ప్రారంభ చీడ

  • లక్షణాలు

  • ట్రిగ్గర్

  • జీవ నియంత్రణ

  • రసాయన నియంత్రణ

  • నివారణ చర్యలు

ప్రారంభ చీడ

Alternaria solani

శీలీంధ్రం


క్లుప్తంగా

  • ఆకులపై ముదురు మచ్చలు కేంద్రీకృతమైన ఎదుగుదలతో కనిపిస్తాయి.
  • పసుపు వలయాలు ఆకులపై మరియు అక్కడక్కడా కాండంపై కూడా కనిపిస్తాయి.
  • పండ్లు కుళ్ళిపోవడం ప్రారంభమై చివరికి రాలిపోవచ్చు.
  • బంగాళాదుంపలపై గోధుమరంగు మరకలు మరియు కుళ్ళిన మచ్చలు ఏర్పడతాయి.

ఆతిధ్యం ఇచ్చేవారు:

కాప్సికమ్ మరియు మిరప

వంకాయ

టమాటో

బంగాళదుంప

లక్షణాలు

ప్రారంభ చీడ యొక్క లక్షణాలు ముదురు ఆకులు, కాండం మరియు పండ్ల మీద కనిపిస్తాయి. ఆకుల పై బూడిద నుండి గోధుమరంగు మచ్చలు కనిపిస్తాయి మధ్య భాగం లో "బుల్స్ ఐ" రూపంలో మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల చుట్టూ కాంతివంతమైన పసుపు వలయాలు ఏర్పడతాయి. ఈ తెగులు విస్తరించే కొలదీ మొత్తం ఆకులు రంగు కోల్పోయి రాలిపోతాయి. దీనివలన మొక్కల ఆకులు చాలా వరకు రాలిపోతాయి. ఇదేవిధమైన మధ్యలో ఖాళీ వున్న ముదురు కేంద్రీకృత మచ్చలు కాండంపై మరియు బంగాళా దుంప పైన ఏర్పడతాయి. ఒక సక్రమమైన ఆకారంలో లేని, కొద్దిగా నొక్కినట్టు వున్న మచ్చలు దుంప పైభాగంలో ఏర్పడతాయి. ఈ మచ్చల క్రింద దుంప కణజాలం గోధుమ రంగుతో తోలు లేదా కార్క్ వలే ఉంటుంది.

ట్రిగ్గర్

ఈ తెగులు లక్షణాలు ఆల్ట్రనేరియా సోలని అనే ఫంగస్ వలన ఏర్పడతాయి. ఈ ఫంగస్ తెగులు సోకిన పంట అవశేషాలపైన లేదా ఇతర మొక్కలపైన జీవించి ఉంటుంది. నర్సరీ లో కొనుగోలు చేసిన మొలకలపై అంతకు ముందే ఈ ఫంగస్ వుండే అవకాశం ఉంటుంది. ముదురు మొక్కలలో క్రింది భాగంలోని ఆకులు కలుషితమైన మట్టిని తాకడం వలన ఈ తెగులు వాటికీ సంక్రమిస్తుంది. 24-29°C ఉష్ణోగ్రతల వద్ద మరియు 90% కాని ఎక్కువ వున్న తేమ వద్ద ఈ ఫంగస్ త్వరగా వృద్ధి చెందుతుంది. ఈ ఫంగస్ ఆకు పైపొరలోనుండి చొచ్చుకుని వెళ్లడం ద్వారా లేదా ఆకులపై వున్న గాయాల ద్వారా లేదా ఆకు రంధ్రాల ద్వారా సంక్రమిస్తుంది. అధిక కాలం తడి వాతావరణం ఉండడం (లేదా ఒకసారి తడి ఒకసారి పొడి వాతావరణం) ఈ ఫంగస్ కు అనుకూలంగా ఉంటుంది. బీజాంశాల ఉత్పత్తి మరియు విడుదల గాలి ద్వారా వర్షపు చినుకుల ద్వారా లేదా పైనుండి మొక్కలకు నీరు పెట్టడం ద్వారా వ్యాపిస్తాయి. బాగా అధిక వర్షపాతం పడిన తర్వాత ఈ తెగులు సోకే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ తెగులు ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాలలో పంటకు చాలా అధికంగా నష్టం కలగచేస్తుంది.

జీవ నియంత్రణ

చిన్న రైతులు ఆల్గాల్ సున్నపు రాయిని, కొవ్వు తీసిన పాలు మరియు నీటిని (1:1) లేదా రాతి పొడిని ఈ తెగులును నివారించడానికి ఉపయోగించవచ్చు. 3 టీ స్పూన్ల తినే సోడాను మరియు చేప ఎమల్షన్ ను 4 లీటర్ల నీటిలో కలిపి వాడడం వలన మంచి ఫలితం ఉంటుంది. సేంద్రియ పదార్ధాలుగా గుర్తించబడిన బాసిల్లస్ సబ్టిలిస్ లేదా కాపర్ ఆధారిత శీలింద్ర నాశినులను వాడి కూడా ఈ తెగులును నివారించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణా చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ ఫంగస్ పైన పనిచేసే చాలా రకాల శీలింద్ర నాశినులు అందుబాటులో వున్నాయి. అజోక్షీ అజొక్సిస్ట్రోబిన్, పైరాక్లోస్ట్రోబిన్, డైఫెనోకోనజోల్, బోసకలైడ్,క్లోరోతలోనిల్, ఫెనామిడోన్, మానేబ్, మాంకోజెబ్. పైరాక్లొస్ట్రోబిన్, ట్రైఫ్లోక్సీస్ట్రోబిన్ మరియు జిరామ్ ల మిశ్రమాల ఆధారిత శిలీంద్రనాశినులను ఈ తెగులును నియంత్రించడానికి ఉపయోగించవచ్చు. ఒకొక్క సారి ఒకొక్క రకం మందులను వాడడం సిఫారసు చేయబడినది. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ మందులను సమయానుసారం వాడాలి. కోసిన పంటలో ఈ పురుగుల మందుల అవశేషాలు లేకుండా ఉండడానికి పంట కోతలు చేసే కొద్ది సమయానికి ముందుగా ఈ మందులను ఉపయోగించడం మంచిది.

నివారణ చర్యలు

  • ధృవీకరించబడిన రోగకారక-రహిత విత్తనాలు లేదా మొలకలు వాడండి.
  • ఎతైన గట్లపైన విత్తనాలను నాటి పొలంలో మురుగు నీటి సదుపాయం మెరుగ్గా వుండేటట్టు చూడండి.
  • గాలి వీచే దశను బట్టి మొక్కలను వరుసలలో నాటండి.
  • నీడ వున్న ప్రదేశాలలో మొక్కలు నాటవదు.
  • వర్షం పడిన తర్వాత లేదా నీరు పెట్టిన తర్వాత మొక్కలు త్వరగా ఆరడానికి వీలుగా మొక్కల మధ్యన సరైన దూరం పాటించండి.
  • మట్టిపైన మల్చింగ్ ను ఏర్పాటు చేయండి.
  • దీనివలన మొక్కలు మట్టికి తగలకుండా చూడవచ్చు.
  • పొలాన్ని తరుచూ గమనిస్తూ తెగుళ్ల లక్షణాల కొరకు, ముఖ్యంగా తడి వాతావరణంలో, గమనిస్తూ వుండండి.
  • మట్టికి బాగా దగ్గరగా వున్న మొక్కల క్రింది ఆకులను కత్తిరించండి.ఈ తెగులు లక్షణాలు కలిగిన ఆకులను తొలగించి నాశనం చేయండి.
  • సరైన పోషకాలను మొక్కలకు అందించి అవి బలంగా మరియు మంచి సత్తువతో వుండేటట్టు చూడండి.
  • ఆకులపై తడిని తగ్గించడానికి డ్రిప్ పద్దతిని పాటించండి.
  • మొక్కలకు ఉదయం సమయాన నీరు పెట్టండి.
  • ఇలా చేయడం వలన సాయంత్రానికి ఆకులు ఆరిపోతాయి.
  • పొలంలో మరియు పొలం చుట్టుప్రక్కలా కలుపు మొక్కలను తొలగించండి.
  • మొక్కలు తడిగా వున్నప్పుడు పొలంలో పనిచేయకండి.
  • పంట కోతల తర్వాత పంట అవశేషాలను తొలగించి కాల్చివేయండి.
  • (వీటిని కంపోస్ట్ గా మార్చవద్దు).
  • లేదా ఈ అవశేషాలను పొలంలో బాగా లోపల వరకు దున్ని పూడ్చి పెట్టండి.
  • ( 45 సెంటీమీటర్ల కన్నా లోతుగా).
  • ఈ తెగులు సోకని మొక్కలతో రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయండి.
  • దుంపలను చల్లని ఉష్ణోగ్రతలు మరియు బాగా గాలి తగిలే ప్రదేశంలో నిల్వ చేయండి.