టొమాటోలో స్పాటేడ్ విల్ట్ వైరస్

  • లక్షణాలు

  • ట్రిగ్గర్

  • జీవ నియంత్రణ

  • రసాయన నియంత్రణ

  • నివారణ చర్యలు

టొమాటోలో స్పాటేడ్ విల్ట్ వైరస్

TSWV

వైరస్


క్లుప్తంగా

  • ఆకుల పైన ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తరువాత నిర్జీవమైన అతుకులవలె మారిపోతాయి.
  • నిర్జీవ కణాలు ఏర్పడి ఎదుగుదల తగ్గిపోవడం జరుగుతుంది.
  • లేత పచ్చ రంగు వృత్తాకార మచ్చలు ఇంకా పక్వానికి రాని పండ్లపైన ఏర్పడతాయి.
  • మగ్గిన పండ్లపైన గోధుమ రంగు వృత్తాలు మరియు పాలిపోయిన మచ్చలు ఏర్పడతాయి.
  • అప్పుడప్పుడు పండ్లు ఆకారం మారిపోతాయి.

ఆతిధ్యం ఇచ్చేవారు:

కాప్సికమ్ మరియు మిరప

టమాటో

బంగాళదుంప

లక్షణాలు

ఆకులు, ఆకు కాడలు, కాండం మరియు పండ్లపై ఈ తెగులు లక్షణాలు ఒకొక్క దశలో ఒకొక్క విధంగా మరియు వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటాయి. ఈ తెగులు మొక్కల పైనుండి క్రిందకి వ్యాపిస్తుంది. లేత ఆకులపై చిన్న ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవి నీళ్లడిగా ఒకఏ ప్రాంతంలో వలయాకారంలో కేంద్రీకృతమై ఉంటాయి. ఈ మచ్చలు అన్ని కలిసినప్పుడు ఇవి అన్ని ఆకు అంతా పరుచుకుంటాయి. దీని వలన కణజాలం నిర్జీవంగా అవుతుంది. కాండంపై మరియు ఆకు కాడలపై ముదురు గోధుమ చారలు ఏర్పడవచ్చు. ఎదుగుతున్న చిగుర్లకు ఈ తెగులు వలన తీవ్రంగా నష్టం కలుగుతుంది. ఒక పద్దతి ప్రకారం ఇవి నిర్జీవమయిపోతాయి. మొక్కల్లో ఎదుగుదల తగ్గి ఒక ప్రక్క మాత్రమే ఎదగవచ్చు. ఈ తెగులు అధికంగా సోకితే మచ్చలు పడిన లేత పచ్చ వృత్తాలతో కూడిన మరియు ఉబ్బెత్తుగా వుండే మచ్చలతో పక్వానికి రాని టొమాటో పండ్లు ఏర్పడతాయి. ఈ టొమాటోలు పండినప్పుడు ఎర్రని పండ్లు , బాగా తీవ్రంగా కనిపించే గోధుమ రంగు వలయాలతో ఉండి ఈ మచ్చల మధ్యన నిర్జీవ మచ్చలు మరియు ఏర్పడడం వలన ఈ పండ్లు అమ్మకానికి పనికి రావు.

ట్రిగ్గర్

టొమాటో మచ్చల విల్ట్ వైరస్ (TSWV) వెస్ట్రన్ ఫ్లవర్ త్రిప్స్(ఫ్రాంక్లినియెల్లా), ఉల్లి తామర పురుగులు(త్రిప్స్ టబాసి)మరియు మిరప తామర పురుగులు( స్కిర్తోత్రిప్స్ డోర్సాల్లీస్) వంటి చాలా రకాల జాతుల తామర పురుగుల వలన సంక్రమిస్తుంది. TSWV తామర పురుగుల వంటి వాహకాలపైన కూడా చురుకుగా ఉంటాయి. తెగులు సోకిన మొక్కలను ఆహారంగా తిని ఈ వైరస్ ను వాటి జీవిత కాలమంతా ఇతర మొక్కలకు సంక్రమింపచేసి సామర్ఢ్యముతో ఉంటాయి. కానీ ఈ TSWV ఈ వైరస్ సోకిన ఆడ పురుగుల ద్వారా గుడ్లకు సంక్రమించవు. ఈ వైరస్ కు టొమాటో, పండు మిరప, బంగాళా దుంప, లెట్టూస్ మరియు చాలా రకాల ఇతర మొక్కలు ఆతిధ్యం ఇస్తాయి.

జీవ నియంత్రణ

వీటి లార్వాను లేదా ప్యుపాను లేదా తామర పురుగుల ప్యుపాను తినే కొన్ని రకాల మైట్స్ వాణిజ్యపరంగా అందుబాటులో వున్నాయి. పువ్వులను కాకుండా ఒక్క ఆకులపై మాత్రమే దాడిచేసే పురుగులను నియంత్రించడానికి, ముఖ్యంగా ఆకుల క్రింది భాగంలో, వేప నూనె లేదా స్పైనోసాడ్ లను వాడవచ్చు. ఈ వైరస్ ను నివారించడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి కానీ కొన్ని జాతుల సహజ శత్రువులపై (ఉదాహరణకు మైట్స్, స్పైనోసాడ్ ఈగల లార్వా, తేనెటీగలు) ఇవి విషప్రభావాన్ని చూపిస్తాయి. మొక్కలు పుష్పించే సమయంలో వీటిని వాడరాదు. ఫ్లవర్ తామర పురుగుల తెగుళ్లను నియంత్రించడానికి కొన్ని రకాల మైట్స్ ను లేదా పచ్చ లేస్ వింగ్స్ కీటకాలను ఉపయోగించవచ్చు. అల్లం కషాయాన్ని కొన్ని రకాల కీటక నాశినులతో కలిపి ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తామర పురుగులు చాలా త్వరగా వీటి సంతతిని వృద్ధి చేసుకోవడం మరియు వీటి జీవిత చక్రం వలన ఇవి వివిధ రకాల పురుగులమందులకు నిరోధకతను ఏర్పరచుకున్నాయి. తగిలిన వెంటనే పురుగులు చనిపోయే అజాడిరచితిన్ లేదా పెరిథ్రోయిడ్స్ పురుగుల మందులను పెప్పరోనిల్ బుటాక్సైడ్ తో కలిపి వాడి ఈ పురుగులను నివారించవచ్చు.

నివారణ చర్యలు

  • టొమాటోలో స్పాటేడ్ విల్ట్ వైరస్ లను సరిగా నియంత్రించే నర్సరీలలోని మొక్కలను ఉపయోగించండి.
  • ఈ తెగులుకు అతిథులుగా వుండే ఇతర మొక్కల వద్ద లేదా ఈ తెగులు సొకిన మొక్కల వద్ద పంటను సాగుచేయకండి.
  • నాటే మొక్కలపై కీటకాల ఉనికి లేదని నిర్ధారించుకోవడానికి మొక్కలను క్షుణ్ణంగా తనిఖీ చేయండి.
  • తెగులు నిరోధక టొమాటో రకాలను ఉపయోగించండి.
  • వీటిని వాడడం వలన తామర పురుగుల నివారణ కోసం కీటక నాశినులు వాడనవసరం ఉండదు.
  • అధిక మొత్తంలో జిగురు వలలను వుపయోగించి ఈ కీటకాలను పట్టుకోండి.
  • పొలంలో మరియు పొలం చుట్టూ ప్రక్కల కలుపు మొక్కలను తొలగించండి.
  • తెగులు సోకిన మొక్కల భాగాలను మరియు మొక్కలను తొలగించి నాశనం చేయండి.
  • మొక్కలకు సరిపడా నీరు పెట్టండి.
  • అధిక మోతాదులో నత్రజని ఎరువులను వాడకండి.
  • పంటల మధ్యన విరామం సమయంలో గ్రీన్ హౌస్ లను ఆవిరితో శుభ్రం చేయండి.
  • అధికంగా ప్రతిబింబించే అల్ట్రా వయొలెట్ కవర్లను మట్టిపై (లోహపు మల్చింగ్) ఈ తామర పురుగులను ప్రాలద్రోలండి.