కాప్సికమ్ మరియు మిరప

పండు మిరపలో పక్షి కన్ను తెగులు

Colletotrichum sp.

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • పండ్లపై గాయాలు.
  • ఆకులు మరియు కాడలపై కేంద్రీకృత వలయాలతో కూడిన బూడిద-గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి.
  • పండ్లపైన మచ్చల లోపల కేంద్రీకృతమైన వలయాలు.
  • కొమ్మలు పైనుండి ఎండిపోయి చనిపోవడం, పండ్లు కుళ్లిపోవడం జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు


కాప్సికమ్ మరియు మిరప

లక్షణాలు

నీటితో నానినట్టు వుండే కోణాకారపు లేదా గుండ్రని మచ్చలు మృదువైన ఆకారంలో కొంచెం నొక్కుకుపోయినట్టు ఉంటాయి. ఈ మచ్చల మధ్య భాగం నారింజ లేదా గోధుమరంగులో ఉంటాయి. తరువాత ఇవి నలుపు రంగులోనికి మారుతుంది. దీనికి దగ్గరలోని కణాలు లేతరంగులో ఉంటాయి. పండు ఉపరితలంపై చాలా భాగాన్ని ఈ మచ్చలు కప్పేస్తాయి. పండ్ల మచ్చలలో ఏక కేంద్రక వలయాలు సర్వసాధారణము. కేంద్రీకృతమైన మచ్చలు ఈ పండ్ల మచ్చల మధ్యలో ఏర్పడతాయి. ఈ తెగులు లక్షణాలు బైటకు కనపడకుండానే ఆకుపచ్చ పండ్లకు ఈ తెగులు సంక్రమిస్తుంది. ఈ కాయలు పూర్తిగా పక్వదశకు వచ్చేవరకు ఈ తెగులు లక్షణాలు బైటపడవు. ఆకులు మరియు కాండాలపైనచిన్న పరిమాణంలో చిన్న మచ్చలు ఏర్పడతాయి. ముదురు గోధుమరంగు అంచులు గల చిన్న పరిమాణంలో , క్రమరహిత ఆకారములో వుండే బూడిద గోధుమరంగు మచ్చలు కాండాలపై ఏర్పడతాయి. సీజన్ చివర్లో ఈ పండ్లు కుళ్లిపోయి కొమ్మలు చనిపోతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులు సోకిన విత్తనాలను 30 నిమిషాలు 52 °C వేడి నీటిలో నానబెట్టటము ద్వారా నయం చేయవచ్చు. చికిత్స సరైన ప్రభావాన్ని చూపించడానికి సరైన ఉష్ణోగ్రత మరియు సమయమునకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఒకవేళ శిలీంద్ర నాశినులు వాడవలసివస్తే మాంకోజెబ్ లేదా రాగి ఆధారిత ఉత్పత్తులు కలిగిన ఉత్పత్తులను స్ప్రే చేయండి. పుష్పించే దశలో ఈ మందులను వాడండి.

దీనికి కారణమేమిటి?

కొల్లెటోట్రిచమ్, C. గ్లియోస్పోరియోడెస్ మరియు C. కాప్సిసిజాతుల ఫంగస్ వలన మొక్కలో అన్ని పెరిగే దశలలో అంటే, అపరిపక్వ దశ మరియు పక్వ దశ, మరియు కోత తరువాత కూడా సంక్రమిస్తుంది. ఇది విత్తనములలో మరియు వాటిపై, మొక్క వ్యర్థాలు లేదా సోలనైసీ లాంటి ప్రత్యామ్నాయ అతిధులపై జీవిస్తుంది. ఈ ఫంగస్ వెచ్చని మరియు తడి వాతావరణంలో వృద్ధి చెందుతుంది. ఇది వర్షం మరియు సాగు నీటి ద్వారా విస్తరిస్తుంది.10°C నుండి 30°C ఉష్ణోగ్రతల వద్ద ఇది పండ్లకు సంక్రమిస్తుంది. అయితే 23°C నుండి 27°C మధ్య వుండే ఉష్ణోగ్రతలు ఈ తెగులు వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. పండు పైన తడి పెరిగే కొద్దీ తెగులు యొక్క తీవ్రత పెరుగుతుంది.


నివారణా చర్యలు

  • నాటడానికి ముందు మట్టిలో కార్బన్ కంటెంట్ పెంచడానికి పెంటను మట్టిలో వేయండి కి వర్తించండి.
  • నీరు నిలవకుండా ఉండటానికి పొలంలో మంచి డ్రైనేజ్ వ్యవస్థను ప్లాన్ చేయండి.
  • నేల మరియు మొక్కల మధ్య బీజాంశం సంక్రమించకుండా ఉండటానికి వరుసల మధ్య రక్షక కవచాన్ని ఏర్పాటు చేయండి.
  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే నిరోధక రకాలను ఉపయోగించండి.
  • ఆరోగ్యంగా వున్న మొక్కల నుండి లేదా ధృవీకరించబడిన మూలాల నుండి సేకరించిన విత్తనాలను ఉపయోగించండి.
  • నాటడానికి ముందు వ్యాధి సంకేతాల కోసం మొలకలని తనిఖీ చేయండి.
  • వ్యాధి సంకేతాల కోసం క్రమం తప్పకుండా పొలాన్ని పర్యవేక్షించండి.
  • పొలం మరియు చుట్టుపక్కల కలుపు మొక్కలు మరియు ప్రత్యామ్నాయ అతిధి మొక్కలను తొలగించండి.
  • ఓవర్ హెడ్ ఇరిగేషన్ మానుకోండి మరియు ఉదయం మాత్రమే నీరు పెట్టండి.
  • నత్రజనిని విడతలవారీగా ఉపయోగించి, సమతుల్య ఫలదీకరణాన్ని ప్లాన్ చేయండి.
  • పంట కోత తర్వాత కాల్చడం ద్వారా మొక్కల వ్యర్థాలను తొలగించండి లేదా నాశనం చేయండి.
  • పంట మార్పిడి చేయండి కాని పండు మిరప, టమోటా లేదా స్ట్రాబెర్రీ లాంటి పంటలతో పంట మార్పిడి చేయవద్దు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి