మొక్కజొన్న

మొక్కజొన్నలో బూడిద రంగు ఆకు మచ్చ

Cercospora zeae-maydis

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • బూడిద ఆకు మచ్చ తెగులు మట్టిలోని పంట అవశేషాలపై జీవిస్తుంది.
  • అధిక ఉష్ణోగ్రతల వద్ద (25-30°C), అధిక తేమ వున్నప్పుడు( మంచు బిందువులు, పొగమంచు) మరియు ఎక్కువ సమయం ఆకులు తడిగా వున్నప్పుడు ఇది బాగా వ్యాపిస్తుంది.
  • వెచ్చని పొడి వాతావరణంలో ఈ తెగులు వృద్ధి చెందలేదు.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

చిన్న గోధుమ లేదా కాఫీ రంగు మచ్చలు పసుపు రంగు అంచులతో కింది ఆకుల పై కనిపిస్తాయి. ఈ మచ్చలు బూడిద రంగు లోకి మారి పెద్దగా దీర్ఘచతురస్రాకార లోకి మారి ఆకునాళాల దగ్గర కనిపిస్తాయి. వీటికి అనుకూలమైన వాతావరణంలో (వెచ్చని ఉష్ణోగ్రతలు, అధిక తేమ మరియు మరియు అధిక సమయం వరకు తడిగా వున్న ఆకులు) ఈ మచ్చలు అన్ని కలసిపోయి మొత్తం ఆకులపై కూడా వ్యాపిస్తాయి. గింజలు పాలుపోసుకునే లోపు జరిగితే దిగుబడిలో నష్టం కలుగుతుంది. ఆకులపై ఈ మచ్చలు మొక్కలను బలహీనంగా చేసి రెమ్మలు మెత్తగా అయ్యి మొక్కలు పడిపోవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

మొక్కజొన్నలో బూడిద రంగు ఆకు మచ్చకి జీవ సంబంధిత నియంత్రణ లేదు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మొక్కల ఎదుగుదలలో మొదటి దశలో ఈ తెగులు సోకినట్లతే సీలింద్ర నాశినులను ఆకులపై పిచికారీ చేయడం మంచిది. కానీ వాతావరణాన్ని పరిగణలోకి తీసుకోవాలి. పైరక్లోస్త్రబిన్ మరియు స్ట్రోబిలూరిన్ కలిగిన సీలింద్ర నాశినులను లేదా అజోక్సిస్త్రోబిన్ మరియు ప్రొపికోనజోల్, ప్రొతియోకోనజోల్ మరియు ట్రై ఫ్లోక్సిస్ట్రోబిన్ వంటి మిశ్రమాలు వాడటం కూడా దీన్ని నియంత్రించటం లో పని చేస్తాయి.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు సర్కోస్పోర జెఎ-మేడీస్ అనే ఫంగస్ వల్ల కలుగుతుంది. ఇది పంట అవశేషాల్లో జీవిస్తుంది. వసంత కాలంలో ఈ బీజాంశాలు క్రింది ఆకుల పైకి వర్షం మరియు గాలి వల్ల వ్యాపిస్తాయి. అధిక ఉష్ణోగ్రతలు (25 to 30°C), అధిక తేమ మరియు అధిక సమయం వరకు ఆకులపై తడి వీటి జీవిత చక్రం పూర్తి చేసుకోవడానికి అనుకూలిస్తాయి. వేడి, పొడి వాతావరణం దీని ఎదుగుదలను తగ్గిస్తుంది. మొక్కల రకాలను బట్టి లక్షణాలు మారుతాయి. ఈ ఫంగస్ దీని జీవిత చక్రం 14-21 రోజుల్లో పూర్తవుతుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులోవుంటే నిరోధక రకాలను వాడండి.
  • ఆలస్యంగా నాటడం వల్ల మొక్కలని తీవ్ర వాతావరణం నుండి కాపాడ వచ్చు.
  • మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉంచి గాలి బాగా సోకే విధంగా చూడండి.
  • కోత తరువాత అవశేషాల్ని లోతుగా పాతి పెట్టండి.
  • ఈ తెగులు సంక్రమించని పంటలతో దీర్ఘకాలిక పంట మార్పిడి పద్ధతులు పాటించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి