టమోటోలో బ్యాక్టీరియల్ మచ్చ

  • లక్షణాలు

  • ట్రిగ్గర్

  • జీవ నియంత్రణ

  • రసాయన నియంత్రణ

  • నివారణ చర్యలు

టమోటోలో బ్యాక్టీరియల్ మచ్చ

Xanthomonas spp.

బ్యాక్టీరియా


క్లుప్తంగా

  • లేత ఆకులపై పసుపు- ఆకుపచ్చ రంగు చిన్న మచ్చలు ఏర్పడతాయి.
  • ఆకులు రూపం కోల్పోయి చుట్టుకుపోతాయి.
  • చుట్టూ పసుపు రంగు వలయంతో నీటిలో తడిచినట్టు వుండే ముదురు మచ్చలు ముదురు ఆకులపైన మరియు పండ్ల పైన ఏర్పడతాయి.

ఆతిధ్యం ఇచ్చేవారు:

టమాటో

లక్షణాలు

ఈ బ్యాక్టీరియ ఆకులు, కాండం మరియు టొమాటో పండ్లపై దాడి చేస్తుంది. లేత ఆకులపై పసుపు- ఆకుపచ్చ రంగు చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఆకులు రూపం కోల్పోయి చుట్టుకుపోతాయి. చుట్టూ పసుపు రంగు వలయంతో నీటిలో తడిచినట్టు వుండే ముదురు మచ్చలు ముదురు ఆకులపైన మరియు పండ్లపైన ఏర్పడతాయి. ఇవి ముందుగా ముదురు పచ్చ రంగులో జిడ్డుగా కనపడతాయి. ఇవి ఆకుల అంచులపై లేదా ఆకు కొనభాభంపై చాలా పెద్ద మొత్తంలో ఏర్పడతాయి. పరిస్థితులు వీటికి అనుకూలంగా ఉంటే ఇవి 0.25 నుండి 0.5 సెంటీమీటర్ల వరకూ పెరిగి రాగి రంగు నుండి ఎర్రని గోధుమ రంగులోకి మారతాయి. చివరికి ఈ మచ్చలు మధ్య భాగంలో ఎండిపోయి రాలిపోవడం వలన షాట్ మచ్చల వలే కనిపిస్తాయి. పండ్లపై ముందుగా పాలిపోయిన నీటిలో తడిచిన పచ్చ రంగులో మచ్చలు (0.5 సెంటీమీటర్ల వరకూ) ఏర్పడతాయి. ఈ మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. తరువాత ఇవి గోధుమ రంగు పొక్కులుగా మారతాయి. .

ట్రిగ్గర్

జెనస్ క్షంతోమోనాస్ అనే బ్యాక్టీరియా యొక్క వివిధ జాతుల వలన ఈ బ్యాక్టీరియా మచ్చ తెగులు ఏర్పడుతుంది. ఈ తెగులు ప్రపంచమంతా వ్యాపించి వుంది. దీని వలన వెచ్చని మరియు తేమ వాతావరణాలలో పండించే టొమాటో పంటలో తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఈ సూక్ష క్రిములు విత్తనాలలో, విత్తనాల పైన, పంట అవశేషాలపై, లేదా కొన్ని రకాల కలుపు మొక్కలపైన జీవిస్తాయి. ఇది చాలా తక్కువ కాలం అనగా కొద్ది రోజుల నుండి వారాల మట్టిలో జీవిస్తుంది . పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇది వర్షం ద్వారా లేదా పైనుండి పంటకు నీరు పెట్టినప్పుడు ఆరోగ్యంగా వున్న మొక్కలకు సంక్రమిస్తుంది. ఆకులకు వుండే రంద్రాల ద్వారా మరియు గాయాల ద్వారా మొక్కలోనికి ప్రవేశిస్తుంది. ఇది వృద్ధి చెందడానికి 25 నుండి 30°C ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి. ఒక్కసారి ఈ తెగులు సోకితే దీనిని నియంత్రించడం చాలా కష్టం. పంట మొత్తం నష్టపోవడం జరుగుతుంది. .

జీవ నియంత్రణ

బ్యాక్టీరియాల్ మచ్చ తెగులును నియంత్రిచడం చాలా కష్టమైనదే కాకుండా చాలా ఖర్చుతో కూడుకున్నది. సీజన్లో ముందుగా ఈ తెగులు సోకితే మొత్తం పంటను నాశనం చేయడాన్ని పరిగణలోకి తీసుకోండి. కాపర్ ఆధారిత బ్యాక్టీరియా నాశినులు కొంత వరకు ఆకులకు మరియు పండ్లకు రక్షణ కల్పిస్తాయి. ఈ బ్యాక్టీరియాను చంపడానికి బ్యాక్టీరియాల్ వైరస్ (బాక్టోరియాఫెగస్)లాంటి ప్రత్యేకమైన వైరస్ అందుబాటులో వుంది. 1.3% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంలో ఒక నిముషం పాటు విత్తనాలను ముంచి ఉంచడం లేదా వేడి నీటిలో(50°C) 25 నిముషాలు ఉంచడం వలన ఈ తెగులు సంక్రమణను తగ్గిస్తుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కాపర్ కలిగివున్న బ్యాక్టీరియా నాశినులను మొక్కలను రక్షించడానికి ఉపయోగించవచ్చు. ఇది కొంత వరకు తెగులును నిరోధిస్తుంది. ఈ తెగులు లక్షణాలను గుర్తించిన వెంటనే ఒకసారి ఈ మందులను వాడాలి. మరల 10 నుండి 14 రోజులకు ఒకసారి వెచ్చని తేమ వాతావరణం వున్నప్పుడు ఇంకొకసారి వాడాలి. ఈ తెగులు కాపర్ నిరోధకతను కలిగి ఉండడం వలన కాపర్ ఆధారిత బ్యాక్టీరియా నాశినులను మాంకోజెబ్ తో కలిపి వాడడం సిఫార్స్ చేయబడినది.

నివారణ చర్యలు

  • ధ్రువీకరించిన తెగుళ్లు లేని విత్తనాలను వాడండి.
  • మీకు స్థానికంగా అందుబాటులో ఉంటే తెగులు నిరోధక విత్తన రకాలనే ఉపయోగించండి.
  • పొలాన్ని తరుచూ గమనిస్తూ వుండండి ముఖ్యంగా మబ్బులు కమ్మి వున్నప్పుడు.
  • ఏ మొలకలకైనా మరియు మొక్కల భాగాలకు మచ్చలు ఉంటే వాటిని తొలగించి నాశనం చేయండి.
  • పొలంలో మరియు పొలం చుట్ట ప్రక్కల కలుపు మొక్కలను తొలగించండి.
  • మట్టి నుండి మొక్కలకు తెగులు సోకకుండా ఉండడానికి మట్టిపైన ఆకులను కప్పండి.
  • పొలంలో ఉపయోగించే పనిముట్లను బాగా శుభ్రపరచండి.
  • మొక్కలకు పైనుండి నీరు పెట్టకండి.
  • ఆకులు తడిగా వున్నప్పుడు పొలంలో పనిచేయకండి.
  • పంట కోతల తర్వాత పంట అవశేషాలను పొలంలో బాగా లోతుగా పాతి పెట్టండి.
  • లేదా పంట అవశేషాలను తొలగించి కొన్ని వారాల వరకు పొలాన్ని బీడుగా వదిలేయండి(సోలరైజేషన్).
  • రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి చేయండి.