వరి

అగ్గి తెగులు

Magnaporthe oryzae

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • నల్లని అంచులతో, కోలాకారం నుండి గుండ్రటి తెల్లని చుక్కలు ఏర్పడతాయి.
  • కణుపులు కూడా లక్షణాలను చూపుతాయి.
  • మొలకలు లేదా లేత మొక్కలు చనిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

మొక్క ప్రతి భాగాన్ని అగ్గి తెగులు ప్రభావితం చేస్తుంది: ఆకులు, కాడలు, కణుపులు, కంకుల భాగాలు మరియు కొన్నిసార్లు ఆకు తొడుగులు. ఆకులపై పసుపు నుండి పాలిపోయిన లేత ఆకుపచ్చ మచ్చలు, చివర్లు సూది మొనలా వుండే కన్ను ఆకారంలో గాయాలు కనపడతాయి. మచ్చల అంచులు నిర్జీవంగా మరియు మధ్యభాగం బూడిద రంగు నుండి తెలుపు రంగులో ఉంటాయి. మచ్చల పరిమాణం మొక్క వయస్సు మరియు తెగులు రకం మరియు తెగులు సోకిన సమయంపైన ఆధారపడివుంటుంది. ఈ మచ్చలు పెరిగేకొద్దీ క్రమక్రమంగా ఆకులు ఎండిపోతాయి. ఆకుల కణుపులు మరియు తొడుగులకు తెగులు సోకితే కాలర్ కుళ్ళు కనిపించి, కణుపుల పైన వున్న ఆకులు చనిపోతాయి. కణుపులు కూడా ప్రభావితమవుతాయి. దీనివలన గోధుమరంగు కణుపులు ఏర్పడి కాండం విరిగిపోతుంది. అప్పుడప్పుడు చిన్న మొక్కలు లేదా నారు కూడా చనిపోవచ్చు. పైరు తరువాత దశల్లో తీవ్రమైన అగ్గితెగులు ఆకులను తగ్గిస్తుంది. దీనివలన తాలుగింజలు ఏర్పడతాయి. కణుపులు కూడా ప్రభావితం అవుతాయి. ఇది వరిపంటను తీవ్రంగా నష్టపరిచే తెగులు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఇప్పటివరకు జీవసంబంధ నియంత్రణపద్ధతులలో ఈ తెగులును నియంత్రించడానికి ఎటువంటి విధానము లేదు. స్ట్రెప్టోమైసిస్ లేదా స్యుడోమోనాస్ బాక్టీరియా కలిగివున్న ఉత్పత్తులు వుపయోగించి ఈ తెగులును నివారించడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. థీరమ్ తో విత్తనశుద్ధి చేయడం వలన ఈ తెగులు సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. అజోక్సీస్ట్రోబిన్, త్రియాజోల్స్ లేదా స్ట్రోబిలురిన్స్ లాంటి ఫంగిసైడ్స్ కలిగివున్న నర్సరీలో, పిలకలు వేసే సమయంలో మరియు కంకులు వేసే సమయంలో పిచికారీ చేయండి.

దీనికి కారణమేమిటి?

మాగ్నాపొర్తే గ్రిసీ అనే వైరస్ వలన అగ్గితెగులు లక్షణాలు కనిపిస్తాయి. ఇది వరి యొక్క అత్యంత విధ్వంసక వ్యాధులలో ఒకటి. ఇది గోధుమ, వరి, బార్లీ ఇంకా సజ్జలు మొదలైన పంటలను కూడా ఆశించవచ్చు. ఈ ఫంగస్ గడ్డి పైన జీవించి ఉండి, తరువాత పంటలపై కూడా ప్రభావం చూపిస్తుంది. మొక్కలు ఎదిగేకొద్దీ ఈ తెగులును తట్టుకునే శక్తిని పొందుతుంది. చల్లని వాతావరణం, తరుచుగా వర్షం ఇంకా తక్కువగా వున్న మట్టి తేమ ఈ తెగులు బాగా వృద్ధి చెందడంతో సహాయపడుతుంది. ఎక్కువ సమయం వరకు ఆకులపైన తేమ వున్నప్పుడు ఈ తెగులు సంక్రమిస్తుంది. మెట్టపొలాలలో (పగటి ఉష్ణోగ్రతలు మరియు రాత్రి ఉష్ణోగ్రతలలో ఎక్కువగా మార్పులు ఉండే ప్రదేశాలు) ఈ తెగులు సోకడానికి అనుకూలంగా ఉంటుంది. నైట్రోజన్ అధికంగా ఉండటం కూడా వరి పంటలలో సంక్రమణాలకు దారితీస్తుంది. అధిక నత్రజని మరియు తక్కువ సిలికా వున్న భూములలో ఈ తెగులు సులభంగా సంక్రమిస్తుంది.


నివారణా చర్యలు

  • అధిక రోగనిరోధక శక్తి వున్న, ధ్రువీకరించిన వంగడాలను వినియోగించండి.
  • మీ ప్రాంతంలో లభించినట్లైతే నిరోధక రకాలను వాడండి.
  • వర్షాకాలం ప్రారంభమైన వెంటనే సీజన్లో ముందుగా విత్తనాలను విత్తండి.
  • నత్రజనిని అధికంగా వినియోగించకండి మరియు ఎరువులను రెండు లేదా మూడు విడతల్లో వేయండి.
  • క్రమం తప్పకుండ నీరు పెడుతూ, మొక్కలకు కరువు వత్తిడి లేకుండా చేయండి.
  • పొలంలోనుండి నీరు బైటకి పోకుండా ఎల్లప్పుడు నీరు పొలంలో వుండేటట్టు చూడండి.
  • కలుపు మొక్కలు మరియు ఇతర ఆతిధ్య మొక్కలను సమయానుసారం నిర్మూలించండి.
  • సిలికాన్ లోపం వున్నట్లైతే సిలికాన్ ఎరువులను వాడండి.
  • ఎండుగడ్డి లాంటి చవకైన సిలికాన్ అధికంగా వుండే రకాలను ఉపయోగించండి.
  • వ్యాధి లక్షణాల కోసం పొలాన్ని తరచూ గమనిస్తూ వుండండి ముందు పంటకు సోకిన తెగుళ్లు తరువాత పంటకు సోకకుండా ఉండడం కోసం అన్ని తెగులు సోకిన మొక్కల అవశేషాలను నాశనం చేయండి.
  • వీటి జనాభాను తగ్గించడానికి సరళమైన మరియు ప్రభావవంతమైన పద్దతిలో పంట భ్రమణాన్ని ప్లాన్ చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి