ఆలివ్

ఆలివ్ పంటలో సెర్కోస్పోరా ఆకు మచ్చ

Pseudocercospora cladosporioides

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకు పైభాగంలో గోధుమ రంగులో నిర్జీవంగా మారిన పత్రహరితం కోల్పోయిన ప్రాంతాలు ఏర్పడతాయి.
  • శిలీంధ్రాల పెరుగుదల కారణంగా ఆకు దిగువ భాగం సీసం-బూడిద రంగులోకి మారుతుంది.
  • ఆకులు రాలిపోవడం వల్ల ఎదుగుదల కుంటుపడుతుంది మరియు పండ్లు వికృతంగా మారతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
ఆలివ్

ఆలివ్

లక్షణాలు

వ్యాధి లక్షణాలు ఆకుల ఎగువ మరియు దిగువ భాగంలో విభిన్నంగా ఉంటాయి. ఆకు పైభాగంలో, ఒక క్రమరహితమైన, విస్తరించిన పత్రహరితం కోల్పోయి పాలిపోయిన మచ్చలు కనిపిస్తాయి, మొక్క ఎదిగేకొలదీ ఇవి నిర్జీవంగా గోధుమ రంగులోకి మారతాయి. దీనికి విరుద్ధంగా, ఆకు క్రింది భాగంలో పొక్కులు కనిపిస్తాయి, ఇవి ఫంగస్ పెరుగుదల కారణంగా క్రమంగా మురికి బూడిద రంగులోకి మారుతాయి. తర్వాత ఆకులు పసుపు, ఎరుపు-గోధుమ రంగులోకి మారుతాయి మరియు తెగులు తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఆకులు ముందుగానే రాలిపోవచ్చు. సాధారణంగా ఈ తెగులు ప్రభావానికి గురైన కొమ్మలు లేదా చెట్ల ఎదుగుదల కుంగిపోతుంది. పండ్లపై చిన్న, పుండు లాంటి గోధుమ రంగుమచ్చలను వృద్ధి చెందుతాయి మరియు పండ్లు ఒకే సమయానికి పక్వానికి రాకుండా ఆలస్యంగా పక్వానికి వస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వ్యాధిని నియంత్రించడానికి బోర్డియక్స్ మిశ్రమం వంటి సేంద్రీయ రాగి సమ్మేళనాలను వర్షం కురిసే ముందు లేదా పంట కోత తర్వాత నేరుగా వాడవచ్చు

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి స్థిరమైన కాపర్ స్ప్రేలు, ఉదాహరణకు కాపర్ హైడ్రాక్సైడ్, కాపర్ ఆక్సీక్లోరైడ్, ట్రైబాసిక్ కాపర్ సల్ఫేట్ లేదా కాపర్ ఆక్సైడ్ కలిగిన ఆకులను రక్షిత పొరతో కప్పడానికి ఉపయోగించవచ్చు. పంట కోసిన తర్వాత, శరదృతువు మరియు శీతాకాలపు వర్షాలు శిలీంధ్ర బీజాంశాలను వ్యాప్తి చేయడానికి ముందు రాగి ఆధారిత పిచికారీలను నేరుగా వాడాలి. పండు నాణ్యత పాడవ్వకుండా ఉండటానికి వాటిని పంట కాలం దగ్గర ఉపయోగించకూడదు.

దీనికి కారణమేమిటి?

ఫ్యూసిక్లాడియం ఒలీజినియం లేదా కొల్లెటోట్రిచమ్ జాతులు మరియు అబియోటిక్ కారకాల వల్ల కలిగే ఇతర వ్యాధికారక సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధి లక్షణాల పోలికలతో తరచుగా గందరగోళానికి గురిచేస్తాయి.సెర్కోస్పోరా క్లాడోస్పోరియోయిడ్స్ అనే ఫంగస్ వల్ల ఈ లక్షణాలు ఏర్పడతాయి. ఇది చెట్టుపై ఉండే తెగులు సోకిన ఆకులపై, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే గాయాలలో జీవిస్తుంది. శరదృతువులో వృద్ధిని పునఃప్రారంభించడంతో, ఈ గాయాల అంచులు విస్తరించి బీజాంశాల యొక్క కొత్త బ్యాచ్ అక్కడ వృద్ధి చెందుతుంది. కొత్త ఇన్ఫెక్షన్లు తరచుగా పడే వర్షపాతంతో సంబంధం కలిగి ఉంటాయి మరియు శీతాకాలంలో ఎక్కువగా సంభవిస్తాయి. వేసవి నాటికి, కొమ్మల చివరన ఆరోగ్యంగా ఉన్న కొన్ని ఆకులను మినహాయించి, వ్యాధి సోకిన మిగిలిన ఆకులన్నీ చెట్ల నుండి రాలిపోతాయి, అధిక ఉష్ణోగ్రతలు ఫంగస్ జీవిత చక్రాన్ని నిరోధిస్తాయి. ఈ వ్యాధి ఆర్థిక నష్టాన్ని కలిగించేంత తీవ్రంగా మారడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. అధిక స్థాయిలో ఆకులు రాలిపోవడం మరియు పండ్లు ఒకే సమయానికి పక్వానికి రాకుండా ఆలస్యంగా పక్వానికి రావడం మరియు ఏకరీతిగా పండని పండు ఆలివ్ ఆయిల్ దిగుబడి తగ్గడానికి దారి తీస్తుంది.


నివారణా చర్యలు

  • వ్యాధి లక్షణాల కోసం చెట్లను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • నత్రజని ఎరువులు అధికంగా వాడకండి, కానీ తగినంత కాల్షియంను వాడండి.
  • సాధ్యమైనప్పుడల్లా స్ప్రింక్లర్ల ద్వారా నీరు పెట్టకండి.
  • ఆకులు మరియు పండ్లు త్వరగా పొడిబారడానికి వీలుగా గాలి ప్రసరణ బాగా జరిగేలా మొక్కల సాంద్రత ఉండేలా చూసుకోండి.
  • మొక్కలను తగిన విధంగా వరుసలలో నాటడం ద్వారా మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి.
  • పోషకాలు మరియు తేమ కోసం పోటీని తగ్గించడానికి చెట్ల చుట్టూ ఉండే కలుపు మొక్కలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి