మొలకలలో నారు కుళ్ళు తెగులు

  • లక్షణాలు

  • ట్రిగ్గర్

  • జీవ నియంత్రణ

  • రసాయన నియంత్రణ

  • నివారణ చర్యలు

మొలకలలో నారు కుళ్ళు తెగులు

Pythium spp.

శీలీంధ్రం


క్లుప్తంగా

  • మొలకలు ఇంకా రాని దశలో విత్తనాలు మట్టిలో కుళ్లిపోతాయి.
  • మొలకలు మట్టిలోనుండి పైకి రాకుండానే చనిపోతాయి.
  • మొలకలు వచ్చిన తర్వాత నీటిలో నానినట్టు వుండే, బూడిద రంగు లేదా గోధుమ రంగు లేదా నల్లని కణజాలం కాండం మొదలు వద్ద ఏర్పడతాయి.
  • లేత మొక్కలు లేదా చెట్లు మట్టికి దగ్గరలో కుప్పకూలిపోతాయి.
  • తెల్లని లేదా బూడిద రంగు బూజు లాంటి పెరుగుదల వీటిని కప్పి ఉంటుంది.

ఆతిధ్యం ఇచ్చేవారు:

చిక్కుడు

కాప్సికమ్ మరియు మిరప

క్యారెట్లు

బఠానీ

కీర దోస

గుమ్మడికాయ

కీర దోస

టమాటో

క్యాబేజీ

లెట్టూస్

బంగాళదుంప

శనగలు & సెనగ పప్పు

గోధుమ

ఉల్లిపాయ

మొక్కజొన్న

వేరుశనగ

మామిడి

బొప్పాయి

బార్లీ

పుచ్చకాయ

షుగర్ బీట్

కందులు

అలంకరణ

plant_turmeric

లక్షణాలు

వేరు కుళ్ళు తెగులు మొలకలు మరియు మొక్క ఎదిగే రెండు దశలలో సోకవచ్చు. మొలకలు రాకముందు మరియు వచ్చిన తర్వాత కూడా ఇది మొక్కలకు సంక్రమించవచ్చు. మొలకలు రాకముందు సంక్రమించినట్లైతే విత్తనాలు వేసిన వెంటనే ఈ ఫంగస్ విత్తనాలలో నివాసం ఏర్పరచుకుంటుంది. దీనివలన విత్తనాలు కుళ్లిపోయి అంకురోత్పత్తి జరగదు. మొలకలు వచ్చిన తర్వాత మొలకల ఎదుగుదల తగ్గిపోతుంది. కాండం మొదళ్లవద్ద కుళ్లిపోవడం మొదలవుతుంది. నీటిలో నానినట్లు వున్న మెత్తని సన్నని బూడిద రంగు, గోధుమరంగు లేదా నల్లని మచ్చలు కనపడతాయి. లేత మొక్కలు లేదా చెట్లు రంగు కోల్పోయి వాలిపోవడం మొదలవుతుంది. చివరకు మొదలు వద్ద నరికేసినట్లై కూలిపోతాయి. తెల్లని లేదా బూడిద రంగు బూజు ఈ చనిపోయిన మొక్కలపై లేదా మట్టిపై ఏర్పడతాయి. మొలకలు బాగా అధిక మొత్తంలో నష్టపోతే మళ్ళీ కొత్త మొలకలు వేయవలసి ఉంటుంది.

ట్రిగ్గర్

ఈ తెగులు చాలా రకాల పంటలను ఆశించవచ్చు. ఇది జెనస్ పాలిథియం అనే ఫంగస్ వలన సంక్రమిస్తుంది. ఈ ఫంగస్ మట్టిలో కానీ పంట అవశేషాలపైనా కానీ సంవత్సరాల తరబడి జీవించే ఉంటుంది. చలికాలంలో వెచ్చగా వున్నప్పుడు, వర్షాకాలంలో లేదా మట్టిలో బాగా అధికంగా తేమ వున్నప్పుడు మొక్కలు బాగా దగ్గరగా నాటినప్పుడు ఈ తెగులు త్వరితంగా వృద్ధిచెందుతుంది. నీరు నిలిచి వున్నపుడు లేదా అధిక నత్రజని వాడినా మొక్కలు బలహీనంగా వున్నప్పుడు ఈ తెగులు బాగా వృద్ధిచెందుతుంది. కలుషితమైన పరికరాల వలన లేదా పనిముట్ల వలన, బట్టలు , చెప్పులకు అంటిన మట్టి ద్వారా ఈ ఫంగస్ బీజాంశాలు వ్యాప్తి చెందుతాయి. మొక్కల ఏ దశలోగా ఈ తెగులు సంక్రమించవచ్చు. అంకురోత్పత్తి జరుగుతున్న విత్తనాలు లేదా లేత మొలకలకు ఈ తెగులు సులభంగా సంక్రమిస్తుంది. ఈ తెగులు ఒక సీజన్ నుండి ఇంకొక సీజన్ కు విస్తరించే అవకాశం తక్కువ. కానీ ఈ తెగులు సోకడానికి అనుకూలమైన పరిస్థితులు వున్నప్పుడు ఇది మళ్ళీ తరువాత సీజన్ పంటకు కూడా సంక్రమిస్తుంది.

జీవ నియంత్రణ

ట్రైకోడెర్మా విరిడే, బెయువేరియా బస్సియన లేదా బ్యాక్టీరియల్ స్యుడోమోనాస్ ఫ్లోరెస్సెన్స్ వంటి జీవ శీలింద్ర నాశినులను విత్తన శుద్ధి కొరకు ఉపయోగించవచ్చు లేదా మొక్కలు వేస్తున్నప్పుడు వేర్ల చుట్టూ వేయడం వలన మొలకలు రాకముందు వచ్చే వేరు కుళ్ళు తెగులును నివారించవచ్చు. కొన్ని పరిస్థితులలో, కాపర్ ఆధారిత శీలింద్ర నాశినులను లేదా బోర్డెయక్స్ తో విత్తన శుద్ధిని చేయడం ద్వారా ఈ తెగులు సంక్రమించకుండా లేదా తెగులు తీవ్రత అధికంగా ఉండకుండా చేయవచ్చు. ఇంట్లో తయారుచేసుకోగల యుపటోరియం కన్నబినం మొక్కల సారం ఈ ఫంగస్ఎదుగుదలను పూర్తిగా అరికడుతుంది. "స్మోక్ వాటర్" ను పొలంలో ఉపయోగించడం ( మొక్కలను కాల్చి ఆ బొగ్గును నీటిలో కలపడం) వలన కూడా ఈ ఫంగస్ ను నియంత్రించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణా చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పొలంలో పని చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, నివారణా చర్యలు తీసుకోవడం వలన ఈ తెగులు పంటకు సంక్రమించకుండా చేయవచ్చు. ఈ తెగులు సోకిన చరిత్ర వున్న పొలాలు సరైన మురుగు నీటి పారుదల సౌకర్యం లేని పొలాలలో ముందు జాగ్రత్తగా శీలింద్ర నాశినులను వాడడం మంచిది. థీరమ్ తో విత్తన శుద్ధిని చేసి మొలకలు రాకముందు ఈ తెగులు సంక్రమించకుండా నివారించవచ్చు. మెటలాక్సేల్, మెటలాక్సేల్-M ను ఆకులపై పిచికారీ చేయడం లేదా వాతావరణం మబ్బులతో వున్నప్పుడు ప్రోపమోకార్బ్ ను వాడడం కూడా ఈ తెగులును నియంత్రించడంలో సహాయం చేస్తుంది. మొక్కలు వేసినప్పటినుండి ప్రతి 15 రోజులకు ఒకసారి కప్తాన్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ తో మట్టిని లేదా మొక్క మొదళ్ళు మునిగేటట్టు చేయడం వలన ఈ తెగులు సంక్రమించకుండా నివారించవచ్చు.

నివారణ చర్యలు

  • ఆరోగ్యకరమైన సర్టిఫైడ్ విత్తనాలను ఉపయోగించండి.
  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక రకాలను వాడండి.
  • సరైన మురుగు నీటి వ్యవస్థ లేని మరియు చిత్తడి నేలల్లో ఎత్తుగా వేసిన గట్లపైన విత్తనాలను నాటండి.
  • విత్తనాల మధ్యన దూరం సరైన అంతరం పాటించి మొక్కలు సరిగా ఆరేటట్టు చూడండి.
  • మొక్కలను నాటుతున్నప్పుడు బాగా లోతుగా పాతరాదు.
  • తెగులు లక్షణాలను గమనించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను తొలగించండి.
  • సమగ్ర ఎరువుల విధానాన్ని పాటించండి.
  • నత్రజనిని వాయిదాలలో వేయండి.
  • నీటిని తరచుగా పైపైన పెట్టండి.
  • తెల్లవారుజామున నీరు పెట్టండి.
  • దానివలన సాయంత్రానికి మట్టి పొడిగా అవుతుంది.
  • కాండానికి నీరు తగలకుండా కాండం చుట్టూ గుంతలు తవ్వి నీరు పెట్టండి.
  • ఒక పొలంలోనుండి ఇంకొక పొలానికి మట్టిని తరలించకండి.
  • పొలంలో వాడే పనిముట్లను ఇంట్లో వాడే బ్లీచ్ తో బాగా శుభ్రంగా ఉంచండి.
  • పంట కోతలు ముగిసిన వెంటనే పంట అవశేషాలను నాశనం చేయండి.
  • ఈ తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి చేయండి.
  • వీలైతే నారుమడిపై ప్లాస్టిక్ కవరు తో కప్పి సూర్యరశ్మి తగిలేటట్టు చేయండి.