మొక్కజొన్న

మొక్కజొన్నలో సదరన్ తుప్పు తెగులు

Puccinia polysora

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ముదురు ఆకుల పైభాగాల్లో చిన్న, ఎరుపు నారింజ రంగు, పొడివంటి, గుత్తులుగా స్ఫోటకాల రూపంలో కనిపిస్తాయి.
  • తరువాత ఇవి మొక్కల వివిధ భాగాలపై మరియు లేత ఆకులపై కూడా కనిపిస్తాయి.
  • క్లోరోసిస్ అతుకులు మరియు నిర్జీవమైన మచ్చలు ఆకులపై కనిపిస్తాయి.
  • దీనివలన కొమ్మలు కుళ్లిపోయి గింజ నాణ్యత తగ్గిపోవడానికి కారణం అవుతాయి.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

చిన్న, ఎరుపు నారింజ రంగు, పొడివంటి, గుత్తులుగా స్ఫోటకాల రూపంలో ముదురు ఆకుల పైభాగాల్లో కనిపిస్తాయి. తరువాత ఇవి మొక్కల వివిధ భాగాలపై మరియు లేత ఆకులపై కూడా కనిపిస్తాయి. క్లోరోసిస్ అతుకులు మరియు నిర్జీవమైన మచ్చలు ఆకులపై కనిపిస్తాయి. దీనివలన కొమ్మలు కుళ్లిపోయి గింజ నాణ్యత తగ్గిపోవడానికి కారణమౌతాయి. తెగులు తరువాత దశలలో ఇది బాగా అధికంగా విస్తరించి లేత ఆకులు మరియు పొట్టు, మరియు కాడలపై కూడా కనిపిస్తాయి. ముదురు ఆకులపై కన్నా లేత ఆకులను ఈ తెగులు ఆశించే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ తెగులు సోకడం వలన పంట దిగుబడి బాగా తగ్గుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులు యొక్క బీజాంశాలు అంకురోర్పతి అవ్వకుండా, గుయాకో (మీకన్నా గ్లోనేరట) పదార్థాలు నీటితో కలిపి ఉపయోగించాలి. గుయాకో ఆకులను డిస్టిల్డ్ వాటర్ లో ముంచి ఆ మిశ్రమాన్ని 24 గంటల పాటు ఫ్రిడ్జిలో 24 గంటల పాటు ఉంచడం వలన ఈ పదార్థం ( సారం) తయారవుతుంది. ఆతరువాత ఈ పదార్థాన్ని ఫిల్టర్ పేపర్ ఫిల్టర్ చేసి 5% కాన్సంట్రేషన్ వలే చేసి దానిని ఆకులపై చల్లాలి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. శీలింద్ర నాశినులను వాడి ఈ తెగులును నియంత్రించలేరు. ఈ తెగులు ఇతర ఆరోగ్యంగా వున్న మొక్కలకు సోకకుండా మాత్రం దీనిని ఉపయోగించవచ్చు. మొక్కల వయసు, తెగులు తీవ్రత మరియు వాతావరణ పరిస్థితులను బట్టి సమయానుసారం ఈ మందులు వాడడం కూడా చాలా ముఖ్యం. మాంకోజెబ్, సైప్రోకోనజోల్, ఫ్లూత్రియఫోల్ + ఫ్లూక్సాస్ట్రోబిన్, పైరాక్లోస్టోబిన్, పైరాక్లోస్టోబిన్, + మెట్కోనజోల్, అజోక్సీస్ట్రోబిన్ + ప్రొపికోనజోల్, ట్రైక్లోరోస్ట్రోబిన్ + ప్రొతియోకోనజోల్ ఈ తెగులు తీవ్రతను తగ్గిస్తాయి. పొక్కులు కనిపించిన వెంటనే మాంకోజెబ్ @ 2.5 g /l ను పిచికారీ చేయడం వలన ఈ తెగులును నియంత్రించవచ్చు. దీనిని 10 రోజుల వ్యవధిలో మరల పిచికారీ చేయాలి.

దీనికి కారణమేమిటి?

ఈ వ్యాధి పుక్సినియా పోలీసోరా అనే ఫంగస్ వల్ల కలుగుతుంది సహజంగా మొక్కల ఆఖరి ఎదుగుదల దశలో. ఇది మొక్కల అవశేషాల్లో జీవిస్తుంది. ఇది గాలి వల్ల మరియు వర్షం వల్ల వేరే మొక్కల పైకి వ్యాపిస్తాయి. ఉష్ణోగ్రతలు 27°C నుండి 33°C వరకు ఈ వ్యాధికి అనుకూలమైనవి. ఇది మొక్కలకి నష్టాన్ని కలిగిస్తాయి. సహజంగా మొక్కల చివరి దశలో ఈ తెగులు పుక్సినియా పోలీసోరా అనే ఫంగస్ వల్ల కలుగుతుంది. ఇది మొక్కల అవశేషాల్లో జీవిస్తుంది. ఇది ఆబ్లిగేట్ పారసైట్. అందువలన ఐదుకి జీవించి వున్న మొక్కలపైనే బ్రతుకుతుంది. ఒక సీజన్ లో ఈ తెగులు సోకినంత మాత్రాన తరువాత సీజన్ లో పంటకు మళ్ళీ ఈ తెగులు సోకే అవకాశం లేదు. గాలి వలన మరియు వర్షం వలన ఇవి ఇతర మొక్కలపైకి వ్యాపిస్తాయి. 27°C నుండి 33°C వరకు వున్న ఉష్ణోగ్రతలు ఈ తెగులుకు అనుకూలమైనవి. మొక్కలకు ఈ తెగులు ముందరి దశలో సోకితే మొక్కలకు చాలా అధికంగా నష్టాన్ని కలగచేస్తాయి.


నివారణా చర్యలు

  • నిరోధక మరియు సహనాత్మక మొక్కల రకాలు వాడాలి.
  • సీజన్ లో ఆలస్యంగా పంట వేయకండి.
  • మొక్కలకు తెగులు సోకిందేమో తెలుసుకోవడానికి పొలాన్ని తరుచుగా గమనిస్తూ ఉండాలి.
  • మంచి ఎరువుల యాజమాన్య పద్ధతులు వాడి పంటలను బలంగా ఉంచాలి.
  • తరువాత వృద్ధి దశల్లో పొలంలో అధికంగా నీరు పెట్టకూడదు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి