మొక్కజొన్న

గిబ్బరిల్లా కాండం కుళ్ళు తెగులు

Gibberella zeae

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • చివర్లో ఎర్రగా మారిన, వంకర్లు తిరిగిపోయిన మరియు కలుషితమైపోయిన పొత్తులు ఏర్పడతాయి.
  • ఆకులు బూడిద నుండి పచ్చ రంగులోకి మారి నిస్తేజమై వాలిపోతాయి.
  • వేర్లు కుళ్లిపోయి కొన్నాళ్లకు మొక్కలు చనిపోతాయి.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

మొక్కజొన్నలో, ఈ వ్యాధి పొత్తులు మరియు కొమ్మల రెండింటి మీది లక్షణాల ద్వారా కనుగొనవచ్చు. ప్రారంభ లక్షణాలుగా పొత్తుల చివరి తెల్లని బూజు గులాబీ లేదా ఎర్రపు రంగులోకి మారుతుంది. ఈ తెగులు విస్తరించే కొలదీ మిగిలిన పొత్తు మొత్తం రంగు కోల్పోయి పాలిపోయినట్టు అవుతుంది. తరుచుగా పొత్తుకు గింజలకు మధ్యన ఈవిధంగా అవుతుంది. తెగులు సోకిన పొత్తులు మొత్తం కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆకులు బూడిద నుండి పచ్చ రంగులోకి మారి నిస్తేజమై వాలిపోతాయి. వేర్లు కుళ్లిపోయి కొన్నాళ్లకు మొక్కలు చనిపోతాయి. క్రిందిభాగంలోని కణుపులు మెత్తగా మారి రాగి రంగు నుండి గోధుమ రంగులోకి మారిపోతాయి. తరువాత నల్లని చుక్కలు వాటి పైభాగంలో ఏర్పడతాయి. వీటిని గోరుతో సులువుగా గీరవచ్చు. కాండాన్ని నిలువుగా కత్తిరిస్తే చిరిగినట్టు వున్న రంగు కోల్పోయి ఎర్రని లేదా గులాబీ రంగులో వున్న కణజాలం కనిపిస్తుంది. ప్రధాన వేరు మెల్లగా కుళ్లిపోయి గోధుమ రంగులోకి మారి పగుళ్లు ఏర్పడతాయి. మొక్కలు ఎదగక ముందే చనిపోయి పడిపోతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

G. జెయి ను నియంత్రించడానికి ఎటువంటి జీవన నియంత్రణ పద్దతి అందుబాటులో లేదు. మీకు ఏమైనా తెలిస్తే దయచేసి మాకు తెలియచేయండి. వేడి నీటితో విత్తన సుద్ది చేయడం వలన ఈ తెగులును కొంత వరకు నివారించే అవకాశం ఉంటుంది. మీ అవసరాలకు వీలుగా వుండే విధంగా విత్తనాలకు ఎంత ఉష్ణోగ్రత వద్ద ఎంత సమయం ఈ పద్దతిని ఉపయోగించాలో నిర్ధారించుకోండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. గిబ్బెరిల్ల ను నియంత్రించడానికి ఎటువంటి శీలింద్ర నాశినులు అందుబాటులో లేవు. ఈ తెగులు తీవ్రత అధికంగా వుండే ప్రాంతాలలో విత్తనాలను శీలింద్ర నాశీనులతో శుద్ధిచేయడం ద్వారా కొంత వరకు ఈ తెగులుని నియంత్రించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు గిబ్బరెల్ల జియా అనే ఫంగస్ వలన ఏర్పడతాయి. ఇవి పంట అవశేషాలపైన మరియు విత్తనాలపైన జీవించి ఉంటాయి.తడి మరియు వెచ్చని వాతావరణంలో ఈ ఫంగస్ బీజాంశాలు ఉత్పత్తి చెంది గాలి ద్వారా మరియు నీటి ద్వారా వ్యాపిస్తాయి. ఈ బీజాంశాలు పొత్తులపైన వుండే పట్టుదారంపైన పడి కణజాలంలో నివాసం ఏర్పరచుకోవడంతో తెగులు మొదలవుతుంది. మొక్కల ఆకులు, కాండం మరియు వేర్లకు అయిన గాయాల వలన కూడా ఇది వ్యాపిస్తుంది. పక్షులు కీటకాలు ఈ బీజాంశాలను మరియు విత్తనాలను ఇతర ప్రాంతాలకు విస్తరించేటట్టు చేస్తాయి. ఇవి మొక్కల కణజాలానికి కూడా నష్టం కలుగచేస్తాయి. వరి, గోధుమ, జొన్న, రై, ట్రిటికెల్ మరియు బార్లీ వంటి పంటలలో ఎటువంటి లక్షణాలు బయటపడకుండా ఈ ఫంగస్ ఆశించ గలదు. దీని వలన ఇవి ఇనకులం కు మూలాలుగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • ఈ తెగులు లక్షణాల కొరకై పొలాన్ని తరుచూ గమనిస్తూ వుండండి.
  • కాండం బలంగా వుండే మరియు ఆకుల తెగుళ్ల నిరోధకతను కలిగి వుండే హైబ్రిడ్ రకాలను ఎంచుకోండి.
  • మొక్కల మధ్యన సిఫార్స్ చేసిన అంతరాన్ని పాటించి సరైన సంఖ్యలో మొక్కలను నాటండి.
  • భూసార పరీక్షలు నిర్వహించి సిఫార్స్ చేసిన ఎరువులు వాడి పొలంలో సరైన మోతాదులలో నత్రజని మరియు పొటాషియం నిష్పత్తి వుండేటట్టు జాగ్రత్త తీసుకోండి.
  • ఫలదీకరణం జరిగిన తరువాత మరియు గింజలు పాలుపోసుకుంటునప్పుడు మొక్కలు వత్తిడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోండి.
  • పొలంలో పనిచేస్తున్నప్పుడు మొక్కలకు గాయాలు కాకుండా చూసుకోండి.
  • వ్యర్థాలు ముక్కలు ముక్కలుగా అయి మట్టిలో కలయునట్లు దున్నండి.
  • ఈ తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి