టమోటా ఆకు మాడు తెగులు

  • లక్షణాలు

  • ట్రిగ్గర్

  • జీవ నియంత్రణ

  • రసాయన నియంత్రణ

  • నివారణ చర్యలు

టమోటా ఆకు మాడు తెగులు

Phytophthora infestans

శీలీంధ్రం


క్లుప్తంగా

  • గోధుమ రంగు మచ్చలు ఆకుల అంచులపైన తెల్ల తోడుగులాంటిది ఆకుల కింది ప్రక్క భాగంలో.
  • బూడిద లేదా గోధుమ రంగు ముడతలు కలిగిన మరకలు పండ్ల పై కనిపిస్తాయి.
  • పండ్ల పైన తొక్క గట్టిపడి పండ్లు కుళ్లిపోతాయి.

ఆతిధ్యం ఇచ్చేవారు:

టమాటో

లక్షణాలు

గోధుమ- ఆకుపచ్చ మచ్చలు ఆకులపై కనిపిస్తాయి. తరువాత ఆకులు మొత్తం గోధుమ రంగులోకి మారుతాయి. తడి వాతావరణంలో ఆకుల కింద మచ్చలు బూడిద నుండి తెలుపు రంగు బూజు లాంటి ఎదుగుదల కనిపిస్తుంది. దీనివలన ఆరోగ్యంగా వున్నటిష్యూ మరియు నశించిన టిష్యూకు తేడా తెలుసుకోవచ్చు. చిగుర్లు గోధుమ వర్ణంలోకి మారి మెలికెలు తిరిగి ఎండిపోతాయి. కొన్ని సందర్భాలలో గోధుమ మచ్చలు మరియు తెలుపు రంగు తొడుగు కాండాలపై, కొమ్మలపై మరియు ఆకు కాడలపై కనిపిస్తాయి. బూడిద-ఆకుపచ్చ నుండి గోధుమ రంగు ముడతల మరకలు పండ్లపై కనిపిస్తాయి. ఈ ప్రదేశాలలో పండ్ల పైన తొక్క గట్టిపడుతుంది.

ట్రిగ్గర్

వేసవికాలం మధ్యలో ఈ తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఫంగస్, మొక్కల గాయాల ద్వారా ఈ ఫంగస్ మొక్కలోకి ప్రవేశించి పైన వున్న తోలును చించేస్తోంది. ఉష్ణోగ్రతలు మరియు తేమ వాతావరణం ఈ తెగులు ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అధికంగా తేమ (90 శాతం) వున్నప్పుడు మరియు 18 నుండి 26°C ఉష్ణోగ్రత వద్ద ఈ లేట్ బ్లెయిట్ తెగులు బాగా ఎదుగుతుంది. వెచ్చటి వాతావరణం మరియు వేసవికాలం పొడి వాతావరణంలో ఈ తెగులు విస్తరించడం ఆగిపోతుంది.

జీవ నియంత్రణ

ఇప్పుడు ఈ తెగులు నివారణకు జీవ సంబంధ నియంత్రణ మార్గాలు ఏమి లేవు. తెగులు వ్యాపించకుండా ఉండడానికి తెగులు సోకిన భాగాన్ని తొలగించి నాశనం చేయండి. తెగులు సోకిన మొక్కను కంపోస్టుగా ఉపయోగించకండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ లేట్ బ్లెయిట్ తెగులును అదుపుచేయడానికి ప్రోపమైడ్, క్లోరోతలోనిల్, ఫ్లువాజినం, మాంకోజెబ్ ఆధారిత శీలింద్ర నాశినులను పిచికారీ చేయవచ్చు. సాధారణంగా వర్షం పడే సూచన వున్న సమయంలోను లేదా ఓవర్ హెడ్ నీటి పారుదల వున్న పొలంలో మాత్రమే ఈ శీలింద్ర నాశినులను వాడవలసిన అవసరం ఉంటుంది.

నివారణ చర్యలు

  • నమ్మదగిన మూలాల నుండి ఆరోగ్యకరమైన విత్తనాలను కొనండి.
  • తెగులు నిరోధక వంగడాలు ఉపయోగించండి.
  • టమోటా మరియు బంగాళాదుంప పంటలు పక్క పక్క వేయకూడదు.
  • మంచి మురుగు నీటిపారుదల సౌకర్యం కల్పించి మొక్కలను ఎల్లప్పుడూ పొడిగా ఉంచండి.
  • టార్పాలిన్ మరియు చెక్కలతో పారదర్శకపు వర్షపు షెల్టర్ నిర్మించడం వలన ఉపయోగం ఉంటుంది.
  • ముఖ్యంగా మొలకల దశలో సిలికేట్ కలిగిన ఎరువులు ఫంగస్ కు వ్యతిరేకంగా బాగా పని చేస్తాయి.
  • సాయంత్రం వేళల్లో మొక్కలకు నీరు పెట్టకండి.
  • భూమి పైభాగంలో పడేటట్టు నీరు పెట్టండి.
  • పొలంలో వినియోగించిన పరికరాలను శుద్ధి చేయండి.
  • మొక్కలు బలంగా ఎదగడానికి మొక్కల బలవర్ధకాలను వాడండి.
  • రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఇతర పంటలతో పంట మార్పిడి చేయండి.