చెరుకు

పైనాపిల్ లో నల్ల కుళ్ళు తెగులు

Ceratocystis paradoxa

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • అంతర్గత కణజాలం ఎరుపు - గోధుమ-నలుపు - నలుపు రంగులోకి మారుతుంది.
  • బాగా ముగ్గిన పైనాపిల్స్ లాగా వాసన వస్తుంది.
  • రెమ్మలు నెమ్మదిగా కుళ్ళిపోతాయి.
  • వేర్లు ఏర్పడవు.

లో కూడా చూడవచ్చు

3 పంటలు

చెరుకు

లక్షణాలు

కత్తిరించబడిన చివర్ల ద్వారా లేదా కీటకాలు ఉత్పత్తి చేసే గాయాల ద్వారా ఫంగస్ లోనికి ప్రవేశిస్తుంది. ఇది అంతర్గత కణజాలాల ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. ఇవి మొదట ఎరుపుగా మారి తరువాత గోధుమ-నలుపు మరియు నలుపు రంగులోకి మారుతాయి. కుళ్ళిన ప్రక్రియ గుల్లలు ఏర్పడటానికి దారితీస్తుంది మరియు బాగా ముగ్గిన పైనాపిల్స్ యొక్క వాసన వంటి వాసనను విడుదల చేస్తుంది. ఈ వాసన చాలా వారాలు నిలిచి వుంటుంది. ఈ తెగులు సోకిన పంటల వేర్లు ఏర్పడటంలో విఫలమవుతాయి. తొలి మొగ్గలు పెరగడంలో విఫలమవుతాయి మరియు ఒకవేళ పెరిగినా చనిపోతాయి లేదా ఎదుగుదల తగ్గుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

సీజన్లో నాటడం ఆలస్యం అయినట్లయితే, నాటడానికి ముందు 30 నిమిషాలు వేడి నీటిలో (51 ° C వద్ద) సెట్లను చికిత్స చేయండి. పొలంలో మొలకెత్తని కాండాల కోసం చూడండి మరియు తెగులు సంకేతాలను (కుళ్ళిన మరియు దుర్వాసన) గుర్తించడానికి వాటిని చీల్చి చూడండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. శిలీంద్ర సంహారిణి వాడకం ఆర్థికంగా అనుకూలంగా ఉండదు.

దీనికి కారణమేమిటి?

నాటిన మొదటి వారాలలో తెగులు సంభవిస్తుంది. గాలి లేదా నీటిలో బీజాంశాల ద్వారా మరియు నీటిపారుదల నీటి వలన కూడా ఈ ఫంగస్ కూడా వ్యాపిస్తుంది. కీటకాలు, ముఖ్యంగా బీటిల్స్, సెట్లలోనికి రంధ్రాలు చేయడం ద్వారా బీజాంశాలను పంపిణీ చేస్తాయి. ఈ బీజాంశం కనీసం ఒక సంవత్సరం మట్టిలో జీవించగలదు. తెగులు సోకిన మొక్కలపై అవి చాలా నెలలు జీవించగలవు. వర్షం పడిన తర్వాత నీరు నిలువ వుండే ప్రాంతాలు ఈ తెగులుకు గురయ్యే అవకాశం ఉంది. 28°C ఉష్ణోగ్రతలు స్పోర్యులేషన్ మరియు ఫంగస్ పెరుగుదలకు చాలా అనుకూలంగా ఉంటాయి. సుదీర్ఘ కరువు వలన కూడా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక రకాలను పెంచండి.
  • కనీసం మూడు కణుపుల పొడవుతో ఆరోగ్యకరమైన నాటడం సెట్లను ఉపయోగించండి.
  • నాటిన తరువాత వేగంగా పెరిగే మొలకల రకాలను ఎంచుకోండి.
  • పొలంలో మంచి నీటి పారుదల ఉండేలా చూసుకోండి.
  • అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులను నివారించడానికి మొక్కలను జాగ్రత్తగా ప్లాన్ చేయండి.
  • తెగులు సోకిన పంటల యొక్క మిగిలిపోయిన పంట చెత్తను కాల్చి నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి