బెండ

బెండలో సెర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు

Cercospora malayensis

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకుల దిగువ భాగంలో క్రమరహిత గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి.
  • ఆకులు ఎండిపోవడం మరియు వాలిపోవడం జరుగుతుంది.
  • ఆకులు రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

బెండ

లక్షణాలు

ప్రారంభంలో ఆకుల దిగువ భాగంలో గోధుమ రంగు క్రమరహిత మచ్చలు కనిపిస్తాయి. మట్టికి దగ్గరగా ఉండే పాత ఆకులు ఎక్కువగా తెగులు బారిన పడతాయి. తెగులు పెరిగేకొద్దీ ఆకులు ఎండిపోయి గోధుమరంగులోకి మారుతాయి మరియు చుట్టుకుపోయి చివరికి పడిపోవచ్చు. తెగులు తీవ్రత అధికంగా ఉంటే మొక్క ఆకులు మొత్తం రాలిపోవచ్చు. ప్రారంభంలో, ఆలివాసియస్ పొక్కుల రూపంలో అస్పష్టమైన మచ్చలుగా ఆకుల దిగువ ఉపరితలంపై వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. తరువాత, ఫంగస్ యొక్క లేత గోధుమ నుండి బూడిద అచ్చు పెరుగుదల మొత్తం దిగువ ఉపరితలాన్ని కవర్ చేస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో, ఆకుల ఎగువ ఉపరితలంపై నిర్జీవమైన మచ్చలు కూడా కనిపిస్తాయి. ఈ వ్యాధి దిగువ ఆకుల నుండి పైకి విస్తరిస్తురించడమే కాక కాండం, పండ్లకు సోకుతుంది మరియు ఒకే రకమైన లక్షణాలను కలిగిస్తుంది. ఈ లక్షణాలు పి. అబెల్మోస్చి లక్షణాలుగా ఒకేవిధంగా ఉండి గందరగోళం కలిగిస్తాయి. ఇది నల్లటి కోణాకారపు మచ్చలను ఏర్పరుస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ రోజు వరకు, ఈ వ్యాధికి వ్యతిరేకంగా జీవ నియంత్రణ విధానం గురించి మాకు తెలియదు. ఈ తెగులు సంక్రమించకుండా నియంత్రించడం లేదా దీని లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ఏదైనా విజయవంతమైన పద్ధతి మీకు తెలిస్తే దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. శిలీంద్ర నాశినులను ఆకుల దిగువ భాగంలో మధ్యాహ్నం సమయంలో పిచికారీ చేయాలి. రక్షిత శిలీంద్ర నాశినులను కాపర్ ఆక్సిక్లోరైడ్ @ 0.3%, మాంకోజెబ్ @ 0.25% లేదా జినెబ్ @ 0.2% విత్తిన తర్వాత నెల రోజులకు వాడండి మరియు తీవ్రతను బట్టి పక్షం రోజుల వ్యవధిలో తిరిగి వాడండి.

దీనికి కారణమేమిటి?

సెర్కోస్పోరా మలేయెన్సిస్ మరియు సెర్కోస్పోరా అబెల్మోస్చి అనే ఫంగస్ వల్ల ఆకు మచ్చలు ఏర్పడతాయి. శీతాకాలంలో ఇది మట్టిలో తెగులు సోకిన మొక్కల ఆకాశేషాలపై మనుగడ సాగిస్తుంది అలాగే బెండ మొక్కల వేర్లు మరియు క్రింది ఆకులకు సంక్రమిస్తుంది. బీజాంశం రెండవసారి గాలి, వర్షం, నీటిపారుదల మరియు యాంత్రిక పరికరాల ద్వారా వ్యాపిస్తుంది. తేమతో కూడిన కాలంలో ఆకు మచ్చలు చాలా సాధారణం, ఎందుకంటే వెచ్చని మరియు తడి వాతావరణం శిలీంధ్రాలకు అనుకూలంగా ఉంటాయి. వర్షపాతం మరియు అధిక తేమ సంక్రమణ, వ్యాధి వృద్ధి మరియు ఆకులపై వ్యాధికారకాల స్పోర్యులేషన్‌కు అనుకూలంగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • ధ్రువీకరించబడిన విత్తన పదార్థాన్ని మాత్రమే వాడండి మరియు మీ పంటలను తగినంత అంతరంతో నాటండి, దీనివలన ఆకులు పొడిగా ఉంటాయి.
  • మీ పొలాన్ని క్రమం తప్పకుండా గమనించండి అలాగే తెగులు సోకిన ఆకులను తొలగించండి (వాటిని కాల్చడం కూడా ఒక ఎంపిక).
  • మంచి కలుపు నిర్వహణ సిఫార్స్ చేయబడింది.
  • తగినంత నీరు మరియు ఎరువులతో మొక్కల ఒత్తిడిని నివారించండి.
  • సాయంత్రం కాకుండా ఉదయం సమయాల్లో నీరు పెట్టడమే కాక ఓవర్ హెడ్ ఇరిగేషన్ మరియు సరిగా నీరు పారని నేలలను నివారించండి.
  • అతిధి పంటలతో పంట మార్పిడిని పరిగణలోకి తీసుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి