కందులు

కాయధాన్యపు పంటలో అస్కోచేటా ఎండు తెగులు

Didymella fabae

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకుల మధ్యలో ముదురు చుక్కలు మరియు ముదురు గోధుమ రంగు అంచులు కలిగిన టాన్ మచ్చలు కనిపిస్తాయి.
  • ఆకులు ముందుగానే రాలిపోవడం వలన అలాగే పెరుగుతున్న ప్రాంతాల్లో కాడల డైబ్యాక్ మొక్కలకు ఎండిపోయిన రూపాన్ని ఇస్తాయి.
  • ఉపరితలంపై గోధుమ రంగు ప్యాచీలు ఏర్పడి గింజలు రంగు కోల్పోవడం వలన వాటి మార్కెట్ విలువ తగ్గుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
కందులు

కందులు

లక్షణాలు

వేర్లు మినహా అన్ని మొక్కల భాగాలలో, అన్ని వృద్ధి దశల్లో ఈ తెగులు లక్షణాలు కనిపించవచ్చు. ముదురు గోధుమ రంగు అంచుతో టాన్ రంగు మచ్చలు ఆకులపై కనిపిస్తాయి. తరువాత గాయాల మధ్య భాగం బూడిద రంగులోకి మారుతుంది దాని వలన సన్నటి ముదురు చుక్కలతో మచ్చలు ఏర్పడతాయి. దీనివలన ఇతర రకాల ఎండు తెగులు నుండి ఈ వ్యాధిని చెప్పడానికి వీలవుతుంది. తీవ్రమైన సంక్రమణ వలన ఆకులు ముందుగానే రాలిపోవడం మరియు ఎదిగే ప్రాంతంలో కాండం డైబ్యాక్ కు కారణమయి మొక్కలకు ఎండిపోయిన రూపాన్ని కలిగిస్తాయి. ఉపరితలంపై గోధుమ రంగు ప్యాచీలు ఏర్పడి గింజలు రంగు కోల్పోవడం ఈ వ్యాధి యొక్క మరొక లక్షణం. భారీగా తెగులు సోకిన గింజలు ఊదా-గోధుమ రంగులోకి మారి ముడుతలు పడడమే కాక గింజల పరిమాణం కూడా తగ్గవచ్చు. గింజల రంగు పాలిపోవడం వాటి నాణ్యతను మరియు మార్కెట్ విలువను తగ్గిస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఇప్పటివరకూ, ఈ వ్యాధికి వ్యతిరేకంగా జీవ చికిత్స అందుబాటులో లేదు. మీకు ఏమైనా తెలిస్తే మమ్మల్ని సంప్రదించండి

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. నాటడానికి ముందు నానబెట్టే విత్తనాల చికిత్సను ఉపయోగించవచ్చు. తెగులు సోకే రకాలను పెంచినప్పుడు ఆకులపై వాడే శిలీంద్ర నాశినులు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ తెగులు నుండి మొక్కలను రక్షించడానికి పైరాక్లోస్ట్రోబిన్ లేదా క్లోరోథలోనిల్ ను నివారణగా ఉపయోగించినప్పుడు ఇవి చాలా ప్రభావవంతంగా ఉంటాయి. పూత దశ ప్రారంభంలో పిచికారీ చేయడం వలన కాయ మరియు విత్తనాలకు సంక్రమణను నివారించడంలో సహాయపడుతుంది.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు డిడిమెల్లా ఫాబే అనే ఫంగస్ వలన సంభవిస్తాయి, ఇవి గతంలో వ్యాధి సోకిన మొక్కల అవశేషాలలో లేదా విత్తనాలలో చాలా సంవత్సరాలు జీవించి ఉంటాయి. వ్యాధి సోకిన విత్తనాల నుండి పేలవమైన పెరుగుదలతో ఉన్న వ్యాధి సోకిన మొలకలు పుట్టుకొస్తాయి. నాణ్యమైన మొక్కలపై ఉత్పత్తి చేయబడిన బీజాంశం మరియు వాటి అవశేషాలు ఐనోక్యులమ్ యొక్క ముఖ్యమైన మూలం మరియు వర్షపు తుంపర్ల ద్వారా మొక్కల దిగువ భాగానికి వ్యాప్తి చెందుతాయి. గాయాలపై గమనించిన ముదురు మచ్చలు కూడా బీజాంశాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణాలు, అంతే కాకుండా ఇవి వర్షం ద్వారా కూడా ఇతర పంటలకు వ్యాపిస్తాయి. తరచుగా వర్షపు జల్లులు, ఎక్కువ కాలం ఆకు తడిగా ఉండడం(ముఖ్యంగా వసంతకాలంలో) సంక్రమణ ప్రక్రియకు మరియు వ్యాధి వృద్ధికి అనుకూలంగా ఉంటాయి. అదను చివరిలో తడి పరిస్థితులు కాయ, గింజల సంక్రమణకు అనువైన పరిస్థితులను కల్పిస్తాయి. ఆరోగ్యంగా కనిపించే గింజలు అధిక స్థాయిలో ఫంగస్‌ను కలిగి ఉండవచ్చు.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన మొక్కల నుండి లేదా ధ్రువీకరించబడిన వనరుల నుండి సేకరించిన విత్తనాలను నాటండి.
  • వ్యాధికి ఎక్కువ నిరోధకత కలిగిన రకాలను ఎంచుకోండి.
  • దట్టమైన పందిరిని నివారించడానికి సిఫార్సు చేసిన విత్తనాల రేట్లను అనుసరించండి.
  • మొక్కల అవశేషాలు వున్న పొలాల్లో కాయధాన్యాపు పంటలను వేయకండి.
  • అధిక నష్టాన్ని నివారించడానికి సీజన్లో తరువాతి సమయాల్లో విత్తండి.
  • విత్తనంపై సంక్రమణను తగ్గించడానికి వీలైనంత త్వరగా పంటను కోయండి.తరువాతి సీజన్ పంటకు ఫంగస్ సంక్రమణను తగ్గించడానికి పంట అవశేషాలను పాతిపెట్టండి.
  • ప్రత్యామ్నాయంగా వాటిని తొలగించి నాశనం చేయండి.
  • కాయధాన్యాల పంటల మధ్య కనీసం 3 సంవత్సరాల పంట భ్రమణాన్ని ప్లాన్ చేయండి.
  • శుభ్రమైన పరికరాలు మరియు సామగ్రిని కలిగి ఉండటానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి