వరి

వరిలో కాండం కుళ్ళు తెగులు

Magnaporthe salvinii

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకు తొడిమ పైభాగంపై చిన్నచిన్న, అపసవ్యమైన నల్లటి మచ్చలు ఏర్పడతాయి.
  • ఈ నష్టం విస్తరిస్తుంది.
  • ఆకుల మధ్యన కాండం భాగాలు కుళ్ళిపోయి కుప్పకూలిపోతాయి.
  • పడిపోవడం, కంకులు పాలు పోసుకోకపోవడం, ధాన్యం తెల్లని రంగులోకి మారడం, పిలకలు చనిపోవడం జరుగుతుంది.
  • తెగులు సోకి బోలుగా మారిన కాండం లోపల, ముదురు బూడిద రంగు మైసీలియం ఏర్పడుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

ఈ లక్షణాలు పిలకలువేసే దశ తరువాతే కనిపిస్తాయి. నీటి మట్టం వద్ద, ఆకు తొడిమ పైభాగంపై చిన్నచిన్న, అపసవ్యంగా నల్లటి మచ్చలు ఏర్పడటం మొదటి సంకేతంగా చెప్పొచ్చు. తెగులు తీవ్రత పెరిగేకొద్దీ ఈ మచ్చలు పెద్దవి అవుతూ ఆకుతొడిమ లోపలభాగాల్లోకి చొచ్చుకుపోతాయి. దీనివలన గోధుమరంగుతో కూడిన నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఒకటి లేదా రెండు కాడలు కుళ్లిపోయి విరిగిపోతాయి. (కాండం పైభాగం మాత్రమే చెక్కుచెదరకుండా ఉంటుంది). దానివలన కాండం ఒకవైపుకు వాలిపోయి కంకుల్లో తాలు గింజలు ఏర్పడతాయి లేదా పిలకలు నశించిపోతాయి. తెగులు సోకిన కాండం లోపలభాగంలో చిన్న చిన్న నల్లని స్కెలేరోషియా తో పాటు ముదురు బూడిదరంగు మైసీలియం ను చూడవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

మంచి పంట యాజమాన్య పద్ధతులు పాటించడం మరియు వైరస్ కు ప్రతికూలంగా జీవించే జీవులను వుపయోగించి ఈ కాండం కుళ్ళు తెగులును నివారించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సాధారణంగా పిలకలు వేసే దశ మధ్య నుండి లేదా వ్యాధి ప్రారంభమయ్యే సమయంలో, వాలిడామైసిన్ లేదా హెక్సాకోనజోల్ (2 మి.లీ/లీ), ప్రొపికోనజోల్ (1 మి.లీ/లీ) లేదా థియోఫనేట్ మిథైల్ (1.0 గ్రా/లీ) ఆధారిత మందులను 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

దీనికి కారణమేమిటి?

మాగ్నాపోర్తే సాల్విని ఫంగస్ వలన ఈ చిహ్నాలు ఏర్పడతాయి. ఇది చలికాలం మొత్తం చనిపోయిన మొక్క కణజాలంలో కానీ మట్టిలో కాని జీవించివుంటుంది. పరిస్థితులు అనుకూలించినప్పుడు (ఎక్కువ తేమ, ఎక్కువ నత్రజని ఎరువుల వాడకం) వర్షపు చినుకులవలన మరియు సాగునీటివలన దీని బీజాంశాలు విస్తరిస్తాయి . ఇది ఆకు పైకి చేరినప్పుడు ఆకుకు అంటిపెట్టుకుని ఉండి ఆకుపైవుండే పైపొరను ఉపయోగించుకుని జెర్మ్ ట్యూబును ఉత్పత్తిచేస్తుంది. సరైన సస్యరక్షణ విధానాలు పాటించకపోవడంవలన, కీటకాలు దాడిచేయడంవలన లేదా మొక్కలు దెబ్బతినడంవలన ఇది మరింత సులువుగా వ్యాపిస్తుంది. పంట పక్వదశకు వచ్చేసమయంలో ఈ తెగులు మరింత తీవ్రతరమౌతుంది. ఉష్ణమండల ప్రదేశాలలో పంట కోత తర్వాత వుండే అధిక తేమ ఈ ఫంగస్ మరింత పెరిగేటట్టు చేస్తుంది.


నివారణా చర్యలు

  • నాటినప్పుడు మొక్కల సాంద్రతను తగ్గించండి.
  • నత్రజని వాడకాన్ని తగ్గించండి మరియు అనేక విడతల్లో వేయండి.
  • మట్టి పి హెచ్ ఎక్కువగా ఉండటానికి పొటాష్ అధికంగా వాడండి.
  • పొలాలలో మరియు చుట్టుపక్కల కలుపు మొక్కలను నియంత్రించండి.
  • పంట కోతలు పూర్తయిన వెంటనే మిగిలిన పంట అవశేషాలను కాల్చివేయండి మరియు గడ్డిని కుళ్లిపోయేటట్టు చేయొద్దు.
  • ప్రత్యామ్నాయంగా, నేలకు దగ్గరగా పంటను కోయండి మరియు పంట కోత తర్వాత పొలంలో గడ్డిని తొలగించండి.
  • లేదా పంట అవశేషాలను మట్టిలో లోతుగా దున్ని పాతిపెట్టవచ్చు.
  • పొలంలో సాగునీరు నిలువ వుండకుండా చూడండి.
  • పొలాన్ని కొన్ని నెలలు లేదా సంవత్సరం పంటలు ఏవీ వేయకుండా బీడుగా వదిలేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి