ఇతరములు

స్క్లెరోటినియా కాండం కుళ్ళు తెగులు

Sclerotinia sclerotiorum

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • పండ్లు, ఆకులు లేదా ఆకు కాడలపై మచ్చలు.
  • తెలుపు, పత్తి లాంటి అచ్చుతో కప్పబడిన మచ్చలు.
  • తరువాత నల్లని పులిపురుల వంటి నిర్మాణాలు.
  • కాండం మరియు మొక్కల పైభాగాలు వాలిపోవడం.

లో కూడా చూడవచ్చు

19 పంటలు
చిక్కుడు
కాకరకాయ
క్యాబేజీ
కనోల
మరిన్ని

ఇతరములు

లక్షణాలు

లక్షణాలు మొక్క జాతిని బట్టి మారుతూ ఉంటాయి. కానీ ఈ లక్షణాలకు అనేక సారూప్యతలు ఉన్నాయి. నీటితో తడిచినట్టు వుండే ఉబ్బిన మచ్చలు ఒక క్రమరహిత ఆకారంతో పండ్లు, ఆకులు లేదా కాడల మీద కనిపిస్తాయి. ఇవి పెరిగిన కొద్ది, ప్రభావిత ప్రాంతాలు తెల్లని, దూది వంటి పదార్ధంతో కప్పబడి వుంటాయి, తరువాత దశలో బూడిద లేదా నల్లటి పులిపిరి వంటి స్క్లెరోటియా అని పిలవబడే ఒక పునరుత్పత్తి నిర్మాణం ఏర్పడుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఫంగల్ పరాన్నజీవి కొయోథైరియం మినిటాన్స్ లేదా ట్రైఖోడెర్మా జాతుల యొక్క రేణువుల సూత్రీకరణలు స్కిల్రోటినియా ఫంగల్ తీవ్రతను తగ్గించడానికి మరియు వ్యాధి యొక్క వ్యాప్తిని నిరోధించుటకు నేలపై చల్లబడుతున్నాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పొలంలో ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటే శీలింద్ర నాశినులను ఆకులపైన పిచికారీ చేయడం సిఫార్స్ చేయబడినది. పంటను బట్టి పంట దశను బట్టి ఈ మందులు వాడాలి. క్యాబేజీ, బీన్స్ మరియు టమోటా పంటలలో ఈ తెగులును నియంత్రించడం చాలా కష్టం. ఇప్రోడియన్ లేదా కాపర్ ఆధారిత శీలింద్ర నాశినులు ( 3 గ్రా/లీ) లెట్యూస్ మరియు వేరుశనగలో ఈ తెగులును నియంత్రించవచ్చు. కొన్ని రకాల మొక్కలలో ఈ మందులకు నిరోధకత ఏర్పడినట్టుగా గమనించబడినది.

దీనికి కారణమేమిటి?

స్క్లెరోటినియా కాండం కుళ్ళు తెగులు, మట్టిలో వుండే స్క్లెరోటినియా స్క్లెరోటియొరమ్ అనే ఫంగస్ వలన వ్యాపిస్తుంది. ఈ ఫంగస్ మొక్కల అవశేషాలపైన లేదా మట్టిలో అనేక సంవత్సరాల పాటు జీవించి ఉంటుంది. దీని జీవిత చక్రం అంతా చాలా వరకూ మట్టిలోనే జరుగుతుంది. అందువల్లనే సాధారణంగా ఈ తెగులు లక్షణాలు నేలకు దగ్గర్లో వున్న ఆకులు మరియు మొక్కల భాగాలపైన కనిపిస్తాయి. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇది సేంద్రియ పదార్ధాలపైనా కూడా వృద్ధిని కొనసాగిస్తుంది. అంతే కాకుండా కొన్ని పరిస్థితులలో మొక్కల కణజాలాన్ని కూడా ఆక్రమిస్తుంది. ఇవి మొక్కల అన్ని భాగాలలోను నివాసం ఏర్పరుచుకోవడం వలన విత్తనాలకు కూడా ఈ తెగులు వ్యాపిస్తుంది.ఇవి విత్తనాల పైపొరను కానీ విత్తనాల లోపలకు కానీ చేరతాయి. మొక్కలపైన ఇవి ఉత్పత్తి చేసిన బీజాంశాలు గాలి వాన ద్వారా ఇతర మొక్కలకు వ్యాపిస్తాయి. తేమతో కూడిన వాతావరణంలో ఈ బీజాంశాలు మొక్కల కాండానికి వ్యాపిస్తాయి. ఈ తెగులు సంక్రమించడానికి ఆకులు చాలా సమయం వరకు తడిగా ఉండడం మరియు 15 నుండి 24°C ఉష్ణోగ్రత అవసరం. బైట నుండి అందే పోషకాల వలన కూడా ఈ తెగులు వృద్ధి చెందడానికి అనుకూలం. ఈ తెగులుకు క్యారెట్, క్యాబేజీ, బీన్స్ మరియు కనోల వంటి చాలా విస్తృత ఆవాస మొక్కలు వున్నాయి.


నివారణా చర్యలు

  • ధృవీకరింపబడిన డీలర్ల వద్ద నుండి ఆరోగ్యకరమైన విత్తనాలను ఉపయోగించండి.
  • తెగులును తట్టుకునే రకాలను వాడండి.
  • ఇంతకు ముందు ఈ తెగులు సోకిన పొలాల్లో మళ్ళీ ఈ పంటను సాగుచేయకండి.
  • మంచి గాలి వెలుతురు సోకే విధంగా మొక్కల మధ్యన సరైన అంతరాన్ని పాటించండి.
  • మొక్కలు వాలిపోకుండా ఉండడానికి కర్రలను పాతి వాటికి మొక్కలను కట్టండి.ఈ తెగులు లక్షణాల కొరకు పొలాన్ని పరిశీలిస్తూ వుండండి.
  • పొలంలో మరియు చుట్టు ప్రక్కల కలుపు నియంత్రణ చేయండి.
  • తెగులు సోకిన కొమ్మలు లేదా ఇతర భాగాలను తొలగించండి.
  • మొక్కలు ఎదిగే చివరి దశలో అధికంగా ఎరువులు వాడవద్దు.
  • పొలాన్ని దున్నకండి ఎందుకంటే దున్నకపోవడం వలన ఈ తెగులు సోకే అవకాశం తక్కువగా ఉంటుంది.
  • ఈ తెగులు సోకని పంటలైన చిరుధాన్యాలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి