నిమ్మజాతి

ఆకు పచ్చ మరియు నీలి బూజు

Penicillium spp.

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • తేలికైన నీటిలో తడిచినట్టు వుండే ప్రదేశం పండ్ల పైతొక్క పైన ఏర్పడి తరువాత తెల్లని బూజు వృద్ధి చెందుతుంది.
  • ఈ బూజులో నీలం లేదా ఆకుపచ్చ ఎదుగుదల దీనికి ఈ స్వభావాన్ని కలగచేస్తాయి.
  • ఇవి తరువాత వ్యాప్తి చెంది మొత్తానికి పండ్లు కుళ్ళి రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

ముందుగా తేలికపాటి నీటిలో తడిచినట్టు వున్న ప్రాంతం పండు పైతొక్కపైన వృద్ధి చెందుతుంది. కొని రోజుల తర్వాత వృత్తాకార మచ్చ పైన ఒక గుండ్రటి తెల్లని బూజు ఏర్పడుతుంది. దీని చుట్టు కొలత కొన్ని సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇది మెల్లగా పైభాగంపై విస్తరిస్తుంది. దీని మధ్య భాగం నీలి రంగు లేదా పచ్చ రంగు లోకి మారుతుంది. చుట్టు ప్రక్కల కణజాలం మృదువుగా మారి నీటిలో తడిచినట్టుగా ఉంటుంది. లేదా తెల్లని వెడల్పాటి మైసీలియం పట్టీ ఏర్పడుతుంది. పండు చాలా త్వరగా పాడై రాలిపోతుంది. లేదా తక్కువ తేమ వున్నప్పుడు కుచించుకపోయి మమ్మిఫై అవుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ ఫంగస్ జీవ నియంత్రణకు స్యుడోమోనాస్ సిరెంగే స్ట్రైన్ ESC-10 ను ఉపయోగించవచ్చు. అగేరటుమ్ కొంజ్యోయిడెస్ యొక్క సారం ఈ బూజుకు వ్యతిరేకంగా ప్రభావం చూపిస్తుంది. తెముస్ కాపిటటూస్ మూలిక యొక్క ఎస్సెన్షియల్ ఆయిల్ మరియు వేప నూనె కూడా ఇదే విధంగా పనిచేస్తాయి. టీ సపోనిన్ కూడా ఒక సురక్షితమైన సమ్మేళనం మరియు దీనిని పంట కోతల తర్వాత పండ్లు కుళ్ళిపోకుండా నియంత్రించడానికి ఉపయోగించవచ్చు. .

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కోసిన పండ్లను 40-50°C ఉష్ణోగ్రత వద్ద డిటర్జెంట్స్ లేదా బలహీనమైన క్షార ద్రావణంతో ( సాధారణంగా కొన్ని శిలీంద్ర నాశినులు) శుభ్రం చేయడం వలన పండ్లు కుళ్లిపోకుండా ఉంటాయి. ఇమజలీల్, థైబెండాజోల్ మరియు బైఫినైల్ వంటి శిలీంద్ర నాశినులు సిఫార్స్ చేయబడ్డాయి.

దీనికి కారణమేమిటి?

నిమ్మ జాతి పండ్లపైన ఈ విధ్వంసకరమైన కుళ్ళును పెన్నిసిల్లీయం యొక్క రెండు జాతుల ఫంగస్ కలుగచేస్తాయి. P. ఇటాలికమ్ మరియు P. డిజిటటుమ్ అనే ఫంగస్ పండ్ల పైతొక్కపైన నీలి రంగు మరియు ఆకుపచ్చ రంగులో ఏర్పడతాయి. P. డిజిటటుమ్ తో పోలిస్తే P. ఇటాలికమ్ వలన ఏర్పడిన మచ్చలు మెల్లగా విస్తరిస్తాయి. వీటి చుట్టూ ఒక తెల్లని మైసీలియం పట్టీ ఏర్పడుడం ద్వారా కూడా వాటి వ్యాప్తి లక్షణంగా చెప్పవచ్చు. ఈ ఫంగి పండ్లపైన వున్న గాయాలను ఆసరాగా చేసుకుని వీటి జీవిత చక్రాన్ని ప్రారంభిస్తాయి. దెబ్బతిన్న ప్రాంతం నుండి నీరు మరియు పోషకాలు విడుదల అయినప్పుడు వీటి బీజాంశాలు మొలకెత్తుతాయి. 24 °C ఉష్ణోగ్రతల వద్ద 48 గంటలలో ఈ ఇది సంక్రమించిన తరవాత మొదటి లక్షణాలు 3 రోజులలో బహిర్గతమౌతాయి. యాంత్రికంగా కానీ, నీరు లేదా గాలి ద్వారా కానీ ఈ బీజాంశాలు విస్తరిస్తాయి. సాధారణంగా ఇవి మట్టిలో ఉంటాయి కానీ కలుషితమైన నిల్వ ప్రాంతాలలో వున్న గాలిలో కూడా ఉంటాయి.


నివారణా చర్యలు

  • పంటకు తక్కువగా నష్టం కలిగే విధంగా జాగ్రత్తలు తీసుకోండి.
  • తెగులు సోకిన పండ్లను తోటల నుండి తొలగించండి.
  • ఇలా తొలగించిన పండ్లను ప్యాకింగ్ చేసే ప్రాంతం నుండి దూరంగా ఉంచండి.
  • పండ్లను నిలువ ఉంచే సమయంలో ఎటువంటి తెగుళ్లు రాకుండా ఉండడానికి చల్లని వాతావరణంలో నిలువ ఉంచండి.
  • బాగా అధిక తేమ తక్కువ ఉష్ణోగ్రత వున్న పరిస్థితులలో పండ్లను నిలువ చేయండి.
  • ప్యాకింగ్ మరియు నిలువ సౌకర్యాలు వున్న ప్రదేశంలో వాడే పరికరాలను డిస్ఇన్ఫెక్ట్రన్ట్ వాడి శుద్ధి చేయండి.
  • వర్షం పడుతున్నప్పుడు మరియు వర్షం పడిన తర్వాత పంట కోతలు చేయవద్దు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి