గోధుమ

లూజ్ స్మట్

Ustilago segetum var. tritici

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • పూత దశలో లేదా కొద్ది ముందుగా ఈ లక్షణాలు కనిపిస్తాయి.
  • పొడవాటి నల్లని గింజలతో మరియు ఒకరకమైన “చనిపోయిన చేప” వాసన గల నల్లని తలలు వృద్ధి చెందుతాయి.
  • పెరుగుతున్న గింజలు ఫంగస్ తో నిండిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

గోధుమ

లక్షణాలు

లక్షణాలు పుష్పించే దశలో లేదా కొంచెం ముందుగా కనిపిస్తాయి మరియు వీటిని పొడివాటి నల్లని గింజలు మరియు ఒకవిధమైన “చనిపోయిన చేప” వాసన గల నల్లని హెడ్స్ ఏర్పడతాయి.పెరుగుతున్న గింజలు ఫంగస్ తో నిండిపోతాయి.ఈ తెగులు సోకిన కంకులలో గింజలు వృద్ధి చెందవు. ప్రపంచంలో గోధుమను పండించే దేశాలలో ఇది ఒక సాధారణ తెగులు. ఇది సోకిన పంటలో నూటికి నూరు శాతం దిగుబడి నష్టం జరుగుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

విత్తనాలను 4-6 గంటల పాటు 20-30°C నీటిలో నానబెట్టాలి. తర్వాత వాటిని 49°C వేడి నీటిలో 2 నిమిషాల పాటు ముంచి ఉంచవలెను. తర్వాత దశలో విత్తనాలను ప్లాస్టిక్ షీట్ పైన ఆరపోయాలి. తర్వాత 4 గంటల పాటు సూర్యకాంతి సోకేటట్టు చేయాలి. విత్తనాలు నాటే ముందు విత్తనాలు పూర్తిగా ఆరిపోయి ఉండాలి. ఇలా చేయడం వలన మొక్కలకు ఫంగస్ సోకకుండా ఉంటుంది. ఇది తెగులు సంక్రమించకుండా చేస్తుంది కానీ అంకురోత్పత్తి రేటు కూడా తగ్గే అవకాశం వుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విత్తనాలను కార్బొక్సిన్ లేదా త్రియాడిమెనోల్ వంటి శీలింద్ర నాశినులతో శుద్ధి చేయవచ్చు. ఇది విత్తనాలను మొలకెత్తే విధంగా చేసి విత్తనాలలో వున్న బూజు తెగులును చంపుతాయి. ట్రిటికొనాజోల్, డిఫెనోకొనాజోల్ మరియు టేబుకోనజోల్ ను కూడా విత్తన శుద్ధి చేయడానికి ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు సోకిన గోధుమ విత్తనాలలో నిద్రాణమైవున్న శిలీంద్రమైన ఉస్టిలాగో ట్రిటిచి వలన ఈ లక్షణాలు కలుగుతాయి. మొక్క జీవన చక్రంతో పాటు బూజు తెగులు అభివృద్ధి ఒకే వేగంలో వుంటుంది. ఈ తెగులు సోకిన గోధుమ విత్తనాలు మొలకెత్తినప్పుడు లేత గోధుమతో పాటు బూజు తెగులు కూడా పెరుగుతుంది. చివరకు పూల కణజాలాన్నే ఇవి తమ నివాసంగా చేసుకుంటాయి. పుప్పొడి విడుదల చేయవలసిన పూలు ఆరోగ్యకరమైన పువ్వులపై గాలి ద్వారా వ్యాపించే బూజు తెగులు కణాలను ఇవి చెదరగొడతాయి. అక్కడ అవి మొలకెత్తడం మరియు వాటి అంతర్గత కణజాలంలో నివసించడం మొదలుపెట్టి చివరకు కొత్త విత్తనాలను ఆశిస్తాయి. ఈ తెగులు సోకిన విత్తనాలు నిద్రావస్థలో వున్న బూజు తెగులును కలిగి వుంటాయి కానీ ఇవి ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఈ విత్తనాలను పొలంలో నాటడంతో ఈ ఫంగస్ యొక్క కొత్త జీవన చక్రం మళ్ళీ ప్రారంభమవుతుంది. పంట అవశేషాలు, వర్షం మరియు కీటకాలు, బీజాంశం వేగంగా అంకురించడానికి అనుకూలమైన పరిస్థితులు తరచుగా వర్షాలు లేదా మంచు బిందువులు పడడం మరియు 16-22°C మధ్య చల్లని ఉష్ణోగ్రతలు తేమ వాతావరణం(60-85% సాపేక్ష ఆర్ద్రత) ఈ తెగులు విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన మొక్కలు లేదా ద్రువీకరించబడిన వ్యాధి రహిత మూలాల నుంచి సేకరించిన విత్తనాలను ఉపయోగించండి.
  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక రకాలను నాటండి.
  • వేరు వేరు పొలాలలో పని చేసేటప్పుడు పరికరములు, చేతులు మరియు పాదరక్షలను తప్పకుండా శుభ్రం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి