కందులు

కాయధాన్యపు పంటలో స్టెంఫీలియం ఎండు తెగులు

Pleospora herbarum

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులపై చిన్న, తేలికపాటి లేత గోధుమరంగు మచ్చలు ఒకదానితో మరొకటి కలిసిపోయి మొత్తం కొమ్మలను కప్పేస్తాయి.
  • అధిక సాపేక్ష ఆర్ద్రత వద్ద తెగులు సోకిన ఆకులు బూడిదరంగు నుండి నలుపు రంగులోకి మారతాయి.
  • కొన్ని రోజుల్లోనే ఆకులన్నీ రాలిపోవచ్చు.
  • దూరం నుండి చూస్తే పొలంలో ఒక పద్దతిలో లేని గోధుమ రంగు ప్యాచీలను గమనించవచ్చు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
కందులు

కందులు

లక్షణాలు

మొదట్లో స్టెంఫిలియం ఎండు తెగులు ఆకులపై చిన్న, తేలికపాటి లేత గోధుమరంగు మచ్చలుగా కనిపిస్తుంది. ఈ లక్షణాలు బొట్రిటిస్ ఎండు తెగులును పోలి ఉంటాయి. చివరికి, ఈ మచ్చలు పెద్ద, సక్రమంగా లేని ఆకారంలో ఉండే గాయాలను ఏర్పరుస్తాయి. ఇవి మొత్తం కొమ్మలను చుట్టుముట్టగలవు. పాలిపోయిన టాన్ రంగు ఆకులు ముఖ్యంగా పందిరి పైభాగంలో స్పష్టంగా కనిపిస్తాయి. ప్రారంభంలో, కాండం ఆకుపచ్చగా ఉంటుంది, కానీ వ్యాధి మరింత పెరిగేకొద్దీ, అవి చివరికి టాన్, తరువాత గోధుమ రంగులోకి మారుతాయి. అధిక సాపేక్ష ఆర్ద్రత వద్ద తెగులు సోకిన ఆకులు బూడిదరంగు నుండి నలుపు రంగులోకి మారతాయి. ఇవి నేలమీద పడటంతో, భవిష్యత్తులో అంటువ్యాధులకు ఇవి కొత్త ఐనోక్యులమ్‌ను అందిస్తాయి. కొన్ని రోజుల్లోనే ఆకులన్నీ రాలిపో యి చివరి ఆకులు మాత్రమే మిగలవచ్చు. దూరం నుండి చూస్తే పొలంలో ఒక పద్దతిలో లేని గోధుమ రంగు ప్యాచీలను గమనించవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

స్టెమ్ఫిలియం ఆకు ఎండు తెగులు జీవ నియంత్రణ కోసం సాంప్రదాయ శిలీంద్ర సంహారిణికి దగ్గరగా ఉన్న సమర్థతతో అజాడిక ఇండికా (వేప) మరియు డాతురా స్ట్రామోనియం (జిమ్సన్‌వీడ్) యొక్క సారాన్ని ఉపయోగించవచ్చు. గ్రీన్ హౌస్ పరిస్థితులలో, ట్రైకోడెర్మా హర్జియానమ్ మరియు స్టాచీబోట్రిస్ చార్టారమ్ ఆధారిత ఉత్పత్తులను నివారణ లేదా నియంత్రణకు వాడడం వలన వ్యాధి సంభవం మరియు తీవ్రత తగ్గుతుంది (రెండు సందర్భాల్లోనూ 70% వరకు).

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. స్టెంఫిలియం ఎండు తెగులుకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉండటానికి, పెరుగుతున్న సీజన్ చివరి మూడవ భాగంలో శిలీంద్ర నాశినులను వాడాలి. అంత కన్నా ముందుగా వీటిని వాడడం వలన ప్రభావం ఉండదు. క్రియాశీల పదార్ధాల ద్రావణం అజోక్సిస్ట్రోబిన్ + డైఫెనోకొనజోల్, బోస్కాలిడ్ + పైరాక్లోస్ట్రోబిన్, క్లోరోథలోనిల్, ఐప్రోడియోన్, మాంకోజెబ్ మరియు ప్రోక్లోరాజ్ బాగా పనిచేస్తాయి. ఫంగస్ (చల్లని మరియు పొడి వాతావరణం) కు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు చికిత్సలు చేయాలి. సాధారణంగా, ఈ ఉత్పత్తులను ఒకదాని తర్వాత మరోకటి వాడడం వలన శిలీంద్ర నాశినుల ప్రభావం మెరుగుపడింది.

దీనికి కారణమేమిటి?

కాయధాన్యం యొక్క స్టెంఫిలియం ఎండు తెగులు ప్లియొస్పోరా హెర్బరం అనే ఫంగస్ వలన వస్తుంది, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. దీనిని గతంలో స్టెంఫిలియం హెర్బరం అని పిలిచేవారు. అందుకే ఈ తెగులుకు ఈ పేరు వచ్చింది. విత్తనాలు లేదా తెగులు సోకి చనిపోయిన మొక్కల అవశేషాలపై ఇది మనుగడ సాగిస్తుందని భావించబడుతుంది. ఈ ఫంగస్ కాయధాన్యం మొక్కలకు మాత్రమే కాకుండా అనేక రకాల ఇతర వెడల్పు ఆకులు కల మొక్కలకు కూడా సంక్రమించవచ్చు. ఈ తెగులు వృద్ధి చెందడానికి సీజన్ చివర్లో ఎక్కువ కాలం ఆకు తడిగా ఉండడం అవసరం. లక్షణాల సంభవం మరియు తీవ్రత కూడా ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది. 22-30°C ఉష్ణోగ్రతలు దీనికి అనుకూలం. ఈ పరిస్థితులలో, సంక్రమణను ప్రేరేపించడానికి 8 నుండి 12 గంటల ఆకు తేమ సరిపోతుంది. పూర్తిగా అనుకూలంగా లేని పరిస్థితులలో, ఉదాహరణకు 15 నుండి 20°C వరకు గాలి ఉష్ణోగ్రతలు, తేమ కాలం యొక్క పొడవు గణనీయంగా పెరగవచ్చు. (24 గంటలు లేదా అంతకంటే ఎక్కువ). ముఖ్యంగా నత్రజని ఒత్తిడికి గురైనప్పుడు లేత మొక్కల కంటే ముదురు మొక్కలు ఈ వ్యాధికి లోనయ్యే అవకాశం అధికంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • వీలైతే ధ్రువీకరించబడిన మూలాల నుండి శుభ్రమైన విత్తనాలను ఎంచుకోండి.
  • తెగులు నిరోధక రకాలను ఎంచుకోండి (చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి). మొక్కల సాంద్రత తక్కువగా వున్నట్లైతే మంచి గాలి ప్రసరణ ఉంటుంది.
  • నాటడానికి ముందు మంచి డ్రైనేజి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోండి.
  • వ్యాధి తీవ్రతను పెంచే అధిక నత్రజని వాడకాన్ని నివారించండి.
  • పంట కోత తర్వాత మొక్కల అవశేషాలను దున్నడం ద్వారా తొలగించి పాతిపెట్టండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి