వరి

వరిలో ఫోమా సోర్గినా

Epicoccum sorghinum

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఎదుగుతున్న పూల మీద నీటిలో నానినట్టు వుండే మచ్చలు కనబడతాయి.
  • గింజ పైపొరపైన ఒక తెల్లటి కేంద్రం (గ్లూమ్ బ్లెయిట్) చుట్టూ ముదురు గోధుమ అంచుల గల అండాకార లేదా ఒక వరుసలో లేని మచ్చలు కనబడతాయి.
  • తెగులు సోకే అవకాశం వున్న వరి రకాలలో తీవ్రమైన సందర్భాలలో, 95% వరకు వరి కంకులు పాడైపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

తెగులు యొక్క మొదటి లక్షణాలు ఎదుగుతున్న పువ్వుల పైన నీటిలో నానిన గాయాలు మాదిరి కనబడతాయి. ఇవి ఆ తర్వాత పెద్దగా అయ్యి ఒక తెల్లటి కేంద్రం చుట్టూ ముదురు గోధుమరంగు అంచులు గల అండాకార లేదా క్రమరహిత మచ్చలుగా మారుతాయి. కంకులు ఏర్పడక ముందు తెగులు సోకినట్లైతే పువ్వులు కుళ్ళిపోయి, చివరకు ఎండి పోతాయి. పూత దశ తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే గింజలు పాక్షికంగా మాత్రమే నిండుతాయి మరియు గింజ పైపొరలో ఒక క్రమంలో లేని మచ్చలు కనబడతాయి. ఈ తెగులుకు గురయ్యే అవకాశం గల వరి రకాలలో (ఉదాహరణకు చైనా బోరో) తీవ్రమైన సందర్భాలలో, 95% వరకు కంకులు పాడైపోతాయి. పెనుగాలులతో పాటు వచ్చే భారీ వర్షాలు, నీరు ఎక్కువగా పెట్టిన పొలాలు మరియు ఎక్కువ సూర్య రశ్మి ఈ తెగులుకు అనుకూలమైనవి. వరి పండించే మెట్ట పొలాలలో గ్లూమ్ బ్లైట్ తీవ్రత తక్కువగా ఉంటుంది. కానీ దీనిని నియంత్రించకపోతే ఇది ఒక పెద్ద అంటువ్యాధిగా మారుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ రోజు వరకు, ఈ తెగులు తీవ్రతను తగ్గించే జీవ సంబంధ నియంత్రణ కనుగొనబడలేదు. మీకు ఏదైనా తెలిస్తే దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. బెనోమిల్ గల ఉత్పత్తులను వుపయోగించి విత్తనశుద్ధి చేయండి. సహజంగా తెగులు సోకిన కొన్ని రకాల వరి విత్తనాల మీద ఫోమా సోర్గినాను మెరుగ్గా నియంత్రించవచ్చు. ఇప్రోడియోన్ మరియు కాప్టన్ ను కూడా ఉపయోగించవచ్చు కానీ అవి అంత సమర్ధవంతంగా పనిచేయవు.

దీనికి కారణమేమిటి?

విత్తన మరియు నేల జనిత ఫంగస్ అయిన ఎపికోకమ్ సోర్గి వలన ఈ తెగులు లక్షణాలు ఏర్పడతాయి, ఈ ఫంగస్ ను ఇంతకు ముందు ఫోమా సోర్గినా అని పిలిచేవారు. ఇది బలహీనమైన లేదా ఒత్తిడి గల మొక్కల పై దాడి చేసే ఒక అవకాశవాది జీవి మరియు ఇది జొన్న, చిరు ధాన్యాలు , చెరుకు మరియు వరి వంటి ఆర్థిక ప్రాముఖ్యత గల పంటలతో ముడిపడినప్పటికీ, ఇది ప్రపంచ వ్యాప్తంగా వున్న చాలా రకాల అతిథేయ పంటల మీద కూడా ప్రభావం చూపగలదు. ఈ ప్రత్యామ్నాయ అతిధి పంటలలో అకేసియా, అలో, సిట్రస్ మరియు యూకలిప్టస్ యొక్క కొన్ని జాతులు వున్నాయి. ఈ ఫంగస్, పంట వ్యర్థాలలో జీవిస్తుంది. ఎందుకంటే ఆఫ్రికాలో ఇది తాటాకు కప్పులు మరియు పశుగ్రాసం మీద కూడా మనుగడ సాగించినట్లుగా చెప్పబడినది. ఇది మొక్కలలో వ్యాధి లక్షణాల అభివృద్ధిని ప్రేరేపించే మైకోటాక్సిన్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది మానవుల మరియు జంతువుల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. వీటివలన మనుష్యులలో చర్మం మీద ఎర్రని గాయాలు నోటిలో బొబ్బలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో కాన్సర్ కూడా సంభవించవచ్చు.


నివారణా చర్యలు

  • అందుబాటులో వుంటే వ్యాధి నిరోధక వంగడాలను వాడండి.
  • పొలంలో నీరు సరిగా పారేలా చూసుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి