టమాటో

టమోటాలో కాడ కుళ్ళు తెగులు

Didymella lycopersici

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ముదురు రంగులో కొంచెం లోపలకు వున్నట్టుగా వున్నా మచ్చలు కాడల క్రిందిభాగంలో కనిపిస్తాయి.
  • ఈ తెగులు సోకిన ప్రాంతాలలో నల్లటి రంగులో బాగా చిన్న బొడిపెలు కనపడతాయి.
  • మొక్కలు వాలిపోయి మెల్లగా పడిపోతాయి.
  • పండ్లు నల్లగా మారి ముడతలు పడిపోతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

టమాటో

లక్షణాలు

ఈ తెగులు సాధారణంగా నేలకు సమాంతరంగా కానీ కొంచెం ఎత్తులో కానీ కాడలకు సంక్రమిస్తుంది. కానీ మొక్క ఆకులు నేలకు తగులుతున్నట్లైతే వీటికి కూడా ఈ తెగులు సోకుతుంది. కొంచెం లోపలి పోయినట్టువున్న గోధుమ రంగు మచ్చలు కాడలపైనా కనిపిస్తాయి.ఈ తెగులు విస్తరిస్తునప్పుడు ఈ మచ్చలు కదా మొత్తం చుట్టేస్తాయి. దీనివలన కాడలు వాలిపోయి కొన్నాళ్లకు మొక్కలు పడిపోతుంది. ఈ తెగులు సోకిన ప్రాంతాలలో నల్లటి రంగులో బాగా చిన్న బొడిపెలు కనపడతాయి. తరువాత కాడల పైవరకు మచ్చలు ఏర్పడవచ్చు. ఇవీటిపైనా నీటిని చల్లినట్లయితే వీటి బీజాంసాలు ఇతర మొక్కలపైకి వ్యాపిస్తాయి. దానివలన ఓకొత్తరకాల తెగుళ్లు వ్యాపిస్తాయి. పండ్లు నల్లగా మారి ముడతలు పడిపోతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులు రాకుండా నివారణ చర్యలు తీసుకోవడం అత్యుత్తమ పద్దతి. ఈ తెగులు సోకిన మొక్కలను సాధ్యమైనంత త్వరగా తొలగించండి. ట్రైకోడెర్మా హర్జియానం యొక్క కొన్ని జాతులు ఈ తెగులును నియంత్రించడంలో మరియు పంట దిగుబడి పెంచడంలో సహాయపడుతుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు సోకకుండా నివారణ చర్యలు తీసుకోవడం చాలా ఉత్తమం. శీలింద్ర నాశీనుల వాడకం సరైన సమయంలో వాడడం వలన మంచి ఫలితం ఉంటుంది. క్లోరో తలోనిల్ ను వాడి కొత్త తెగుళ్లు రాకుండా చూడవచ్చు.

దీనికి కారణమేమిటి?

డిడిమెళ్ళ లైకోపేర్సిసి అనే ఫంగస్ వలన ఈ తెగులు లక్షణాలు కలుగుతాయి. ఈ ఫంగస్ మట్టిలోను మరియు తెగులు సోకియాన్ మొక్కల అవశేషాలపైనా జీవిస్తుంది. మొక్కలకు వున్నా గాయాలద్వారా ఈ తెగులు చాలా సులభంగా మొక్కలకు సంక్రమిస్తుంది. సాధారణంగా నైట్ షేడ్ కుటుంభానికి చెందిన మొక్కలు మాత్రమేఈ తెగులును అతడులుగా ఉంటాయి. టమోటా కూడా ఈ కుటుంభానికి చెందిన మొక్క. ఆకులపైన వున్న మచ్చలపై వున్న మొత్తని ప్రాంతం ఈ ఫంగస్ బీజాలను కలిగివుంటుంది. ఇవి తరువాత గాలి ద్వారా, వర్షం ద్వారా ఆరోగ్యంగా వున్న మొక్కలకు వ్యాపిస్తాయి. ఈ ఫంగస్ తెగులు సోకిన విత్తనాల ద్వారా కూడా సంక్రమిస్తుంది. డిడిమెళ్ళ కాడ కుళ్ళు తెగులు చాలా రకాల వాతావరణ పరిస్థితులలో మొక్కలకు సంక్రమిస్తుంది. కానీ చల్లని వాతావరణంలో (20°C), వర్షం పడి తడిగా వున్నప్పుడు లేదా పైనుండి మొక్కలకు నీరు పెట్టినప్పుడు ఈ తెగులు సోకె అవకాశం చాలా అధికంగా ఉంటుంది. మొక్కలు ఎదిగేకొలదీ మరియు మట్టిలో నత్రజని, భాస్వరం లోపం వున్నప్పుడు ఈ తెగులు తీవ్రత బాగా అధికంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • ధ్రువీకరించిన డీలర్లనుండి ఆరోగ్యకరమైన, తెగుళ్లను తట్టుకునే విత్తనాలను వాడండి.గ్రీన్ హౌస్ లో మొక్కలు వేసినప్పుడు మొక్కల మధ్యన తగిన అంతరం పాటించి గాలి సరిగా ప్రసరణ జరిగేటట్టు చూడండి.
  • క్రింది ఆకులు మట్టికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి( క్రింది ఆకులు కత్తిరించండి).
  • ఉదయం సమయాలలో మొక్కలకు నీరు పెట్టండి.
  • మొక్కలకు పైనుండి నీరు పెట్టవద్దు.
  • కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయండి.
  • కొన్ని వారాల వరకు పొలాన్ని సూర్యరశ్మి సోకేటట్టు చేయండి.
  • పొలంలో పనిచేస్తున్నప్పుడు మొక్కలకు గాయాలు కలగకుండా చూడండి.
  • తెలుగు సోకిన మొక్కలను చూసిన వెంటనే తొలగించండి.
  • స్వచ్చందంగా వచ్చిన మొక్కలు, కలుపు మొక్కలు మరియు ఇతర అతిధి మొక్కలను క్రమం తప్పకుండ తొలగించండి.
  • పంట కోతల తర్వాత పంట అవశేషాలను తొలగించి నాశనం చేయండి.
  • గ్లాస్ హౌస్ లో పండించిన పంటను తేమను 90% కన్నా తక్కువ మరియు 15°C కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు ఉంచండి.
  • సన్నని వెదురు బొంగులు (అరుండొ డోనాక్స్) లేదా యూకలిఫ్టస్ కాడలు టమోటా మొక్కలకు మద్దతుగా ఉంచండి.
  • దీనివలన తెగులు సోకకుండా ఉంటుంది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి