వేరుశనగ

పండు బూజు

Aspergillus spp.

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • పండ్ల పైతొక్క రంగు మారుతుంది.
  • పైపొర లేత గోధుమరంగు, పసుపు లేదా గోధుమ రంగులోకి మారతాయి.
  • పండ్లు కుళ్లిపోతాయి.

లో కూడా చూడవచ్చు

8 పంటలు
వెల్లుల్లి
మొక్కజొన్న
మామిడి
ఉల్లిపాయ
మరిన్ని

వేరుశనగ

లక్షణాలు

పండు పరిపక్వత చెందే సమయంలో తేమతో కూడిన పరిస్థితులు ఉంటే, అనేక శిలీంధ్రాలు పిస్తాపప్పు పండ్లను ఆవాసంగా చేసుకుని వాటిని క్షీణింప చేస్తాయి. ఇది ప్రధానంగా పైన షెల్ రంగు పాలిపోవటం మరియు కొన్ని సందర్భాల్లో వాసన లేని మరియు రంగులేని అఫ్లాటాక్సిన్ల ఉత్పత్తి జరగడం ద్వారా సూచించబడుతుంది. ఇవి ఎంత అధికంగా వాటిని ఆవాసంగా చేసుకుంటాయో దాని మీద ఆధారపడి లేదా ఫంగస్ రకాన్ని బట్టి, రంగు పాలిపోవడం మరియు ఎక్కువ లేదా తక్కువ కుళ్లిపోవడం జరుగుతుంది. సాధారణంగా, పొట్టు లేత గోధుమరంగు పసుపు లేదా గోధుమ రంగులోకి మారుతుంది. పొట్టు క్రింద, గుండ్లు మీద శిలీంధ్ర పెరుగుదల సంకేతాలు కనిపిస్తాయి, అవి మరక కావచ్చు. పై పొట్టు తరచుగా షెల్ కు అంటుకుని ఉంటాయి. పై పెంకు విడిపోయిన పండ్లు మరియు కీటకాలచే దాడి చేయబడినవి ముఖ్యంగా ప్రభావితమవుతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులుకు మంచి ప్రభావవంతమైన జీవ చికిత్సలు లేవు. ఏదేమైనా, అనుకూలమైన వాతావరణ పరిస్థితులలో రాగి ఆధారిత జీవ శిలీంద్రనాశకాలు ఆమోదయోగ్యమైన సామర్థ్యాన్ని చూపించాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పురుగుమందులతో మెగాస్టిగ్మస్ పిస్తాసియా మరియు యూరిటోమా ప్లాట్నికోవిని నియంత్రించడానికి చర్యలు తీసుకోండి. తెగులు సోకిన చెట్లకు నివారణగా క్లోరోతలోనిల్ (200 ఎంఎల్ / 100 ఎల్) లేదా రాగి ఆధారంగా ఉత్పత్తులతో చికిత్స చేయండి. పంట చివరి దశలో వాడే పందుల ప్రభావం అధికంగా ఉంటుంది, ఎందుకంటే అవి పండ్లపై తెగులు జీవించి ఉండకుండా చేస్తుంది. చికిత్సల యొక్క సమర్థత మందులు వాడిన సమయం, సిఫార్సు చేసిన మోతాదుల వాడకం మరియు అటోమైజర్ యొక్క వేగం మీద ఆధారపడి ఉంటుంది.

దీనికి కారణమేమిటి?

పిస్తాలో పండు కుళ్ళు తెగులు ఆస్పెర్‌గిల్లస్ యొక్క అనేక జాతుల వలన సంక్రమిస్తుంది. అంతే కాకుండా కానీ కొన్ని జాతుల పెన్సిలియం, స్టెంఫిలియం లేదా ఫ్యూసేరియం కూడా ఈ తెగులు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి తరచుగా కీటకాల చీడలతో సంబంధం కలిగి ఉంటుంది, ముఖ్యంగా పిస్తా విత్తనం చాల్సిడ్ (మెగాస్టిగ్మస్ పిస్తాసియా) మరియు పిస్తా విత్తనం కందిరీగ (యూరిటోమా ప్లాట్నికోవి). ఇవి సృష్టించిన రంధ్రాలు శిలీంధ్రాల ప్రవేశాన్ని సులభతరం చేస్తాయి. పక్వత చెందే కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, తడి మ రియు తేమతో కూడిన పరిస్థితులు ఈ తెగులుకు అనుకూలంగా ఉంటాయి, అయినప్పటికీ సాధారణ పరిస్థితుల కంటే పొడిగా వున్న వాతావరణంలోనూ అస్పెర్‌గిల్లస్ ఎస్.పి.పి. సంక్రమించవచ్చు. చీకటి మరియు గాలి ప్రసరణ లేకపోవడం కూడా దీని వ్యాప్తికి కారణమవుతాయి. వసంత ఋతువు చివరిలో మరియు వేసవి ప్రారంభంలో వుండే నీటి కొరత పై షెల్ విడిపోయిన పండ్ల సంఖ్యను పెంచుతుంది మరియు తద్వారా తెగులు జీవిత చక్రానికి అనుకూలంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • పిస్టాసియా అట్లాంటికా పైన అంటు కట్టకండి.
  • ఎందుకంటే ఇది పైతొక్క ముందుగా విడిపోయే పండ్ల సంఖ్యను అధికం చేస్తుంది.
  • మొక్కలకు సరైన విధంగా నీరు పెట్టండి, ఎందుకంటే వసంత ఋతువు చివరిలో మరియు వేసవి ప్రారంభంలో పైతొక్క విడిపోయే పండ్ల సంఖ్యను పెంచుతుంది.
  • చీకటిగా మరియు గాలి ప్రసరణ తక్కువగా వుండే ప్రదేశాలలో పిస్తా పప్పులను ఎక్కువసేపు నిల్వ చేయకండి.
  • మెగాస్టిగ్మస్ పిస్తాసియా (పిస్తాపప్పు సీడ్ చాల్సిడ్) మరియు యూరిటోమా ప్లాట్నికోవి (పిస్తా విత్తనం కందిరీగ) యొక్క దాడులను నివారించండి.
  • సీజన్లో ఆలస్యంగా కోయకండి.
  • వాతావరణం తేమగా మరియు తడిగా ఉన్నప్పుడు కోయవద్దు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి