టమాటాలో బ్యాక్టీరియల్ మచ్చ తెగులు

 • లక్షణాలు

 • ట్రిగ్గర్

 • జీవ నియంత్రణ

 • రసాయన నియంత్రణ

 • నివారణ చర్యలు

టమాటాలో బ్యాక్టీరియల్ మచ్చ తెగులు

Pseudomonas syringae pv. tomato

బ్యాక్టీరియా


క్లుప్తంగా

 • చుట్టూ పసుపు రంగు వలయంతో చిన్న చిన్న ముదురు గోధుమ రంగు మచ్చలు ఆకులు, కాండం మరియు పూల కాడల పైన మచ్చలు కనబడుతాయి.
 • ఆకుల మీద ఒకదానిపైన మరొకటి క్రమరహితమైన మచ్చలుగా ఏర్పడుతాయి.
 • పండ్ల మీద చిన్నటి, పైకి వుబ్బినట్లు వుండే నల్లటి చుక్కలు ఏర్పడుతాయి.

ఆతిధ్యం ఇచ్చేవారు:

టమాటో

లక్షణాలు

మొక్క పెరిగే అన్ని దశలల్లో బ్యాక్టీరియా సోకగలదు. లక్షణాలు ఆకులు మరియు పండ్ల మీద ప్రధానంగా కనబడతాయి మరియు అవి చిన్న, పసుపుపచ్చ వలయాలు గల నల్లటి వృత్తాకార మచ్చలుగా కనబడుతాయి. మచ్చలు సాధారణంగా చిన్నవిగా చెల్లాచెదరై వుంటాయి, కానీ తీవ్రమైన సందర్భాలలో అవి కలిసి పోవచ్చు లేదా ఒకదాని పై ఒకటి ఉండవచ్చు, తద్వారా పెద్ద, క్రమరహిత బొబ్బలు ఏర్పడవచ్చు. అవి ఆకుల కొనల వైపుగా కూడా సాగి చుట్టుకుపోయే అవకాశం వుంది. పండు మీద కొద్దిగా ఉబ్బిన నల్లటి మచ్చలు ఏర్పడవచ్చు కానీ అవి ఉపరితల కణజాలాన్ని మాత్రమే ప్రభావితం చేస్తాయి. చిన్న పండ్లకు సంక్రమణ సోకినప్పుడు, మచ్చలు కుంచించుకుపోవచ్చు.

ట్రిగ్గర్

నేలలో, సంక్రమణ సోకిన మొక్కల వ్యర్థాలు మరియు విత్తనాల మీద మనుగడ సాగించే సూడోమోనాస్ సిరింగే పివి. టమాటా, అని పిలువబడే ఒక బ్యాక్టీరియా కారణంగా లక్షణాలు ఏర్పడుతాయి. బ్యాక్టీరియం వృద్ది చెంది పెరిగే మొక్కలో నివాసం ఏర్పరుచుకునే కొద్దీ, నాటడానికి ఉపయోగించే సంక్రమణ సోకిన విత్తనాలు శిలీంద్రాలకు మూలం అవుతాయి. ఇది టమాట ఆకులను మరియు పండ్లను ప్రభావితం చేయగలదు. వ్యాధి సోకుటకు రెండవ మార్గం - ఆకులు మరియు పండ్ల మీద పెరిగే బ్యాక్టీరియా మరియు అవి తరవాత వర్షపు ధారలతో మరియు చల్లని వాతావరణంలో మొక్కల మధ్యన వ్యాప్తి చెందుతాయి. తీవ్రమైన వ్యాధి సోకడం అరుదుగా జరుగుతుంది మరియు అతిధేయ మొక్కల మధ్య బ్యాక్టీరియా వ్యాప్తి చెందడానికి వీలు కల్పించే ఆకు యొక్క అధిక తడి, చల్లటి ఉష్ణోగ్రతలు మరియు సాంస్కృతిక పద్ధతులు అనేవి తెగులు లక్షణాలకు అనుకూలంగా మారుతాయి. తప్పుడు సాంస్కృతిక ఆచారాల వలనకూడా బ్యాక్టీరియాను అతిధేయ మొక్కల మధ్య వ్యాప్తి చెందుతాయి.

జీవ నియంత్రణ

బ్యాక్టీరియాను తగ్గించడానికి 30 నిముషాల పాటు 20% బ్లీచ్ ద్రావణంలో విత్తనాలను నానపెట్టాలి. ఇది మొలకెత్తే రేటును ప్రభావితం చేస్తుంది కనుక విత్తనాలను 20 నిముషాల పాటు 52°C వద్ద నీటితో ట్రీట్ చేయవచ్చు. విత్తనాలను నాటేటప్పుడు, వ్యాధి కారకాన్ని చంపడానికి విత్తనాలు టమాటా గుజ్జులో పులిసేలా చేయాలి.

రసాయన నియంత్రణ

అందుబాటులో వుంటే ఎల్లప్పుడూ నివారణా చర్యలు మరియు జీవ సంబంధ చికిత్సలు గల ఒక సమగ్ర విధానాన్ని పరిగణించండి. వ్యాధి యొక్క మొదటి లక్షణం కనబడగానే పాక్షిక వ్యాధి నియంత్రణను అందించడానికి, రాగి కలిగిన బాక్టీరియా నాశినిలను నివారణగా లేదా నయం చేయుటకు, నేరుగా ఉపయోగించవచ్చు. చల్లని, వర్షం మరియు వ్యాధి వ్యాప్తి చెందుచల్లని వాతావరణం వున్నప్పుడు రెండు వారముల వ్యవధితో మరలా వాడగలరు. రాగికి నిరోధకత పెరగడం అనేది తరచుగా జరుగుతుంది కనుక, అప్పుడు మాంకోజెబ్ తో కలసిన బాక్టీరియా నాశినిలు కూడా సిఫారస్సు చేయబడుతాయి.

నివారణ చర్యలు

 • ధృవీకరించబడిన, ఆరోగ్యకరమైన విత్తనాలను మాత్రమే వాడండి.
 • మీ ప్రాంతంలో అందుబాటులో వుంటే నాటడానికి నిరోధక రకాలను వాడండి.
 • సాగు ప్రదేశాల నుండి కొంత దూరంలో నారు పోయండి.
 • ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయండి.
 • మొక్కలు తడిగా వున్నప్పుడు పొలంలో పని చేయడం మానివేయండి.
 • నాటే సమయంలో మొక్కలు గాయపడకుండా చూడండి.
 • పంట కోత తరవాత పొలంలో కలుపు మరియు టమాటా మొక్క వ్యర్థాలు లేకుండా చూడండి.
 • మొక్కల మధ్య తగినంత ఎడం ఉండేలా చూడండి మరియు మొక్క నిటారుగా ఉండుటకు కర్రను పాతండి.
 • స్ప్లింక్లర్ లను వాడవద్దు మరియు మొక్కలకు కింద నుంచి నీటిని పెట్టద్దు.