షుగర్ బీట్

షుగర్ బీట్ లో సెర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు

Cercospora beticola

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఎరుపు-గోధుమ రంగు అంచులతో లేత గోధుమరంగు లేదా బూడిద రంగు గుండ్రని మచ్చలు ఆకులు, కాండం మరియు ఆకు కాడలపై కనిపిస్తాయి.
  • మచ్చలు ఒక్కదానితో మరొకటి కలిసిపోతాయి, ఆకులు గోధుమ రంగులోకి మారి, వంకర్లు తిరిగి చనిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
షుగర్ బీట్

షుగర్ బీట్

లక్షణాలు

మొదట ముదురు, క్రింది ఆకులపై వ్యాధి మొదలవుతుంది మరియు తరువాత లేత ఆకులకు విస్తరిస్తుంది. లేత గోధుమరంగు లేదా బూడిద రంగు, గుండ్రని లేదా కోలాకారపు మచ్చలు (వ్యాసంలో 2-3 మిమీ) ఆకులు మరియు ఆకు కాడలపై కనిపిస్తాయి. ఈ నిర్జీవ కణజాలాల చుట్టూ ఎరుపు-గోధుమ రంగు అంచులు ఏర్పడతాయి. ఈ మచ్చలు తరచుగా ఒకదానితో మరొకటి కలిసిపోతాయి మరియు వాటి మధ్యభాగం ఎండిపోయి రాలి పడిపోవచ్చు. దీనివలన ఆకు ఈనెల మధ్యన రంధ్రాలు ఏర్పడతాయి (షాట్-హోల్ ప్రభావం). క్రమంగా ఆకులు కూడా రంగు మారుతాయి, మొదట పసుపు రంగులోకి మారుతాయి (క్లోరోసిస్) తరువాత, అవి ఎండిపోయి గోధుమ రంగులోకి మారి చనిపోతాయి. దూరం నుండి చూస్తే, ప్రభావిత మొక్కలు కాలిపోయిన రూపాన్ని కలిగి ఉంటాయి మరియు పందిరి నుండి బయటకు స్పష్టంగా కనపడొచ్చు. కాండం మరియు ఆకు కాడలపై మచ్చలు పొడవుగా ఉంటాయి మరియు తరచుగా కొద్దిగా నొక్కుకుపోయినట్టు ఉంటాయి..సుదీర్ఘమైన తడి పరిస్థితులలో, ప్రధానంగా ఆకు దిగువ భాగంలో, మరింత ఖచ్చితంగా చెప్పాలంటే మచ్చల క్రింద, ముదురు బూడిద రంగు వెల్వెట్ లాంటి శిలీంధ్రాల పెరుగుదల కనిపిస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, బాసిల్లస్ అమిలోలిక్ఫేసియన్స్, బాసిల్లస్ సబ్టిలిస్ బ్యాక్టీరియా మరియు ట్రైకోడెర్మా ఆస్పెరెల్లమ్ ఫంగస్ ఆకులపై పిచికారీ చేసే జీవ సంబంధమైన పిచికారీలు. ప్రత్యామ్నాయంగా, విత్తనాల ఉపరితలంపై వున్న శిలీంధ్రాలను తొలగించడానికి మరియు విత్తనాలు ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించడానికి వేడి నీటి చికిత్సలను ఉపయోగించవచ్చు. సేంద్రీయ వ్యవసాయంలో నియంత్రణ కోసం రాగి ఆధారిత ఉత్పత్తులు (కాపర్ ఆక్సిక్లోరైడ్) కూడా ఆమోదించబడ్డాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. వ్యాధికారక క్రిములను నియంత్రించడానికి ట్రైజోల్ శిలీంద్ర నాశినులు ( డైఫెనోకోనజోల్, ప్రొపికోనజోల్, సైప్రోకోనజోల్, టెట్రాకోనజోల్, ఎపోక్సికోనజోల్, ఫ్లూట్రియాఫోల్ మొదలైనవి) లేదా బెంజిమిడాజోల్‌లను వాడండి.

దీనికి కారణమేమిటి?

ఈ వ్యాధి సెర్కోస్పోరా బెటికోలా అనే ఫంగస్ వల్ల వస్తుంది, ఇది నేల ఉపరితలంపై లేదా పై మట్టి పొరలో మొక్కల అవశేషాలపై మనుగడ సాగిస్తుంది. బీట్స్ లో ఇన్ఫెక్షన్‌కు మూలంగా కనిపించే కలుపు మొక్కలు (మూళ్ళ తోట కూర, బత్తువ, తిస్టిల్) వంటి ప్రత్యామ్నాయ అతిధేయ మొక్కలపై కూడా ఇది శీతాకాలంలో మనుగడ సాగించగలదు. ఫంగస్ వృద్ధికి సరైన పరిస్థితులు అధిక తేమ (95-100 %), తరచుగా మంచు మరియు వెచ్చని వాతావరణం. నత్రజని ఎరువులు అధికంగా వాడటం వలన వ్యాధి సంక్రమించే అవకాశాలు పెరుగుతాయి. ఈ వ్యాధి పొలం అంతటా ఒకే విధంగా వ్యాపించదు, తేమ అధిక స్థాయిలో ఉండడం వలన, సాధారణంగా రక్షిత ప్రాంతాలలో మరింత తీవ్రంగా ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా స్వీట్ బీట్ యొక్క అత్యంత విధ్వంసక ఆకుల వ్యాధికారకం. చిన్న పరిమాణంలో ఉండే మచ్చలు మరియు గాయాల మధ్యలో నల్లని మచ్చలు వంటి లక్షణాల వలన ఇతర ఆకు వ్యాధుల (ఆల్టర్నేరియా, ఫోమా మరియు బాక్టీరియా ఆకు మచ్చ తెగులు)తో పోలిస్తే సెర్కోస్పోరా ఇన్ఫెక్షన్లు వేరుగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడిన, వ్యాధి రహిత విత్తనాలను ఉపయోగించండి.
  • అందుబాటులో ఉంటే వ్యాధి నిరోధక రకాలను నాటండి.
  • మట్టిలో ఆమ్లతత్వం ఎక్కువగా ఉంటే, దాని పిహెచ్ ను పెంచడానికి సున్నం ఉపయోగించండి.
  • స్ప్రింకర్లను ఉపయోగించి నీరు పెట్టకండి, ఎందుకంటే ఇలా నీరు పెట్టడం వలన ఆకు ఎక్కువకాలం తడిగా ఉంటుంది.
  • దీని బదులు బిందు సేద్యాన్ని ఉపయోగించండి.
  • మధ్యాహ్నం నీరు పెట్టండి.
  • దీనివలన ఆకులు పూర్తిగా పొడిగా మారతాయి.
  • భాస్వరం, మాంగనీస్ మరియు బోరాన్ ఎరువులతో కూడిన సమతుల్య ఎరువులను వాడండి.
  • పొలం నుండి కలుపు మొక్కలను తొలగించండి.
  • మొక్కల అవశేషాలను తొలగించి వాటిని లోతుగా పూడ్చివేయడం లేదా కాల్చడం ద్వారా నాశనం చేయండి.
  • పొలంలో మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఉండేలా ఒకే గాడి నాగలితో లోతుగా దున్నండి.
  • మట్టి పైపొరను తొలగించడానికి మరియు మట్టిలో గాలి ప్రసరణను మెరుగుపరచడానికి పంట కోతల తర్వాత పొలాన్ని దున్నండి.
  • 2-3 సంవత్సరాలకు పంట మార్పిడిని ప్లాన్ చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి