లైవ్ ట్రాకింగ్

Plantix పెస్ట్ ట్రాకర్

భారతదేశంలో ఫాల్ ఆర్మీవార్మ్ యొక్క తీవ్రమైన వ్యాప్తి కారణంగా, మేము మా సాంకేతికతో మీకు వీలైనంత ఉత్తమమైన మరియు ప్రభావవంతమైన సహాయం ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాము. ఈ హానికరమైన గొంగళి పురుగులను వెతికి పట్టుకోవటానికి మేము "ప్లాంటిక్స్ పెస్ట్ ట్రాకర్" అనే మా కొత్త సాధనాన్ని మీకోసం ప్రవేశ పెడుతున్నాం. భారతదేశానికి విస్తరించిన హానికరమైన పురుగులు మరియు వ్యాధుల మరిన్ని మ్యాపులతో మేము ఒక క్రమపద్ధతిలో మా యాప్ ను అభివృద్ధి చేస్తాము. దీని వలన మీకు నమ్మకమైన, తాజాగా వుండే ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.

డేటా మూలం: మా యొక్క ప్లాంటిక్స్ రైతు యాప్ కు, ప్రతిరోజూ భారతదేశం నుండి 20 వేల ఫోటోలు వస్తాయి. మేము ఈ డేటాను అంతర్దృష్టిని సృష్టించడానికి ఉపయోగించి దానిని అందరు వాటాదారులతో పంచుకుంటాము . నిపుణులచే ధృవీకరించబడిన ప్రత్యక్ష ట్రాకింగ్ మ్యాపులో ఈ డేటా పాయింట్లు చూపబడతాయి. అన్ని కోఆర్డినేట్లు 10 కిలోమీటర్లు యొక్క ఖచ్చితత్వానికి అజ్ఞాతంగా ఉంటాయి మరియు డేటా రోజువారీగా నవీకరించబడుతుంది. ముడి సమాచారాన్ని పొందటానికి లేదా మీ డేటాను మ్యాపుకు అనుసంధానించడానికి దయచేసి contact@peat.ai కు విచ్చేయండి.