చిక్కుడు

చిక్కుడు పొడి వేరు కుళ్ళు

Fusarium solani f. sp. phaseoli

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు పసుపు రంగులోకి మారి వాలిపోయే అవకాశం ఉంది.
  • మొక్క పుటిన వెంటనే వేర్ల పైన ఎరుపు మచ్చలు కనిపిస్తాయి.
  • ఈ మచ్చలు ముదురు గోధుమ రంగు లోకి మారి గుంపులుగా చేరి వేర్ల పై పగుళ్ళు ఏర్పరుస్తాయి.
  • కణజాలాలు మెత్తగా మరియు సరైన రూపంలోకి మారవు.
  • అందుకే ఈ ఈ తెగులుకు ఎండు వేరు కుళ్ళు ఇంకొక పేరు వుంది.ఒక వేళ మొక్కలు ఈ తెగులును తట్టుకుని జీవించగలిగినా చాలా తక్కువ మొత్తంలో కాయలు మరియు విత్తనాలు కలిగి ఉంటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

చిక్కుడు

లక్షణాలు

ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోయే అవకాశం ఉంది. మొక్కలు చిన్నగా మరియు తెగులు సోకిన కొద్ది సమయానికే చనిపోయే అవకాశాలు ఉంటాయి. తెగులు సోకిన ఒక వారం లోనే భూమిలో వేర్లపై ఎరుపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు ముదురు గోధుమరంగు లోకి మారి గుంపులుగా చేరి వేర్లపై పగుళ్ళు ఏర్పరుస్తాయి. వేర్లు మరియు వేర్ల కోణాలు ముడుచుకుపోయి చనిపోతాయి కాని మొక్కలనుండి విడిపడకుండానే ఉంటాయి. మట్టికి దగ్గరలో ఈ మచ్చల పైనే కొత్త నార వేర్లు పెరుగుతాయి. ఈ తెగులును తట్టుకుని జీవించగలిగినా చాలా తక్కువ మొత్తంలో కాయలు మరియు విత్తనాలు కలిగి ఉంటాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

బాసిల్లస్ సుబ్టిలిన్, రైజోబియం ట్రోపిసి తో కలిపిన బయోకంట్రోల్ ఎజెంట్ విత్తన శుద్ధికి వాడడం మంచిది. ఇతర సూక్ష్మ జీవులైన ట్రైకోడెర్మా హర్జియానుమ్ ను వాడి ఈ శీలింద్రాన్ని నియంత్రించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఫుస్సరియం వేరు కుళ్ళు తెగులుపై సీలింద్ర నాశినులు ఎటువంటి ప్రభావం చూపించవు.

దీనికి కారణమేమిటి?

ఫుస్సరియం వేరు కుళ్ళు ఫుస్సరియం సోలని అనే శీలింధ్రం వల్ల కలుగుతుంది. ఇవి పంట అవశేషాల్లో అనేక సంవత్సరాలు జీవిస్తాయి. ఈ శీలింధ్రం వితనాల్లోకి వెళ్లి నీరు మరియు పోషకాలు వెళ్లే కణజాలాలపై ఉంటాయి. వాతావరణం ప్రతికూలంగా ఉన్నపుడు (కరువు, వరద, కనీస పోషకాలు లేకపోవటం ) మరియు నీరు పోషకాలు అందకపోవటం ఈ లక్షణాల పైన పెద్ద ప్రభావం చూపిస్తుంది. దిగుబడి లో అధికమొత్తంలో నష్టాలు కలుగుతాయి.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక మరియు సహనాత్మక విత్తన రకాలు వాడాలి.
  • నారుమడిలో లేదా గడులు ఏర్పాటుచేసి వాటిలో నాటండి.
  • నేల వేడిగా ఉన్నపుడు కొద్దిగా ఆలస్యంగా మొక్కలను నాటడం మంచిది.
  • మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండాలి.
  • నీటి పారుదల బాగా ఉండాలి.
  • మొక్కలకు సమతుల్యంగా నీరు పెట్టాలి.
  • గట్టి మట్టి దిబ్బలు తయారు కాకుండా జాగ్రత్త పడాలి.
  • ఎరువులు సరిగా వాడండి.
  • మొక్కలకు దెబ్బలు తగలకుండా చూడాలి.
  • 4 నుండి 5 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడిని పాటించండి.
  • లోతుగా దున్ని పంట అవశేషాల్ని సూర్యుని వేడికి తగిలేటట్టు చూడండి.
  • తెగులు సోకిన పంట లోని గడ్డిని పశువులకు ఆహారంగా వేయవద్దు.
  • ఈ పెంటలో ఫంగస్ ఉంటుంది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి