చెరుకు

చెరుకులో ఆకు మాడు తెగులు

Stagonospora sacchari

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు అస్వభావికమైన బాగా చిన్న పరిమాణంలో వున్న పసుపు రంగు వలయంతో, ముదురు ఎరుపు రంగు చుక్కల మచ్చలను కలిగివుంటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

చెరుకు

లక్షణాలు

ప్రారంభ లక్షణాలు ఆకు ఈనెల మధ్య తెలుపు నుండి పసుపు రంగు చిన్న చుక్కలు ఏర్పడతాయి మరియు ఇవి సాధారణంగా ఐనోక్యులేషన్ వేసిన 3 మరియు 8 రోజుల మధ్య సంభవిస్తాయి. లేత ఆకులపై ఎరుపు లేదా ఎర్రటి-గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి మరియు క్రమంగా పొడవుగా మారి స్పష్టమైన పసుపు వలయంతో కుదురు ఆకారంలో ఉంటాయి. వ్యాధి తీవ్రత అధికంగా వున్నప్పుడు,ఈ మచ్చలు కలిసిపోయి, నాళాల కట్టల వెంట ఆకు కొనలకు విస్తరించి, కుదురు ఆకారపు చారలను ఏర్పరుస్తాయి. మొదట ఈ గాయాలు ఎర్రటి-గోధుమ రంగులో ఉంటాయి, తరువాత ఇవి ఎరుపు అంచులతో గడ్డి రంగులోకి మారతాయి, చనిపోయిన ఆకు కణజాలంలో చిన్న, నల్లని పైక్నిడియా కూడా ఉత్పత్తి అవుతుంది. తీవ్రంగా తెగులు సోకిన ఆకులు ఎండిపోయి అకాలంగా రాలిపోతాయి. సంక్రమణ, కొమ్మ ఎత్తు, వ్యాసం మరియు కణుపుల సంఖ్యను, అలాగే ఆకుపచ్చ ఆకుల సంఖ్యను తగ్గిస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ రోజు వరకు, ఈ వ్యాధికి వ్యతిరేకంగా జీవ నియంత్రణ విధానం గురించి మాకు తెలియదు. లక్షణాల తీవ్రత లేదా వ్యాధి సంభావ్యతను తగ్గించడానికి ఏదైనా విజయవంతమైన పద్ధతి మీకు తెలిస్తే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణా చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. కార్బెన్డజిమ్ మరియు మాంకోజెబ్ వంటి మందులను వాడండి, బోర్డెయాక్స్ మిశ్రమం లేదా క్లోరోతలోనిల్, ట్రియోఫనేట్- మిథైల్ మరియు జినెబ్ లను పిచికారీ చేయండి

దీనికి కారణమేమిటి?

స్టాగోనోస్పోరా సాచారి యొక్క ఫంగల్ పాథోజెన్ వల్ల లక్షణాలు సంభవిస్తాయి, ఇది ఆకులు తీవ్రంగా ఎండిపోయేటట్టు చేస్తుంది మరియు మొక్కల కిరణజన్య సంయోగక్రియను బాగా తగ్గిస్తుంది. ఈ వ్యాధి ప్రధానంగా వర్షాల తర్వాత లేదా పొలంలో అధికంగా నీరు పెట్టడం వలన సంభవిస్తుంది. ఇది ఆకు పత్రహరితాన్ని తయారుచేసే సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది. మట్టి, చెరకు విత్తనం మరియు వ్యవసాయ పరికరాల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందదు. ఇది ప్రధానంగా గాలి ప్రవాహం, గాలి మరియు వర్షం ద్వారా వ్యాపిస్తుంది. పొడి వాతావరణంలో, చారల నిర్మాణం వేగంగా ఉంటుంది. చాలా చారలు ఒకదానితో మరొకటి కలిసిపోయి, పొడవుగా మారి, పరిపక్వతకు అవరోధం కల్పిస్తాయి మరియు కణజాల రంగును మారుస్తాయి. వసంత ఋతువు మరియు శరదృతువుల్లో ఈ చారలు ఏర్పడటం మరింత స్పష్టంగా కనిపిస్తుంది మరియు శీతాకాలంలో ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉండడం వలన వ్యాధికారక సూక్షజీవుల మనుగడ కష్టమవుతుంది. చివరగా, ఆకు ఉపరితలం మొత్తం ఒక సాధారణ కాలిపోయిన రూపాన్ని చూపుతుంది.


నివారణా చర్యలు

  • పరిశుభ్రతా చర్యలు ఐనోక్యులమ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
  • నిరోధక రకాలను మొక్కలను నాటండి.
  • సాచరం స్పాంటానియం, ఇంపెరాటా సిలిండ్రికా మరియు రోట్‌బొల్లియా కోచిన్‌చినెన్సిస్ వంటి ప్రత్యామ్నాయ అతిధి మొక్కలను తొలగించండి.
  • వ్యాధి సోకిన ఆకులను తొలగించండి.
  • వ్యాధి సంభవం తగ్గించడానికి వర్షపాతం మరియు తేమ తక్కువగా ఉన్నప్పుడు మొక్కలు నాటండి.
  • పంట కోత తర్వాత, మొక్కల అవశేషాలపై, మట్టిలో మరియు పైక్నిడియా లోపల వున్న పైక్నియో భీజాంశాలను చంపడానికి తీవ్రంగా వ్యాధి సోకిన పొలాలలో నిప్పు పెట్టండి.
  • ఎక్కువ సేంద్రీయ, భాస్వరం మరియు పొటాష్ ఎరువులు వేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి