జామ

జామలో గజ్జి తెగులు

Pestalotiopsis psidii

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • పండ్లపై చిన్న చిన్న , గోధుమ రంగు, తుప్పుపట్టినట్టు ఉండే నిర్జీవ కణజాల ప్రాంతాలు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
జామ

జామ

లక్షణాలు

ఈ వ్యాధి సాధారణంగా ఆకుపచ్చని పండ్లపై మరియు చాలా అరుదుగా ఆకులపై వస్తుంది. పండ్లపై చిన్న చిన్న , గోధుమ రంగు, తుప్పుపట్టినట్టు ఉన్న నిర్జీవ కణజాల ప్రాంతాలు ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలు. ఈ తెగులు బాగా వ్యాప్తి చెందిన దశలో, ఈ నిర్జీవ కణజాల ప్రాంతాలు ఆకు పైపొరను చింపుతాయి. వ్యాధి సోకిన పండ్లు గట్టిపడి, ఆకారం కోల్పోయి అభివృద్ధి చెందకుండా రాలిపడిపోతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పండ్లకు గాయం కాకుండా నివారించడానికి పండ్లను ఫోమ్ నెట్స్ లో బ్యాగ్ చేయండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉన్న జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు నుండి రక్షణ పొందడానికి బోర్డియక్స్ మిశ్రమం లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్లను పిచికారీలు చేసినట్లయితే ఇవి వ్యాధి వ్యాప్తిని తగినంతగా నియంత్రించగలవు. పరాగసంపర్కం తర్వాత చిన్న పండ్లకు డైమిథోయేట్ వంటి అంతర్వాహిక క్రిమిసంహారకాల వాడకం సానుకూల ఫలితాలను చూపించాయి.

దీనికి కారణమేమిటి?

ఈ వ్యాధి ఫంగస్ వల్ల వస్తుంది మరియు ఐనోక్యులమ్ యొక్క ప్రాధమిక మూలం నిద్రాణ స్థితిలో ఉన్న మైసిలియం. ఫంగస్ వేగంగా దాడి చేయడం వలన పండ్లు దెబ్బతింటాయి. గాలి ద్వారా సంక్రమించే కోనిడియా, నీటి తుంపర్లు, తెగులు సోకిన మొక్కలకు దగ్గరగా ఉండడం, గాయం మరియు వ్యాధి సోకిన ఆకుల రవాణా ద్వారా ఈ సంక్రమణ ద్వితీయంగా వ్యాప్తి చెందుతుంది. 20 మరియు 25°C మధ్య ఉష్ణోగ్రతల వద్ద, దట్టమైన పందిరి మరియు తగినంత గాలి ప్రవాహంలేని తేమతో కూడిన వాతావరణంలో శిలీంధ్రం పెరుగుతుంది.


నివారణా చర్యలు

  • వ్యాధిని తగ్గించడానికి వేసవిలో తగు మోతాదులో నీరు పెట్టండి మరియు చెట్టుకు సరైన పోషకాలను అందించండి.
  • పండ్లకు గాయం కాకుండా ఉండేందుకు కాయలు బేర్ పండు పరిమాణంలో ఉన్నప్పుడు పండ్లను ఫోమ్ నెట్స్ లో బ్యాగ్ చేయండి.
  • వ్యాధికారకం ప్రధానంగా గాయం ద్వారా సంక్రమించే పరాన్నజీవి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి