పసుపు

పసుపు పంటలో ఆకు మాడు తెగులు

Taphrina maculans

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • సక్రమమైన ఆకారంలో లేని అనేక చిన్న చిన్న కోలాకారపు ఆకులకి రెండువైపులా కనిపిస్తాయి.
  • ఈ మచ్చలు ఒక్కదానితో మరొకటి కలిసి సక్రమమైన ఆకారంలో లేని మచ్చలుగా మారుతాయి.
  • మొక్కలు మాడిపోయినట్టు కనిస్తాయి మరియు పసుపు కొమ్ము దిగుబడి తగ్గుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
పసుపు

పసుపు

లక్షణాలు

ఈ వ్యాధి సాధారణంగా ఆకుల దిగువ భాగంలో కనిపిస్తుంది. ఈ మచ్చలు 1 - 2 మిమీ వెడల్పుతో చిన్నవిగా ఉండి చాలా వరకు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. ఈ మచ్చలు ఈనెల వెంట వరుసలలో అమర్చబడి క్రమరహిత గాయాలను ఏర్పరచడానికి ఒకదానితో మరొకటి స్వేచ్ఛగా కలిసిపోతాయి. మొదట, అవి లేత పసుపు రంగులో కనిపిస్తాయి. తరువాత మురికి లాంటి పసుపు రంగులోకి మారుతాయి. వ్యాధి సోకిన ఆకులు వక్రీకరణ చెంది ఎరుపు-గోధుమ రంగులో కనిపిస్తాయి. వ్యాధి తీవంగా ఉన్న సందర్భాల్లో, మొక్కలు కాలిపోయినట్టుగా కనిపిస్తాయి. పసుపుకొమ్ము దిగుబడి తగ్గుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ మరియు ట్రైకోడెర్మా హార్జియానం కలిగిన ఉత్పత్తులు వ్యాధి వ్యాప్తిని తగ్గించగలవు. అశోక (పాలియంథియా లాంగిఫోలియా) ఆకుల యొక్క సారం లేదా ఇంట్లో తయారుచేసిన ఉల్లిగడ్డల యొక్క సారం కూడా వ్యాధి వ్యాప్తిని తగ్గిస్తుంది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. విత్తనాలను ఒక లీటరు నీటికి 3 గ్రా మాంకోజెబ్ లేదా ఒక లీటరు నీటికి 1 గ్రా కార్బెండజిమ్ కలిపి 30 నిమిషాలు శుద్ధి చేసి, విత్తే ముందు నీడలో ఆరబెట్టండి.

దీనికి కారణమేమిటి?

ఈ ఫంగస్ ప్రధానంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది మరియు దిగువ ఆకులపై మొదటిసారి ప్రాధమికంగా సంభవిస్తుంది. పొలంలో మిగిలిపోయిన అతిధేయ మొక్కల ఎండిన ఆకులలో ఐనోక్యులమ్ జీవించి ఉంటుంది. ఆస్కోస్పోర్‌ల వల్ల రెండవసారి ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది, ఇవి పక్వానికి వచ్చిన ఆస్కీ నుండి వ్యాపిస్తాయి మరియు తాజా ఆకులకు సోకుతాయి. వేసవిలో, ఎండిపోయిన వ్యాధికారక ఆకులు మరియు మట్టిలో పడిన ఆకుల మధ్య ఎండిపోయిన ఆస్కోస్పోర్‌లు మరియు బ్లాస్టోస్పోర్‌లపై ఆస్కోజెనస్ కణాల ద్వారా మనుగడ సాగిస్తుంది. నేలలో అధిక తేమ, 25°C ఉష్ణోగ్రత మరియు తడి ఆకులు ఈ వ్యాధికి అనుకూలంగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • పొలంలో సరైన శుభ్రతను పాటించండి.
  • వ్యాధి కారకాలు పొలంలో వ్యాపించకుండా ఉండడానికి, తెగులు సోకిన మరియు ఎండిపోయిన ఆకులని తొలగించి కాల్చివేయండి.
  • తెగుళ్లు లేని ప్రాంతం నుండి విత్తనాలను సేకరించండి.
  • సాధ్యమైన చోట పంట మార్పిడిని ఆచరించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి