చెరుకు

చెరుకులో నారింజ రంగు తుప్పు తెగులు

Puccinia kuehnii

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • మొక్కపై నారింజ-గోధుమ రంగు మచ్చలు.
  • ఆకుల దిగువ భాగంలో బీజాంశాలు.
  • ఆకు కోశం మీద కూడా కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

చెరుకు

లక్షణాలు

ఆకు మీద చిన్న చనిపోయిన మచ్చలుగా ఈ గాయాలు ప్రారంభమవుతాయి. తరువాత ఇవి 4 మి.మీ పొడవు మరియు 3 మి.మీ వెడల్పు గల నారింజ-గోధుమ గాయాలుగా వృద్ధి చెందుతాయి. ఇవి సాధారణంగా ఆకు మొదలు వైపు కేంద్రీకృతమై సమూహాలుగా సంభవిస్తాయి. ఆకుల దిగువ భాగంలో నారింజ రంగు బీజాంశం ఉత్పత్తి అవుతుంది. తీవ్రంగా ప్రభావితమైన ఆకు కణజాలం చనిపోతుంది, ఇది పంట గుబురును తగ్గించడానికి దారితీస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో, ఆకు కోశం మీద కూడా మచ్చలు కనిపిస్తాయి, ఫలితంగా దూరం నుండి చూస్తే మొత్తం ఆకులు గోధుమ రంగులో కనిపిస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ రోజు వరకు, ఈ వ్యాధికి వ్యతిరేకంగా జీవ నియంత్రణ విధానం గురించి మాకు తెలియదు. సంభవం లేదా లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ఏదైనా విజయవంతమైన పద్ధతి మీకు తెలిస్తే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. శిలీంద్ర నాశినులు దిగుబడి నష్టాలను తగ్గించగలవు. ఈ వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగించే పైరాక్లోస్ట్రోబిన్ మరియు అజోక్సిస్ట్రోబిన్ వంటి స్ట్రోబిలురిన్ వర్గానికి చెందిన శిలీంద్ర నాశినులతో మొక్కలను పిచికారీ చేయండి. అలాగే, ట్రైజోల్ వర్గానికి చెందిన శిలీంద్ర సంహారిణిలైన మెట్కోనజోల్ మరియు ప్రొపికోనజోల్ 3 నుండి 4 వారాల వ్యవధిలో వాడవచ్చు.

దీనికి కారణమేమిటి?

పుస్కినియా కుహెని యొక్క ఫంగస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది సూక్ష్మ పరిమాణంలో వున్న, తేలికైన మరియు గట్టిగా ఉండే బీజాంశాలను ఉత్పత్తి చేసే తుప్పు ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది గాలి, నీటి తుంపర్ల ద్వారా వేగంగా మరియు తక్కువ దూరం చెదరగొట్టబడడాన్ని సులభం చేస్తుంది. మట్టిలోని మొక్కల అవశేషాలలో కూడా బీజాంశం మనుగడ సాగిస్తుంది. సాధారణంగా ఈ వ్యాధిని వేసవి మరియు శరదృతువు ప్రారంభంలో వెచ్చని, తడి మరియు అధిక తేమతో కూడిన పర్యావరణ పరిస్థితులతో గమనించవచ్చు. ఇది బాగా మరింత పరిణతి చెందిన చెరుకుకు (సాధారణంగా 6 నెలల కన్నా ఎక్కువ వయస్సు) సంక్రమిస్తుంది.. 30°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, 70 మరియు 90% మధ్య తేమతో పెరుగుదల దీని వ్యాప్తిని పరిమితం చేస్తాయి. అధిక గాలి వేగం మరియు నిరంతరం ఆకాశం మేఘావృతమై ఉండడం వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తాయి.


నివారణా చర్యలు

  • నిరోధక నిరోధక రకాలను పెంచండి.
  • మొక్కల అవశేషాలను తొలగించడం ద్వారా పొలం లేదా పండ్ల తోటల్లో మంచి పారిశుద్ధ్యాన్ని పాటించండి.
  • వ్యాధి సంకేతాల కోసం పొలం లేదా తోటలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి