పొగాకు

టార్గెట్ స్పాట్

Rhizoctonia solani

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • గాయాలు కొద్దిగా లేదా అసలు పసురంగు కలిగిఉండని (క్లోరోసిస్) చిన్న చిన్న, పారదర్శక మచ్చలుగా ప్రారంభమవుతాయి.
  • సాఫ్ట్‌బాల్ పరిమాణం లేదా అంతకంటే పెద్దగా విస్తరించవచ్చు మరియు కేంద్రీకృత రింగ్ నమూనా లో ఉంటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
పొగాకు

పొగాకు

లక్షణాలు

మట్టికి దగ్గరగా ఉండే ఆకుల ఉపరితలంపై చిన్న 2-3 మిమీ తెలుపు లేదా లేత గోధుమరంగు మచ్చలు కనిపిస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ బయటికి వ్యాపిస్తుంది. ప్రాథమిక గాయాల చుట్టూ నిర్జీవ కణజాల రింగులు సృష్టించబడతాయి. పొలంలో, మొదట బాగా క్రిందిగావున్న, ముదురు ఆకులపై టార్గెట్ స్పాట్ ఏర్పడుతుంది, తరువాత కాలక్రమేణా పై భాగంలోని ఆకులకు విస్తరిస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ట్రైకోడెర్మా ఎస్పి.. టి. హార్జియానం యొక్క ఐసోలేట్‌లు ఆర్. సోలని యొక్క పెరుగుదలను తగ్గించి, పొగాకు మొక్కలలో వ్యాధి నియంత్రణను పెంచుతాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉన్నట్లయితే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. శిలీంధ్ర ఆకు మచ్చలను నియంత్రించడానికి మాంకోజెబ్ మరియు అజోక్సిస్ట్రోబిన్ లను ఆకులపై పిచికారీ చేయవచ్చు.

దీనికి కారణమేమిటి?

మట్టి ద్వారా సంక్రమించే ఆర్. సోలాని అనే వ్యాధికారకం వల్ల నష్టం జరుగుతుంది. ఫంగస్ ప్రధానంగా మట్టిలో హైఫే లేదా స్క్లెరోటియాగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు ఉన్న గ్రీన్‌హౌస్ మొలకలతో ఈ వ్యాధి సంక్రమించవచ్చు లేదా పొలాల్లో మరియు చుట్టుపక్కల సహజంగా ఉండే టార్గెట్ స్పాట్ ఫంగస్ ద్వారా సంక్రమించవచ్చు. మితమైన ఉష్ణోగ్రతలు, అధిక తేమ మరియు ఎక్కువ కాలం ఆకులు తడిగా ఉండటం ఈ వ్యాధికి అనుకూలంగా ఉంటుంది. వ్యాధిని సరిగా నియంత్రించకపోతే దిగుబడి తీవ్రంగా తగ్గుతుంది.


నివారణా చర్యలు

  • పంట భ్రమణం మరియు శిలీంద్ర నాశినుల కలయికతో వ్యాధిని నివారించవచ్చు.
  • పొగాకు పంటను కనీసం రెండు సీజన్‌ల పాటు పొలంలో వేయకపోవడం మరియు సోయాబీన్ ని పంటగా వేయకపోవడం ద్వారా టార్గెట్ స్పాట్ సంభవాన్ని తగ్గించవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి