స్పైనీ బోల్ వార్మ్

 • లక్షణాలు

 • ట్రిగ్గర్

 • జీవ నియంత్రణ

 • రసాయన నియంత్రణ

 • నివారణ చర్యలు

స్పైనీ బోల్ వార్మ్

Earias insulana

కీటకం


క్లుప్తంగా

 • చివరి మొగ్గలు పుష్పించకముందే వాలిపోయి ఎండిపోతాయి.
 • కాయలు రాలిపోతాయి.
 • ప్రత్తి కాయలకు రంద్రాలు ఏర్పడి లోపలిభాగంలో కుళ్లిపోతుంది.
 • ప్రత్తి కాయల లోపల మెల్లగా ఖాళీ అయిపోతుంది.

ఆతిధ్యం ఇచ్చేవారు:

ప్రత్తి

లక్షణాలు

వీటి లార్వా ముఖ్యంగా ప్రత్తి కాయలపైన దాడి చేస్తుంది. కానీ ప్రత్తి కాయలు లేనట్లయితే మొగ్గలు, చిగుర్లు మరియు పువ్వులను కూడా తింటుంది. మొక్కలు ఎదిగే దశలో ఈ తెగులు సంక్రమించినట్లైతే ఈ గొంగళి పురుగులు చిగుర్ల చివరి ఆకులను తిని మొక్క క్రిందిభాగానికి చేరుకుంటాయి. దీనివలన చివరి మొగ్గలు పుష్పించకుండానే రాలిపోతాయి. ప్రధాన కాండం దెబ్బతినట్లైతే మొత్తం మొక్క కుప్పకూలిపోతుంది. తరువాత దశలో ఈ తెగులు దాడిచేసినట్లైతే వీటి లార్వా మొక్క మొదళ్ళ వద్ద రంద్రాలు చేసి మొక్క లోపలకు ప్రవేశించి పూమొగ్గలు, మరియు ప్రత్తి కాయలను ఆహారంగా తింటాయి. దెబ్బతిన్న పూమొగ్గలు ముందుగానే వికసిస్తాయి. మొక్కల కణజాలాన్ని నష్టం మరియు ఇవి విసర్జించిన పదార్ధాలవలన ఈ ప్రాంతంలో ఫంగస్ లేదా బాక్టీరియా తెగుళ్లు సంక్రమిస్తాయి. దీనివలన ఈ లక్షణాలు మరింత దిగజారతాయి. ఈ తెగులు సంక్రమించినప్పుడు మొక్కలు ఎంత లేతగా ఉంటే దీనివలన నష్టం అంత అధికంగా ఉంటుంది.

ట్రిగ్గర్

మచ్చల బోల్ వార్మ్, యియరియస్ విట్టేల్లా వలన ఈ నష్టం కలుగుతుంది. ఇది దక్షిణ భారత దేశంలో సాధారణమైన తెగులు. ఈ పురుగులు పాలిపోయిన పచ్చని రంగులో 2 మిల్లీమీటర్ల పొడవు వుంది పువ్వులు లేదా వెలుతురు వున్నా ప్రాంతంలో కనిపిస్తాయి. ముందు రెక్కలు పాలిపోయి ప్రకాశవంతమైన చారలు కలిగివుంటాయి. వెనక రెక్కలు పట్టువంటి తెల్లని రంగుతో పాలిపోయినట్టువున్న గోధుమ-బూడిదరంగుతో ఉంటాయి. ఇవి నీలిరంగు గుడ్లను ఒకొక్కటిగా లేత చిగుర్లపైన మరియు పూమొగ్గలపైన పెడతాయి. వీటి చిన్న లార్వా లేత గోధుమ రంగులో ఉండి బూడిద రంగు నుండి పచ్చని రంగు లక్షణాలతో ఉంటాయి. మధ్య వీపు భాగంలో పాలిపోయి ఉంటుంది. పూర్తిగా ఎదిగిన లార్వా 1.8 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. భూతద్ధంలో చూస్తే వీటి శరీరం మొత్తం చిన్న వెన్నులు కలిగి ఉంటుంది. ఇవి పక్వ దశకు వస్తున్నప్పుడు ఇవి ఆకులకు లేదా రాలిపడిన మొక్కల భాగాలకు అంటిపెట్టుకున్న పట్టు లాంటి గూడులో ప్యూపాగా మారతాయి. ఉష్ణమండల పరిస్థితులలో 20-25 రోజులలో ఇవి ఒక తరం పూర్తిచేస్తాయి. చల్లని ఉష్ణోగ్రతలలో ఈ ప్రక్రియ పూర్తికావడానికి రెండు నెలలవరకూ కూడా పట్టవచ్చు.

జీవ నియంత్రణ

ఈ తెగులును నియంత్రించడానికి గుడ్లు మరియు చిన్న లార్వాలను ఏరివేయడం చాలా ముఖ్యం. బ్రకొనిడై, స్కెలియనిడయి మరియు ట్రైకోగ్రమ్మటిడై వంటి పరాన్న జీవి కందిరీగలను వీటిపైన జీవన నియంత్రణగా ఉపయోగించవచ్చు. కొలియోప్తేరా, హైమెనోప్తేరా, హేమిప్తేరా మరియు న్యూరోప్తేరా వంటి కీటకాలను కూడా ఉపయోగించవచ్చు. ఈ కీటకాలు పొలంలో వృద్ధి చెందేటట్టు జాగ్రత్తలు తీసుకోండి. లేదా వీటిని పొలంలో ప్రవేశపెట్టండి. ( విస్తృత పరిధి కల రసాయనిక మందులను వాడకండి). జీవన కీటక నాశిని అయిన బాసిల్లస్ తురింజియెన్సిస్ కలిగిన పిచికారీలను కూడా వీటి జనాభాను నియంత్రించడానికి వాడవచ్చు. వేప నూనె విత్తనాల కషాయాన్ని (NSKE) 5% లేదా ఒక లీటరుకు 5 మిల్లీలీటర్ల వేపనూనె (1500ppm) వాడవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పుష్పించే దశకు ముందు 100 మొక్కలకు 10 గుడ్లు లేదా 5 చిన్న క్రిములు కనపడినప్పుడు వీటి నియంత్రణకు చికిత్స మొదలుపెట్టడం సిఫార్స్ చేయబడినది. వీటి లార్వా ఎదిగే కొలదీ ఇవి పురుగుల మందులకు నిరోధకతను ఏర్పరచుకుంటాయి. అందువలన వీటి గుడ్లు మరియు చిన్న లార్వాలను వెతికి నాశనం చేయడం చాలా ముఖ్యం. గుడ్ల దశలోనే వీటి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం సిఫార్స్ చేయబడినది. క్లొరాన్త్రనలిప్రోల్, ఏమామెక్టిన్ బెంజోయెట్, ఫ్లూబెండియమైడ్, మేథోమేల్ లేదా యేస్ఫిన్వాలేరేట్ లను వాడవచ్చు. తక్కువ విలువ కలిగిన పంటలకు ఈ రసాయనాలను వాడడం ఆర్ధికంగా లాభసాటికాదు.

నివారణ చర్యలు

 • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే తెగులు నిరోధక రకాలను వాడండి.
 • సీజన్లో ముందుగా పంట వేసి ఈ పురుగుల జనాభా బారిన పంట పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.
 • మొక్కల మధ్యన సరిపడా దూరం ఉంచండి.
 • వీటి జీవిత చక్రాన్ని నాశనం చేయడానికి పొలంలో కొన్ని వరుసలలో మొక్కలు నాటకండి.
 • హైబిస్కస్ మరియు దొండ వంటి వలల పంటలను వేయండి.
 • పొలంలో ఎప్పుడూ ఒకే రకమైన పంటలను వేయకండి.
 • ఉపయోగకరమైన పంటలను పొలంలో అంతర పంటగా వేయండి.
 • వీటి లార్వా మరియు గుడ్ల కోసం పొలాన్ని క్రమం తప్పకుండ గమనిస్తూ వుండండి.
 • ఎరువులను సరైన మోతాదులలో వేయండి.
 • పంట ముందుగా చేతికి వచ్చే విధంగా వ్యవసాయ పద్దతులను పాటించండి.
 • పంట కోతల తర్వాత పంట అవశేషాలను మొత్తం తొలగించండి.
 • పొలాన్ని బాగా లోతుగా దున్ని వీటి ప్యూపా వీటి శత్రువులకు సూర్యరశ్మికి బహిర్గతం అయ్యేటట్టు చూడండి.