వరి

వరిలో కాడ కుళ్ళు తెగులు

Sarocladium oryzae

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • వరికంకులను కప్పి వుండే ఆకుల యొక్క పైభాగంలో మచ్చలు వంటి గాయాలు ఏర్పడతాయి.
  • కాండం పైన తొడుగు కుళ్లిపోయి తెల్లని పౌడర్ లాంటి ఫంగి ఏర్పడుతుంది.
  • ధాన్యం రంగు కోల్పోతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

వరి కంకుల చుట్టూ వున్న ఆకుల అపసవ్యంగా మచ్చలు (0.5 to 1.5 మిల్లీమీటర్లు) ఏర్పడతాయి. బూడిద రంగు మధ్య భాగం మరియు గోధుమ రంగు అంచులుగా మచ్చలు ఏర్పడి ఆకు పైపొర రంగుకోల్పోతుంది. తెగులు తీవ్రంగా వున్నప్పుడు కొత్తగా కంకులు ఏర్పడకపోవచ్చు. తెగులు సోకిన ఆకు పైపొరపైన చాలా ఎక్కువమోతాదులో తెలుపు రంగులో పొడిబారిన ఫంగస్ కనిపిస్తుంది. కంకులలోన ధాన్యం గింజలు రంగు కోల్పోయి నిస్సారంగా అయిపోతాయి. ఇంకా పూర్తిగా పైకి రాని వరికంకులు ఎరుపు- గోధుమ రంగునుండి ముదురు గోధుమ రంగు కలిగిన పుష్పాలను ఉత్పత్తిచేస్తాయి. బూటింగ్ చివరి దశల్లో ఈ తెగులు సంక్రమిస్తే ఇది చాలా తీవ్రమైన నష్టాన్ని కలుగచేస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

సిట్రస్ మరియు వరి నుండి తీయబడిన సుడోమొనాస్ ఫ్లోరోసెన్స్ యొక్క రైజో బాక్టీరియా సిట్రస్ వరి కాండంకుళ్ళు తెగులుకు విషంలాంటిది. ఇది తెగులు నియంత్రించడానికి మరియు ఉత్పత్తి పెరగడానికి దోహదపడుతుంది. బైపోలారిస్ జికోలా కూడా S. ఒరైజెయొక్క మైసిలియల్ పెరుగుదలను అరికడుతుంది. శీలింద్ర నాశక గుణాలు వున్న టగేటెస్ ఎరేక్టా ఆకులనుండి పువ్వులనుండి తీసిన సారం S. ఒరైజె మైసెలియంను 100% నిరోధిస్తుంది

రసాయన నియంత్రణ

వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. చీడ అధికంగా ఉన్నపుడు బెనోమిల్, కార్బెన్డజిమ్, మాంకోజెబ్, కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా ప్రొపికోనజోల్ వంటి శిలీంద్రనాశకాలు వాడటం మంచిది. విత్తనాలు నాటేముందు మాంకోజెబ్ వంటి శీలింద్ర నాశినులతో విత్తన శుద్ధి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

దీనికి కారణమేమిటి?

కాండం కుళ్ళు తెగులు ప్రధానంగా విత్తనాల ద్వారా సంక్రమిస్తుంది.. ఈ తెగులు ప్రధానంగా ఫంగస్ సరోక్లాడియం ఓరిజై వలన మరి కొన్ని సమయాల్లో సక్రోలడియం అట్టెన్యూటం వంటి ఫంగస్ వల్ల సంభవిస్తుంది. పంటకోత తర్వాత మిగిలిన వరి అవశేషాలైన గడ్డి మొదలైనవాటిపైన జీవించివుండి ఆ తరువాత వేసిన పంటకు మరలా సంక్రమిస్తుంది.. ఎక్కువ మొక్కల సాంద్రతతో పంట వేస్తే ఈ తెగులు మరింత ఎక్కువగా పంటకు సంక్రమిస్తుంది. వరికంకులు ఏర్పడే సమయంలో ఈ తెగులు సులువుగా సంక్రమిస్తుంది. పిలకలు మొలకెత్తే సమయం లో పొటాషియం, కాల్షియమ్ సల్ఫేట్ లేదా జింక్ ఎరువులు చల్లటం అధిక నష్టం కలగకుండా కాపాడుతుంది. వేడి (20-28°C) మరియు తేమవాతావరణం (తడి) ఈ తెగులు వృద్ధిచెందడానికి అనుకూలం.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడిన ఆరోగ్యకరమైన విత్తనాలు వాడాలి.
  • మొక్కల మధ్య 25cm x 25cm దూరం ఉండాలి.
  • ఒకే రకం వంగడాలు కాకుండా కనీసం రెండు వేరు వేరు రకాలు వాడాలి.
  • కంకినల్లి లాంటి తెగులు పంటను ఆశిస్తున్నాయేమో తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా పొలాన్ని గమనిస్తూ వాటిని నియంత్రించడానికి ప్రయత్నించండి.
  • పిలకలు వేసే సమయంలో పొటాషియం, కాల్షియం ఫాస్ఫేట్ లేదా జింక్ ఎరువులు వేయండి.
  • పొలంలో కలుపు మొక్కలను తీసి వేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి