అరటి

అరటిలొ బాక్టీరియా దుంప కుళ్ళు

Pectobacterium carotovorum

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • వేర్ల లోని కణజాలాలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతాయి.
  • ఆకు కాడ ప్రాంతం కుళ్ళి పసుపు లేదా గోధుమ రంగు నీటిలో తడిచిన భాగాలుగా అగుపిస్తాయి.
  • చెట్టు కాండం మొదళ్ళు ఉబ్బి పగిలే అవకాశం వుంది.చెట్టులో నిస్సత్తువ మరియు ఆకులు రాలడం కనిపిస్తుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

అరటి

లక్షణాలు

ఇటీవల నాటిన మొలకలలో, ప్రారంభ సంకేతాలు మిధ్యాకాండం మరియు వేర్లలొని అంతర్గత కణజాలం కుళ్ళుతున్నట్టు కనిపిస్తాయి. ఈ ముదురు గోధుమ లేదా పసుపు నీటిలో నానిన ప్రాంతాలు మరియు కుళ్ళు వాసన దీని లక్షణాలు. రోగ గ్రస్త మొక్కలను కోసినట్లయితే, ఎరుపు మరియు పసుపు రంగు స్రవం కనిపిస్తుంది. కాలర్ ప్రాంతంలో కుళ్ళిపోయిన తరువాత ఆకులు పూర్తిగా పొడిగా మారి ఓజస్సును కోల్పోతాయి. తెగులు తర్వాతి దశలలో, కాండం మొదలు ఉబ్బి విడిపోతుంది. పెద్ద మొక్కలలో, కాలర్ ప్రాంతం వద్ద మరియు కూడా ఆకు మొదళ్ళలో కుళ్ళిపోవడం జరుగుతుంది. ప్రభావితం మొక్కలు బయటకు లాగి చూస్తే కాలర్ ప్రాంతంలో బల్బ్ మరియు మూలాలు మట్టిలోనే ఉండిపోతాయి. మొక్కలు వేసిన 3-5 నెలల తర్వాత ఈ తెగులు బైట పడుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

బాక్టీరియా దుంప కుళ్ళుకు జీవ సంబంధిత నియంత్రణ లేదు. తెగులు సోకిన తరువాత దీనిని నియంత్రణ చేసే అవకాశం లేదు. మీ వద్ద జీవ సంబంధిత చికిత్స తెలిసిఉంటే మమ్మల్ని సంప్రదించండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఒకసారి ఈ తెగులు సోకిన తర్వాత నయం చేసే అవకాశం లేదు లేదా ఈ తెగులును నియంత్రించడం కుదరదు. మీ వద్ద ఏమైనా చికిత్స పద్ధతులు ఉంటే మమ్మల్ని సంప్రదించండి.

దీనికి కారణమేమిటి?

పెక్టో బాక్ట్రిమ్ కరోతోవొరుమ్ అనే బ్యాక్తీరియా వలన ఈ తెగులు సోకుతుంది. ఇది తడి నేలలలో మరియు పంట అవశేషాలలో జీవిస్తుంది. ఈ తెగులు చెట్లమధ్యన వర్షం మరియు నీటిపారుదల వ్యవస్థ వలన వ్యాపిస్తుంది. ఇది ఇప్పటికే తెగులు సోకిన మొక్కలవలన కూడా వ్యాపిస్తుంది. ఈ కాండం మొదలులో భూమికి దగ్గరగా ( కాండం మరియు దుంప కలిసే భాగంలో) కుళ్ళుమచ్చలు ఏర్పడి క్రమేపి దుంప కుళ్లిపోతుంది. క్రొత్తగా నాటిన పిలకలలో మరియు చిన్న మొక్కలలో మొవ్వు ఆకు కూడా కుళ్ళి మొక్క చనిపోతుంది. పెద్ద మొక్కలలో, కాండంపై నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి. దుంప పైభాగం కుళ్ళిన వాసన వస్తుంది. క్రింద వరుస ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. ఈవిధంగా అన్ని ఆకులు ఎండిపోయి మొక్క చనిపోతుంది. ఈ తెగులు వేసవి కాలంలో వేడి మరియు తడి వాతావరంలో ఈ తెగులు తీవ్రత చాలా అధికంగా ఉంటుంది. గెలలు వేసే సమయంలో ఈ తెగులు సోకితే చాలా అధికమొత్తంలో పంట నష్టం కలుగుతుంది. మొక్కల పిలకలు కూడా తెగులు వ్యాప్తి చెందుతుంది.


నివారణా చర్యలు

  • కఠిన దిగ్బంధ చర్యలను అమలుచేయండి.
  • నమ్మకమైన మూలాల నుండి లేదా ఆరోగ్యకరమైన రూట్ స్టాక్స్ నుండి ఆరోగ్యకరమైన మొక్కల పదార్ధాన్ని ఉపయోగించండి.
  • మొక్కలు మధ్య సరైన అంతరం పాటించండి.
  • పొలం లో అధిక నీటిని నివారించడానికి మంచి మురుగు పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయండి.
  • సరియైన సేంద్రీయ పదార్థ మిశ్రమాలు పొలంలో వేయండి.
  • వర్తిస్తాయి.
  • తరచూ మొక్కలు లేదా పొలాలను ఈ తెగులు లక్షణాల కొరకు గమనిస్తూవుండండి.
  • పొలంలో పని పూర్తయిన తర్వాత, పరికరాలు మరియు పనిముట్లు బ్లీచ్ తో శుద్ధి చేయండి.
  • కనీసం మూడు సంవత్సరాలకు ఒక సారి ఈ తెగులు సోకని పంటలతో పంట మార్పిడి చేయండి.
  • సాగు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
  • మెకానికల్ గాయాలు జరగకుండా జాగ్రత తీసుకోండి.
  • ఆకు తడి ఉన్నప్పుడు పొలంలో పని చేయవద్దు.
  • పొడి వాతావరణ పరిస్థితుల్లో పంట కోతలు పూర్తిచేయండి.
  • ఈ తెగులు సోకిన మొక్కలు తొలగించి కాల్చి నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి