గులాబీ

నల్ల మచ్చ

Diplocarpon rosae

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకు పైభాగంలో చుట్టూ పసుపు రంగు వలయాలతో కూడిన చిన్న మచ్చలు.
  • ఆకులు ముందుగానే రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
గులాబీ

గులాబీ

లక్షణాలు

ఆకు పైభాగంలో చిన్న మచ్చల ద్వారా లక్షణాలు వివరించబడతాయి. ఈ ఊదారంగు లేదా నలుపు ప్యాచీలు 2 మిమీ నుండి 12 మిమీ ల పరిమాణానికి వేగంగా విస్తరిస్తాయి మరియు విస్తరించబడిన అంచులను చూపుతాయి. చుట్టుపక్కల ఆకు ప్రాంతం పసుపు రంగులోకి మారవచ్చు మరియు ముందుగానే రాలిపోవచ్చు. కొన్నిసార్లు, లేత కాండం మీద చిన్న, నలుపు, గజ్జి లాంటి పాచెస్ కూడా కనిపిస్తాయి. ఈ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే దాదాపు అన్ని ఆకులు రాలిపోతాయి మరియు మొక్క తక్కువ పుష్పాలను ఉత్పత్తి చేస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

నల్ల మచ్చ తెగులును నియంత్రించడానికి క్రింది పదార్థాలు సిఫార్సు చేయబడ్డాయి: రాగి, సున్నం సల్ఫర్, వేప నూనె, పొటాషియం బైకార్బోనేట్. బేకింగ్ సోడా (సోడియం బైకార్బోనేట్) కూడా ఉపయోగించవచ్చు: 1 లీటరు నీటికి 1 టీస్పూన్ (5 మి.లీ), అలాగే ఒక చుక్క లిక్విడ్ సబ్బు. బాసిల్లస్ సబ్టిలిస్ అనే బాక్టీరియం కలిగిన ఒక సూత్రీకరణ అందుబాటులో ఉంది. శిలీంద్ర నాశినులు మరియు ట్రైకోడెర్మా హర్జానియం మిశ్రమం కూడా మంచి నియంత్రణను ఇస్తుంది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. నల్ల మచ్చ తెగులును నియంత్రణలో ఉంచడానికి టెబుకోనజోల్, టెబుకోనజోల్ + ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ మరియు ట్రైటికోనజోల్ కలిగిన శిలీంద్ర నాశినులు సిఫార్సు చేయబడ్డాయి.

దీనికి కారణమేమిటి?

డిప్లోకార్పాన్ రోజా అనే ఫంగస్ వల్ల గులాబీ ఆకులపై ఈ నల్ల మచ్చ ఏర్పడుతుంది. శీతాకాలంలో, రాలిన మరియు కుళ్ళిన ఆకులు మరియు కాండం మీద ఈ శిలీంధ్రం మనుగడ సాగిస్తుంది. బీజాంశం గాలి మరియు వర్షపు చినుకుల ద్వారా వ్యాపించి, వసంత ఋతువులో ఆకులలో తెరవబడివుండే రంధ్రాల ద్వారా సోకుతుంది. వర్షాకాలంలో 20-26°C ఉష్ణోగ్రతలు మరియు తడి తేమతో కూడిన పరిస్థితులతో ఫంగస్ చాలా తీవ్రంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • వ్యాధి రహిత మొక్కలను ఉపయోగించండి.
  • కొత్త లేదా పాత జాతులలో వ్యాధి సంక్రమించే అవకాశం తక్కువ ఉన్న రకాలను నాటండి.
  • మంచి సూర్యరశ్మి, నీరు నిల్వ ఉండని నేల, బాగా గాలి ప్రసరించే స్థలంలో మొక్కలు నాటండి మరియు మొక్కల మధ్య 1-1.25 మీ దూరం ఉండేటట్టు చూసుకోవాలి.
  • నేలపై ఒక మల్చింగ్ పొర ని వర్తించండి.
  • క్రమం తప్పకుండా కత్తిరించండి, బలహీనమైన లేదా చనిపోయిన కాడలను తొలగించండి.
  • ఉదయాన్నే గులాబీ మొక్కల చుట్టూ ఉన్న మట్టికి నీరు పెట్టండి.
  • రాలిపడిన ఆకులను సేకరించి నాశనం చేయండి లేదా మల్చింగ్ కింద పాతిపెట్టండి.
  • కొత్త ఆకులు కనిపించే ముందు ప్రభావిత కాండాలను కత్తిరించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి