కాప్సికమ్ మరియు మిరప

ఫుట్ మరియు కాలర్ రాట్

Athelia rolfsii

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • కాండం మరియు చుట్టుపక్కల భూమిపై నల్లని గుండ్రటి నిర్మాణాలతో, తెల్లని మెత్తటి చాప.
  • ఆకులు వాలిపోతాయి .మొక్కలు ఒక ప్రక్కకు పడిపోయి చనిపోతాయి.

లో కూడా చూడవచ్చు

28 పంటలు
బార్లీ
చిక్కుడు
కాకరకాయ
క్యాబేజీ
మరిన్ని

కాప్సికమ్ మరియు మిరప

లక్షణాలు

వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మొక్క ఇతర భాగాలకు సోకినప్పటికీ, ప్రధానంగా ఈ శిలీంద్రం మొక్క కాండానికి సోకుతుంది. ఇది మొక్క కణజాలంపై, చుట్టుపక్కల భూమిపై గుండ్రటి టాన్-గోధుమ రంగులో, తెల్లని మెత్తటి శిలీంద్రపు చాపలా ఏర్పడి, చాలా వేగంగా పెరుగుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వ్యతిరేక శిలీంధ్రాలు (తరచుగా ఇతర చికిత్సలతో కలిపి) ఈ క్రిములకు వ్యతిరేకంగా కొంత నియంత్రణను అందిస్తాయి. ఫలితాలు పంట రకం మరియు పర్యావరణ పరిస్థితులపై బాగా ఆధారపడి ఉంటాయని గమనించండి. సాధారణంగా ఉపయోగించే కొన్ని సేంద్రియ జీవుల్లో ట్రైకోడెర్మా హర్జియం, ట్రిచోడెర్మా వైడిడ్, బాసిల్లస్ సబ్లిటిస్, స్ట్రెప్టోమైస్ ఫిలన్టిసమ్, గ్లైకోక్లాజియం వైరన్స్ మరియు కొన్ని జాతుల పెన్సిలియం ఉన్నాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవసంబంధమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఫంగస్ పై యొక్క మంచి నియంత్రణను సాధించడానికి బహుళ ప్రయోజన మట్టి ధూపాలను ఉపయోగించండి. నారుమళ్ళు లేదా విలువైన పంటల చికిత్స కొరకు మెటా సోడియం ఆధారిత ఉత్పత్తులను వాడవచ్చు.

దీనికి కారణమేమిటి?

స్క్లెరోటియం రోల్ఫ్సీ అని కూడా పిలువబడే ఎథెలియా రోల్ఫ్సి అనే ఫంగస్ వల్ల ఈ లక్షణాలు సంభవిస్తాయి. ఇది మట్టిలో లేదా మొక్కల వ్యర్థాలలో చలికాలం గడుపుతుంది. ఇది వ్యవసాయ మరియు హార్టికల్చరల్ పంటలలో (పప్పు, చికగాదదుంప, గుమ్మడికాయ, మొక్కజొన్న, గోధుమ మరియు వేరుశెనగ, మొదలగునవి) తెగులును కలిగిస్తుంది. అనుకూలమైన పరిస్థితులలో, ఇది శరవేగంగా అభివృద్ధి చెందుతుంది మరియు కొద్ది రోజులలోనే మట్టి వద్ద లేదా సమీపంలోని మొక్కల కణజాలాల వద్ద ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటుంది. తక్కువ నేల పి హెచ్ (3.0 నుండి 5.0), తరచూ నీటిపారుదల లేదా వర్షాలు, దగ్గరగా నాటడం మరియు అధిక ఉష్ణోగ్రతలు (25 నుండి 35 ° C) ఫంగస్ యొక్క జీవిత చక్రం మరియు సంక్రమణ ప్రక్రియకు అనుకూలంగా ఉంటాయి. దీనికి విరుద్ధంగా, అధిక పి హెచ్ ఉన్న సున్నపు నేలలలో సాధారణంగా ఈ సమస్యలు ఉండవు. వ్యాప్తి అనేది తెగులు సోకిన నేల మరియు నీరు, కలుషితమైన పనిముట్లు మరియు సామగ్రి, అలాగే ఈ తెగులు సోకిన మొక్క మరియు జంతు ఎరువుల (విత్తనాలు మరియు పేడ) మీద ఆధారపడి ఉంటుంది.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడిన విత్తన సంస్థ నుండి ఆరోగ్యకరమైన విత్తనాలను ఉపయోగించాలని గుర్తించుకోండి.
  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక విత్తనాలను ఇంతకు ముందు ఈ వ్యాధి సోకని పొలాల్లో ఉపయోగించండి.
  • మరీ ఎక్కువగా మొలకలను నాటకండి మరియు మొక్కల మధ్య సరైన ఎడంను పాటించండి.
  • ఆలస్యంగా నాటడం కూడా వ్యాప్తిని తగ్గిస్తుంది.
  • అధిక తేమను నివారించడానికి, పొలంలో మంచి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి.
  • మొక్కలను నిటారుగా ఉంచడానికి అవసరమైతే కర్రలను వాడండి.
  • అధికంగా నీరు పెట్టడం వలన ఫంగస్ మొక్కలకు సోకుతుంది, అందువలన మొక్కలకు నీరు అధికంగా పెట్టవద్దు.
  • పరికరాలు మరియు పనిముట్లను క్రిమి సంహారకాలతో శుభ్రం చేయండి.
  • పొలాల మధ్యన మట్టిని రవాణా చేయవద్దు.
  • పొలంలో కలుపు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి.
  • ఈ వ్యాధి లక్షణాల కోసం కనీసం వారానికి ఒకసారి పొలాన్ని పర్యవేక్షిస్తూ వుండండి.
  • వ్యాధి సోకిన మొక్కలను పొలంలో లోతుగా కపెట్టండి లేదా తొలగించి నాశనం చేయండి.
  • పొలంలో పని చేస్తున్నప్పుడు మొక్కలకు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోండి.
  • మట్టిని కప్పడానికి మరియు ఫంగస్ ఎదుగుదలను పరిమితం చేయడానికి, నల్లని ప్లాస్టిక్ రక్షణ కవచాన్ని (మల్చింగ్) వాడండి.
  • సున్నం వేసి మట్టిలో పి హెచ్ స్థాయిని సర్దుబాటు చేయండి.
  • మొక్కలను బలోపేతం చేయడానికి మంచి ఎరువుల ప్రణాళికను అమలుపరచండి.
  • శిలీంధ్రాల పెరుగుదలను దెబ్బతీసేందుకు మరియు మట్టిని సౌర వికిరణానికి గురిచేయడానికి 20-30 సెంటీమీటర్ల లోతులో శిధిలాలను పాతిపెట్టండి.
  • ఈ వ్యాధికి అతిధులు కానీ మొక్కలతో అనేక సంవత్సరాలు పంట భ్రమణాన్ని ప్లాన్ చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి