టమాటో

టమాటా లో ఆకు బూజు తెగులు

Mycovellosiella fulva

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకు పైభాగాన పాలిపోయిన పచ్చ లేదా పసుపురంగు మచ్చలు విస్తారంగా వుంటాయి.
  • ఆకు అడుగు భాగాన ఆలివ్ గ్రీన్ నుండి బూడిద-ఊదారంగు మచ్చలు కనబడుతాయి.
  • ఆకులు ఎండిపోయి చుట్టుకుపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

టమాటో

లక్షణాలు

సాధారణంగా ఈ తెగులు లక్షణాలు ఆకు రెండు వైపుల మరియు కొన్నిసార్లు పండ్లపైన కనపడతాయి. మొదట ముదురు ఆకులు ఈ తెగులు బారిన పడతాయి, ఆ తరవాత లేత ఆకులకు ఈ తెగులు సోకుతుంది. పై ఆకు ఉపరితలంపై నిరవధిక అంచులు గల చిన్న, లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. క్రింది భాగంలో ఆలివ్ గ్రీన్ నుండి బూడిద-ఊదారంగు మరియు వెల్వెట్ లాంటి అతుకులు ఆకుమచ్చల కింది భాగంలో ఏర్పడుతాయి. ఇవి బీజ ఉత్పాదక నిర్మాణాలను మరియు బీజ పదార్థాలను (కొనిడియా) కలిగి ఉంటాయి. కాలక్రమేణా, మచ్చలు పెరిగే కొద్దీ, ఇన్ఫెక్షన్ సోకిన ఆకుల రంగు పసుపు (పాలిపోవడం) నుండి గోధుమ రంగుకు(నిర్జీవంగా మారడం) మారుతుంది మరియు ఆకు చుట్టుకుపోవడం మరియు ఎండిపోవడం ప్రారంభమవుతుంది. ఆకులు ముందుగానే రాలిపోయి, ఈ తెగులు తీవ్రంగా వున్నప్పుడు ఆకులు మొత్తం రాలిపోతాయి.రాలిపోతాయి. అప్పుడప్పుడు, ఈ పురుగులు వివిధ రకాల లక్షణాలతో మొగ్గలు మరియు పండ్లపై చీడను కలిగిస్తుంది. మొగ్గలు నల్లగా మారి పండు ఏర్పడడానికి ముందే చనిపోతాయి. పచ్చని మరియు పండిన పండ్ల కాడ చివర మృదువైన నల్లని క్రమరహిత మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ముదిరే కొద్దీ తెగులు సోకిన ప్రాంతం కుంచించుకుపోయి, ఎండిపోయి, తోలులాగా మారిపోతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

విత్తనాలకు తెగులు సోకకుండా వేడి నీటితో (122°F లేదా 50 °C వద్ద 25 నిముషాలు) విత్తన శుద్ధి చేయాలి. ఎక్రేమోనియం స్ట్రిక్టమ్, డికైమ పల్వినాట, ట్రైకోడెర్మా హర్జియనం లేదా టి. విరిడే మరియు ట్రైకోతేసియమ్ రోసుం అనే శిలీంధ్రాలు ఎం. ఫల్వాకు విరుద్ధంగా పని చేస్తాయి మరియు దాని వ్యాప్తిని తగ్గిస్తాయి. గ్రీన్ హౌస్ ప్రయోగాలలో టమాటో మీద ఎం. ఫల్వ యొక్క వృద్ధి ఎ. స్ట్రిక్టమ్, ట్రైఖోడెర్మా వైరైడ్ స్ట్రెయిన్ 3 మరియు టి.రోజియం లచే వరుసగా 53, 66 మరియు 84% వరకు నియంత్రించబడింది. ఈ తెగులుకు చికిత్స చేయడానికి చిన్న మొత్తాలలో ఆపిల్ సిడార్, వెల్లులి లేదా పాల పిచికారీ మరియు వినెగర్ మిశ్రమాలను వాడవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు వృద్ధిచెందడానికి పర్యావరణ పరిస్థితులు అనుకూలంగా వున్నప్పుడు, ఇన్ఫెక్షన్ సోకకముందే మందులు వాడాలి. పొలంలో వాడడానికి సిఫారసు చేయబడిన మిశ్రమాలు క్లోరోతలోనొల్, మనేబ్, మాంకోజెబ్ మరియు రాగి సమ్మేళనాలు. గ్రీన్ హౌస్ కొరకు డైఫెనోకోనజోల్, మండిప్రొపమిడ్, సిమోక్సానిల్, ఫామోక్సాడోన్ మరియు సిప్రోడినిల్ సిఫారసు చేయబడ్డాయి.

దీనికి కారణమేమిటి?

మైకోవెల్లోసియాల్లా ఫుల్వ అనే ఫంగస్ వలన ఈ లక్షణాలు ఏర్పడతాయి. దీని బీజాంశాలు గది ఉష్ణోగ్రత వద్ద 6 నెలల నుండి ఒక సంవత్సరం వరకు అతిధి మొక్కలు లేకుండా జీవించి ఉంటాయి. దీర్ఘకాలం పాటు ఆకులు తేమగా వుండటం మరియు 85% కంటే ఎక్కువ తేమ దీని బీజంశాల అంకురోత్పత్తికి అనుకూలమైనవి. బీజాంశాలు అంకురించడానికి ఉష్ణోగ్రత 4 నుండి 34°C మధ్య ఉండాలి, కాగా ఉత్తమమైన ఉష్ణోగ్రత 24-26°C వద్ద ఉండాలి. పొడి పరిస్థితులు మరియు ఆకుల మీద నీరు లేకపోవడం అనేవి అంకురోత్పత్తిని అడ్డుకుంటాయి. సాధారణంగా ఈ సూక్ష్మ జీవ కణాలు సంక్రమించిన 10 రోజుల తర్వాత ఆకు అంచు రెండు వైపులా మచ్చలు అభివృద్ధి కావడం ద్వారా దీని లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. క్రింది వైపున, బీజ ఉత్పత్తి నిర్మాణాలు పెద్ద సంఖ్యలో ఏర్పడతాయి మరియు ఈ బీజాలు గాలి మరియు నీటి బిందువుల ద్వారా ఒక మొక్క నుండి మరొక మొక్కకు సులభంగా వ్యాపిస్తాయి, అయితే అవి పనిముట్లు, పనివారి దుస్తులు మరియు కీటకాల మీద కూడా వ్యాపిస్తాయి. ఇది సాధారణంగా అధిక తేమ స్థాయిలో పత్రరంధ్రాల ద్వారా చొచ్చుకుపోవడం ద్వారా ఆకులకు తెగులును వ్యాపింపచేస్తుంది.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడ్డ, తెగులు రహిత విత్తనాలను వాడండి.
  • మొక్కలను తెగులు తీవ్రత నుండి తగ్గించుటకు అదనులో త్వరగా నాటండి.
  • తోటలో బాగా గాలి సోకుటకు మరియు గాలిలో తేమను తగ్గించుటకు మొక్కల మధ్య తగిన దూరాన్ని పాటించండి.
  • మీ ప్రాంతంలో అందుబాటులో వుంటే నిరోధక లేదా ఈ తెగులును తట్టుకొనే సామర్థ్యం కలిగిన మొక్కల రకాలను నాటండి.
  • తెగులు లక్షణాల కొరకు పొలాన్ని పరిశీలించి గుర్తించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను తొలగించండి.
  • అధిక మోతాదులో నత్రజని ఎరువులను వాడవద్దు.
  • పంట పొలంలో గాలి బాగా సోకునట్లు చేయండి.
  • గాలిలో తేమ 85% లోపు ఉండునట్లు మరియు రాత్రి ఉష్ణోగ్రతలు బయటికంటే అధికంగా ఉండునట్లు చూడండి (గ్రీన్ హౌస్ కు తగిన విధంగా).
  • డ్రిప్ ఇరిగేషన్ ను వాడండి మరియు ఆకులకు అధికంగా నీటిని పెట్టడం నివారించండి.
  • మొక్కలను నిటారుగా వుంచి మొక్క చుట్టూ గాలి బాగా సోకుటకు కర్రలు, తీగలను పాతండి లేదా మొక్కను కత్తిరించండి.
  • పంట కోత తరవాత మొక్కల వ్యర్థాలను తీసివేయండి లేదా కాల్చి వేయండి.
  • పంటల మధ్య పంట పొలాన్ని శుద్ధి చేయండి.
  • పనిముట్లు మరియు పనివారి విషయంలో విస్తృత పారిశుధ్య ప్రమాణాలను పాటించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి