్మిడి) మరియు బెర్రీ పండ్ల మొక్కల పైన బాగా పనిచేస్తాయి. ఈ పద్దతి అన్ని రకాల మొక్కలపైన పనిచేయదు. ఎటువంటి మెరుగుదల కనిపించకపోతే , వెల్లుల్లి లేదా సోడియం బైకార్బోనేట్ ద్రావణాన్ని ప్రయత్నించండి. వాణిజ్య జీవ నియంత్రణ పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. బూడిద తెగులు వల్ల చాలా పంటలు ప్రభావితం అయ్యే అవకాశం ఉండడం వలన ఈ తెగులును నివారించడానికి ప్రత్యేకంగా ఎటువంటి శిలీంద్ర నాశినులను సిఫారసు చేయలేము. నీటిలో కరిగే గంధకం, కార్బెన్డిజమ్, ట్రైఫ్లుమిజోల్, మైక్లోబ్యూటనిల్ ఆధారిత శిలీంధ్ర నాశినులు కొన్ని పంటలలో ఫంగస్ ఎదుగుదలను తగ్గించడానికి తోడ్పడుతాయి.

నివారణ చర్యలు

 • తెగులు నిరోధక లేదా తట్టుకునే విత్తన రకాలు వాడండి.
 • మొక్కలకు మంచి ప్రసరణ ఉండేలా మొక్కల మధ్యన ఎక్కువ స్థలాన్ని వదలాలి.
 • వ్యాధి లేదా తెగులు ఉనికి కోసం పొలాలను క్రమం తప్పకుండా పరిశీలించండి.
 • మొదటి సారి మచ్చలు కనిపించిన వెంటనే వ్యాధి సోకిన ఆకులను తీసివేయాలి.
 • ఈ తెగులుకు గురైన మొక్కలను తాకిన తర్వాత ఆరోగ్యమైన మొక్కలను తాకకండి.
 • ఒక మందపాటి ఆకులతో నేలపైన వేసిన రక్షణ కవచం( మల్చింగ్) బీజాంశాలు భూమి నుండి ఆకుల పైకి రాకుండా కాపాడతాయి.
 • కొన్ని సందర్భాలలో అతిథేయులు కాని పంటలతో పంట మార్పిడి కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.
 • సమతుల్య పోషకాలతో ఎరువులను వాడండి.
 • అధికమైన ఉష్ణోగ్రతల మార్పులను నివారించండి.
 • పంట కోత తరువాత పొలంలో బాగా లోతుగా పూడ్చిపెట్టడానికి నేలను బాగా దున్నాలి.
 • పంట కోత తర్వాత మొక్కల అవశేషాల్ని తొలగించాలి.