ఇతరములు

పండు కుళ్ళు తెగులు

Monilinia fructigena

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • విప్పారిన పూలు వాడిపోయి గోధుమ రంగులోకి మారతాయి.
  • చెక్క ప్రాంతంలో కేన్కర్ ప్రాంతాలు వృద్ధి చెందుతాయి.
  • పండ్లపై టాన్-గోధుమ రంగు గుండ్రని మచ్చలు ఏర్పడతాయి.
  • బూడిద-గోధుమ రంగు బీజాల పిలకలు వికసించిన పువ్వు, కొమ్మలు మరియు పండ్లపైన ఏర్పడతాయి.
  • పండ్లు ముడుతలు పడి "మమ్మీలవలె" మారతాయి.

లో కూడా చూడవచ్చు

6 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
చెర్రీ
మరిన్ని

ఇతరములు

లక్షణాలు

చెట్ల జాతులను బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి కాని సాధారణంగా బ్లాసమ్ బ్లెయిట్, కొమ్మ క్యాంకర్ మరియు పండ్ల గోధుమ కుళ్ళు తెగులుగా వేరుగా ఉంటుంది. తెగులు సోకిన వికసించిన పూలు వాలిపోయి గోధుమరంగులోకి మారతాయి మరియు సాధారణంగా కొమ్మకు అంటిపెట్టుకుని ఉంటుంది. చెక్క కణజాలంలో నిర్జీవ క్యాంకర్ ప్రాంతాలు వృద్ధి చెందుతాయి. తేమ లేదా తేమతో కూడిన వాతావరణంలో తెగులు సోకిన పూలపై మరియు కొమ్మలపై బూడిద-గోధుమ రంగు బీజాంశం ఏర్పడుతుంది. సాధారణంగా క్యాంకర్ల నుండి ఒక జిగురు వంటి పదార్ధం వెలువడుతుంది. దీని వలన ఎండిన పూలు కొమ్మకు అంటుకుని ఉంటాయి. పరిపక్వత యొక్క చివరి దశలలో, సాధారణంగా పంటకోతకు 2 నుండి 3 వారాల ముందు, పండ్లకు గోధుమ కుళ్ళు తెగులు సంక్రమించే అవకాశం పెరుగుతుంది. ప్రారంభంలో, బెరడుపై టాన్-గోధుమరంగు వృత్తాకార మచ్చలు కనిపిస్తాయి. తేమతో కూడిన పరిస్థితులలో ఈ మచ్చలలో బూడిద-గోధుమ రంగు బీజాంశం వృద్ధి చెందుతుంది. తెగులు సోకిన నేలమీద పడని పండ్లు నిర్జలీకరణ చెంది ముడుతలు పడిన "మమ్మీ" వలే మారి కొమ్మకు అతుక్కుపోతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

హైడ్రో-కూలింగ్ అని పండ్లను సంరక్షించే పద్ధతిలో తాజాగా పండించిన పండ్లు మరియు కూరగాయల నుండి మంచు నీటిలో స్నానం చేయించడం ద్వారా తొలగించబడుతుంది, ఇలా చేయడం వలన నిల్వ లేదా రవాణా సమయంలో ఫంగల్ పెరుగుదలను నివారించవచ్చు. బాసిల్లస్ సబ్టిలిస్ ఆధారిత బయో శీలింద్ర నాశినులు మోనిలినియా ఫ్రూటిజెనాకు శత్రువులుగా పనిచేస్తాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. డైకార్బాక్సిమైడ్స్, బెంజిమిడాజోల్స్, ట్రిఫోరిన్, క్లోరోథలోనిల్, మైక్లోబుటానిల్, ఫెన్బుకోనజోల్, ప్రొపికోనజోల్, ఫెన్హెక్సామిడ్ మరియు అనిలినోపైరిమిడిన్స్ ఆధారిత శిలీంద్ర నాశినులను సకాలంలో మరియు పదేపదే వాడటం ఈ తెగులు నియంత్రణకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. పైరాక్లోస్ట్రోబిన్ మరియు బోస్కాలిడ్ వంటి కొత్త శిలీంద్ర నాశినులు కూడా ప్రభావవంతంగా ఉంటాయి. పొక్కులు, బూజు తెగులు, తుప్పు, రస్సెట్ స్కాబ్ లేదా బూడిద బూజు తెగులు వంటి ఇతర వ్యాధుల యొక్క ఏకకాల సంభవంపై సరైన పిచికారీ ఆధారపడి ఉంటుంది. పండ్లకు గాయాలు కాకుండా ఉండటానికి కీటకాల నియంత్రణ కూడా ముఖ్యం.

దీనికి కారణమేమిటి?

వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందే మోనిలినియా ఫ్రూక్టిజెనా అనే ఫంగస్ వలన లక్షణాలు కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో, ఇతర శిలీంధ్రాల ప్రమేయం కూడా ఉండవచ్చు. అన్ని సందర్భాల్లోనూ, అవి మమ్మీఫైడ్ పండ్లలో లేదా రెమ్మలపై నిద్రాణస్థితిలో ఉంటాయి. ప్రారంభ సంక్రమణ సాధారణంగా పూల ఎంతేర్స్ లేదా అండకోశంపై బీజాంశం ద్వారా వస్తుంది. అప్పుడు ఫంగస్ వికసించిన పూల అంతర్గత కణజాలంపై (పూల గొట్టం, అండాశయం మరియు తొడిమ) దాడి చేసి పువ్వు జతచేయబడిన కొమ్మకు చేరుకుంటుంది. క్రమంగా పూలు మరియు కొమ్మలు ఎండిపోయి క్యాంకర్‌ను వృద్ధి చేస్తాయి. మరింత సంక్రమణ కోసం మరొక చెట్టు కొమ్మకు ప్రయాణించే వరకు ఈ ఫంగస్ బీజాంశం పండ్ల మమ్మీపై నివసిస్తుంది. తెగులు సోకిన పండ్లు, ముఖ్యంగా మమ్మీఫైడ్ పండ్లు, సంక్రమణ యొక్క సమృద్ధి మూలానికి ప్రాతినిధ్యం వహిస్తాయి.


నివారణా చర్యలు

  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే నిరోధక రకాలను ఎంచుకోండి.
  • పొలంలో పనిచేస్తున్నప్పుడు మరియు తెగుళ్ళ ద్వారా పండ్లకు ఎటువంటి గాయాలు జరగకుండా చూడండి.
  • తగిన కత్తిరింపు ద్వారా పందిరిని పొడిగా ఉంచండి.
  • తోటలో ప్రత్యామ్నాయ అతిధి మొక్కలను తొలగించండి.
  • వ్యాధి మొదటి లక్షణం కనబడగానే, వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి బాగున్న వరకు కొమ్మలో 20 నుండి 30 సెం.మీ.
  • వరకు తెగులు సోకిన అన్ని చనిపోతున్న కొమ్మలను కత్తిరించండి.
  • తెగులు విస్తరించకుండా నిరోధించడానికి పండ్లు లేదా కొమ్మలను తొలగించి నాశనం చేయండి (కాల్చండి లేదా పాతిపెట్టండి).
  • అధిక పరిశుభ్రత ప్రమాణాలను పాటించండి.
  • నత్రజని ఎరువుల అధిక వాడకాన్ని నివారించండి.
  • వ్యాధి లక్షణాల కోసం నిల్వ చేసిన పండ్లను గమనిస్తూ వుండండి.
  • ఎందుకంటే ఇది తెగులు యొక్క ఒక ముఖ్యమైన వాహకం.
  • నిల్వ లేదా రవాణా సమయంలో ఫంగస్ పెరుగుదలను మందగింప చేయడానికి పండ్లను 5°C కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి