ద్రాక్ష

ఫుట్ రాట్

Cylindrocarpon

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • కుదించబడిన కణుపులు.
  • ఆకు సైజు మరియు ఆకులు తగ్గుతాయి.
  • ఆకులు పసుపు రంగులోకి మారతాయి మరియు వాడిపోతాయి.
  • నేలకు సమీపంలో వేర్ల పైన మరియు బెరడుపై ముదురు రంగు గాయాలు ఎరాడుతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ద్రాక్ష

లక్షణాలు

లేత తీగలు ప్రభావితమవుతాయి మరియు సంక్షిప్త కణుపులు, తగ్గిన ఆకు పరిమాణం మరియు తక్కువ ఆకులు వంటి లక్షణాలను చూపుతాయి. 3 నుండి 5 సంవత్సరాల వయస్సు గల ద్రాక్ష ఆకులు పసుపు రంగులోకి మారి, వాడిపోయి చివరికి అకాలంగా రాలిపోతాయి. వేర్లు కుదించబడి గుంతలు లాంటి ముదురు గాయాలు వాటిపై కనపడతాయి. దీని వలన మొత్తం మొక్క వాడిపోయి మొక్క పైనుండి కిందకి చనిపోవచ్చు. వేరు కణజాలం ఊదా రంగులోనికి మారడం సాధారణం. ఈ వ్యాధికి ప్రభావితమైన తీగలు చిన్న సైజు కాండం, కుదించబడిన కణుపులు, అసమాన చెక్క పరిపక్వతతో తక్కువ సత్తువను కలిగి ఉంటాయి. ప్రభావిత ద్రాక్ష తీగల కాండం మధ్య భాగం కూడా సంపీడనం చెంది మరియు రంగు పాలిపోతుంది. లేత తీగలు మరింత వేగంగా ప్రభావితమవుతాయి, అయితే ముదురు తీగలు మరింత మెల్లగా క్షీణిస్తాయి. దాడికి గురైన లేత తీగలు చాలా త్వరగా చనిపోతాయి, కానీ తీగల వయసు పెరిగే కొద్దీ ఇన్‌ఫెక్షన్ క్రమంగా క్షీణిస్తుంది మరియు అవి చనిపోవడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

నివారణ చర్యగా కత్తిరింపు గాయాలు, అంటుకట్టే పదార్ధం యొక్క మొదలు భాగం కొనలు మరియు అంటుకట్టిన ప్రాంతంలో ట్రైకోడెర్మా ఎస్ పి ని చల్లండి. నిద్రావస్థలో ఉన్న నర్సరీ తీగలను 50°C వద్ద ట్రైకోడెర్మా ను వేడి నీటితో కలిపి చికిత్స చేయండి. ట్రైకోడెర్మా ఎస్‌పిపి., మైకోరైజా మరియు కంపోస్ట్‌తో మట్టికి సవరణలు చేస్తే ఒత్తిడి పరిస్థితులకు మొక్కలు లోనైనప్పుడు మొక్కల నిరోధకతను పెంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణా చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. ఇప్పటి వరకు ఈ శిలీంద్రానికి వ్యతిరేకంగా ఎటువంటి రసాయన పద్ధతులు అభివృద్ధి చేయబడలేదు.

దీనికి కారణమేమిటి?

ద్రాక్ష తీగలలో బ్లాక్ ఫుట్ రాట్ తెగులు లక్షణాలు సిలిండ్రోకాపాన్ యొక్క అనేక మట్టిలో జీవించే శిలీంధ్రాల వల్ల కలుగుతాయి. ప్రధానంగా 2 నుంచి 8 సంవత్సరాల మధ్య ఉన్న లేత ద్రాక్ష తీగలు శిలీంద్రం బారిన పడ్డాయి. సాధారణంగా ఈ శిలీంద్రం గాయాలు లేదా వేర్లలో సహజసిద్ధంగా తెరవబడి ఉండే రంధ్రాల ద్వారా మొక్కలోకి ప్రవేశిస్తుంది. నీటి ఎద్దడి మరియు పోషకాల వత్తిడి ఉన్న సమయంలో ద్రాక్ష మొక్కలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతాయి. లేత మొక్కలపై భారీ పంట భారం, పేలవమైన డ్రైనేజీ మరియు నేల సంపీడనం కూడా వ్యాధి అభివృద్ధికి అనుకూలంగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • మీ ద్రాక్ష తీగలను బాగా ఎండిన నేల లేదా ఎతైన మడులపై నాటండి.
  • ఆరోగ్యకరమైన మరియు మంచి నాణ్యమైన తీగలను మాత్రమే నాటండి.
  • బిందు సేద్యం మరియు ఎరువులను సరిగ్గా ఉపయోగించడం ద్వారా మొక్కల ఒత్తిడిని నివారించండి.
  • తీగలకు వ్యాధి సోకకుండా కాపాడటానికి కత్తిరింపు లేదా అంటుకట్టు గాయాల యొక్క కఠిన పారిశుధ్య నిర్వహణను ప్రాక్టీస్ చేయండి.
  • అంటు వేసిన వెంటనే మొక్కల పెరుగుదల నియంత్రకాలు లేదా శిలీంద్రనాశినులు కలిగిన మైనంతో తీగలను ముంచండి.
  • వీలైతే, మీరు మళ్లీ నాటడానికి ముందు కొంతకాలం తోటను బీడుగా వదిలేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి