తెల్ల ఈగలు

  • లక్షణాలు

  • ట్రిగ్గర్

  • జీవ నియంత్రణ

  • రసాయన నియంత్రణ

  • నివారణ చర్యలు

తెల్ల ఈగలు

Aleyrodidae

కీటకం


క్లుప్తంగా

  • చిన్న చిన్న తెల్ల ఈగలు ఆకుల కింది భాగంలో ఉండి మొక్కను విదిలించినప్పుడు చెదిరిపోతాయి.
  • ఆకు పొరలపైన పసుపు రంగు పాలిపోయిన (క్లోరోటిక్) మచ్చలు మరియు నల్ల బూజు ఏర్పడతాయి.
  • ఈ మచ్చలు అన్నీ తరవాత కలిసి పోయి ఈనెల ప్రాంతంలో తప్ప మిగిలిన ఆకు అంతా పసుపు రంగులోకి మారిపోతుంది.
  • ఎదుగుదల తగ్గిపోతుంది మరియు మొక్కల్లో సత్తువ తగ్గిపోతుంది.

ఆతిధ్యం ఇచ్చేవారు:

చిక్కుడు

కాప్సికమ్ మరియు మిరప

వంకాయ

చెర్రీ

కీర దోస

గుమ్మడికాయ

కీర దోస

టమాటో

క్యాబేజీ

లెట్టూస్

బంగాళదుంప

మినుములు మరియు పెసలు

పసుపు కంది పప్పు మరియు ఎరుపు కంది పప్పు

శనగలు & సెనగ పప్పు

ప్రత్తి

సోయాబీన్

ఇతరములు

ఉల్లిపాయ

జొన్న

మొక్కజొన్న

స్ట్రాబెర్రీ

అరటి

నిమ్మజాతి

వేరుశనగ

కర్ర పెండలం

చెరుకు

పుచ్చకాయ

కందులు

కాలీఫ్లవర్

అలంకరణ

లక్షణాలు

ఈ తెల్ల ఈగలు పొలంలో మరియు గ్రీన్ హౌసులో పండించే రకాల మొక్కలను ఆశిస్తాయి. లార్వా మరియు పెద్ద పురుగులు మొక్కల కణజాలాన్ని తిని తేనె బంకను ఆకులపై, కాండంపై మరియు పండ్లపై విసర్జిస్తాయి. క్లోరోటిక్ మచ్చలు మరియు నల్ల బూజు ఈ తెగులు సోకియాన్ ప్రాంతాల వద్ద కనిపిస్తాయి. ఈ తెగులు అధికంగా వున్నప్పుడు ఈ మచ్చలు అన్ని ఒక్కటిగా కలిసిపోయి ఆకు మొత్తం వ్యాపిస్తాయి. ఆకులు ఆకారం కోల్పోయి చుట్టుకుపోయి కప్ వంటి ఆకారంలోకి మారతాయి. తెల్ల దోమలు టమాటో పసుపు ముడత వైరస్ లేదా కాస్సావా గోధుమ చారల వైరస్ వంటి వాటిని సంక్రమింప చేస్తాయి.

ట్రిగ్గర్

తెల్ల దోమలు 0.8 నుండి ఒక సెంటీమీటర్ పొడవు ఉంటాయి. వీటి శరీరం మరియు రెండు జతల రెక్కలు తెలుపు నుండి పసుపు బూడిద, మైనపు స్రావంతో కప్పబడి ఉంటుంది. ఇవి ఎక్కువగా ఆకుల క్రింది భాగంలో కనిపిస్తాయి. వీటిని కదిపినట్లైతే తేళ్లను మేఘం లాగ ఒక్కసారే పైకి వస్తాయి.ఇవి పొడి మరియు వెచ్చని వాతావరణంలో జీవిస్తాయి. అందువల్ల పొలంలో వేసిన పంటలపై కూడా ఇవి జీవిస్తాయి. ఇవి ఆకుల క్రింద గుడ్లు పెడతాయి. పిల్ల పురుగులు పసుపు రంగు నుండి తెల్లని రంగులో ఉండి చదునుగా, కోలగా మరియు పాలిపోయిన పచ్చ రంగులో ఉంటాయి. ఆహారం లేకుండా ఇవి ఎక్కువ కాలం బ్రతకలేవు. అందువలన ఈ తెగులును నివారించడంలో కలుపు మొక్కల నియంత్రణ చాలా ముఖ్యమైనది.

జీవ నియంత్రణ

తెల్ల ఈగల జాతులపైన మరియు పంట పైన ఆధారపడి వాటికి సంబంధించిన జీవ నియంత్రణలను వాడాలి. షుగర్ ఆపిల్ నూనె (అన్నోనా స్క్యూవమోస), పెరిత్రిన్స్, కీటక నాశక సబ్బులు, వేల గింజల సారం (NSKE 5%), వేప నూనె (5 మిల్లీలీటర్లు/ఒక లీటర్ నీటికి) సిఫార్స్ చేయబడింది. పరాన్న జీవి కందిరీగలు ఇంకార్సియా ఫర్మోస, ఏరిటమోసరస్ యెరేముకస్, పచ్చ రెక్కల పురుగు క్రేసోపేర్ల కార్నియా లేదా డెల్ఫాస్టాస్ spp వంటి పెంకు పురుగులను సాధారణంగా ఉపయోగిస్తారు. ఇతర సహజ కీటకాలైన నెమటోడ్లు, పచ్చ రెక్కల పురుగులు మరియు డాంసెల్, లేడీ బర్డ్స్, మైన్యూట్ పైరేట్ బగ్స్, పెద్ద కన్ను కీటకాలు కూడా ఉపయోగించవచ్చు. తెగులు కారక సూక్ష్మ క్రిములైన బెయువేరియా బస్సియన, ఇస్సరియ ఫుమ్సోరోసియా, వెర్టిసిల్లీయం లెక్కని మరియు పెసిలోమైసిస్ ఫుమోసోరోస్స్ లను కూడా ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెల్ల ఈగలు చాలా త్వరగా పురుగులమందులకు నిరోధకతను పెంచుకుంటాయి. అందువలన ఒక దాని తర్వాత ఇంకొక మందులను మార్చి మార్చి వాడడం మంచిది. ప్రత్యామ్నాయ చికిత్స ఏమి లేకపోతే బైఫెంత్రిన్, బుప్రోఫెజిన్, ఫెంప్రోపత్రిన్, అమిత్రజ్,ఫెనోక్సీకార్బ్, డెల్టామిత్రిన్, అజాడిరక్టిన్, పైమెట్రోజిన్ లేదా స్పిరోమెస్ఫిన్ వాడటం వలన కూడా ఈ కీటకాలను నిర్మూలించవచ్చు. నివారణ చర్యలు తీసుకోవడం వలన ఈ కీటకాల జనాభాను పంటకు నష్టం కలిగించని విధంగా తగ్గించవచ్చు.

నివారణ చర్యలు

  • ఈ తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి చేయాలి.
  • ఈ తెల్ల దోమలను ఆకర్షించడానికి మరియు ప్రాలద్రోలడానికి ఇతర మొక్కలను పొలంలో అంతర పంటగా వేయండి.
  • (నాస్టుర్టియంస్, జిన్నియాస్, హుమ్మింగ్ బర్డ్ బుష్, పైనాపిల్ సెజ్, బీ బామ్) సీజన్లో బాగా ముందుగా కానీ ఆలస్యంగా కానీ కాకుండా సరైన సమయంలో విత్తనాలు నాటండి.
  • మొక్కలను దగ్గరగా నాటండి.
  • మొక్కలు వేసిన తర్వాత ఈ తెల్ల ఈగలు పంటను ఆశించాయేమో తెలుసుకోవడానికి పొలాన్ని పరిశీలించండి.
  • గుడ్లు లేదా లార్వా వున్న ఆకులను తొలగించండి.
  • తెగులు సోకిన మొదట్లో పొలంలో జిగురు వలలు ఏర్పాటుచేసి ఈ కీటకాలను మొత్తంగా పట్టుకోండి.
  • పొలంలో కలుపు మొక్కలను మరియు ఇతర అతిధి మొక్కలను తొలగించండి.
  • సరైన సంతులిత ఎరువులను వాడండి.
  • విస్తృత పరిధి కల కీటక నాశినులను ఉపయోగించకండి.
  • పంట కోతలు ముగిసిన తర్వాత గ్రీన్ హౌస్ లో పంట అవశేషాలను తొలగించి నాశనం చేయండి.
  • వెచ్చని ఉష్ణోగ్రతలు వున్నప్పుడు స్వల్పకాలిక రకాలను సాగు చేయండి.
  • అల్ట్రా వయొలెట్ కిరణాలను సంగ్రహించే ప్లాస్టిక్ ఫిల్మును ఉపయోగించడం వలన చీడపీడలను తగ్గించవచ్చు.