దానిమ్మ

దానిమ్మ పంటలో పొక్కు వ్యాధి

Elsinoë punicae

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • పువ్వులు మరియు పండ్లపై పొడిబారిన గట్టి ప్యాచీలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

దానిమ్మ

లక్షణాలు

మొదట్లో పండ్లపై తుప్పుపట్టిన మచ్చలుగా లక్షణాలు కనిపిస్తాయి. తరువాత ఇవి ఉబ్బిన పెరిగిన పొక్కుల వలే మారతాయి. ఈ మచ్చలు పెద్దవిగా మారి ఒకదానితో మరొకటి విలీనమై పొక్కులు లాంటి మరియు బెండు చెక్క లాంటి లక్షణాలు పువ్వులు మరియు పండ్లపై కనిపిస్తాయి (అపరిపక్వమైన మరియు పరిపక్వమైన పండ్లు, రెండూ). ఈ వ్యాధి లేత పండ్లు వికృతంగా మారేలా చేస్తుంది అలాగే పరాగ సంపర్కానికి భంగం కలిగించవచ్చు. ఈ పొక్కులు బూడిద లేదా గోధుమ రంగులో ఉంటాయి. ఈ వ్యాధి లక్షణాలు పండ్ల లోపల కనిపించవు. ఆకులు మరియు రెమ్మలు/కొమ్మలపై గోధుమ రంగు గాయాలను గుర్తించవచ్చు కానీ ఇది వ్యాధి లక్షణం కాదు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ వ్యాధికి ఇప్పటివరకు ఎటువంటి ప్రభావవంతమైన మరియు వాడదగిన జీవ నియంత్రణ రిపోర్ట్ చేయబడలేదు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. రసాయనాల వాడకంపై సమాచారం లేనటప్పటికీ కొన్ని శిలీంద్ర నాశిని పిచికారీలు గుర్తించదగిన ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రత్యేకించి పుష్పించే దశ నుండి 15 రోజుల వ్యవధిలో కార్బెండజిమ్ (0.1%), థియోఫనేట్ మిథైల్ (0.1%), బిటర్టానాల్ (0.1%), క్లోరోథలోనిల్ (0.2%) ని పిచికారీ చేయడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చు. పురుగుమందును ఉపయోగిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ రక్షిత దుస్తులను ధరించండి మరియు ఉత్పత్తి లేబుల్‌లో మోతాదు, వాడాల్సిన సమయం మరియు పంటకు ముందు విరామం వంటి సూచనలను అనుసరించండి. ఎల్లప్పుడూ, తెగులు నిర్వహణపై ప్రాంతీయ నిబంధనలను అనుసరించండి.

దీనికి కారణమేమిటి?

ఎల్సినోయే జాతులు ఫైటోపాథోజెన్‌లు అనేక జాతుల మొక్కలపై పొక్కులను కలిగిస్తాయి, వీటిలో కొన్ని ఆర్ధికంగా ముఖ్య పంటలైన అవకాడో, నిమ్మ జాతి, ద్రాక్ష, అలంకారమైన పంటలు, పొలం పంటలు మరియు కలపతో కూడిన అతిధేయ పంటలు ఉన్నాయి. ఈ వ్యాధి యొక్క వ్యాప్తి మరియు నియంత్రణకి సంబంధించిన (ఎపిడెమియాలజీ) మరిన్ని విషయాలను తెలుసుకొనుటకు మరియు వాణిజ్య ఉత్పత్తిపై ఖచ్చితమైన ఆర్థిక ప్రభావాన్ని నిర్ణయించడానికి అదనపు అధ్యయనాలు అవసరం. వ్యాధి సోకిన పొలాలనుండి సేకరించిన ఎల్సినోయే నమూనాలలో వీటి పునరుత్పత్తికి సంబంధించిన భౌతిక నిర్మాణాలు లేకపోవడం, ఈ వ్యాధి యొక్క వ్యాప్తి మరియు నియంత్రణకి సంబంధించిన (ఎపిడెమియాలజీ ఇన్సైట్) విషయాలు తెలుసుకోవడం కష్టతరంగా మారింది పండ్లపై పొక్కు తెగులు వలన మార్కెట్లో పంట రేటు తగ్గుతుందని గమనించాలి, అందువల్ల ఈ వ్యాధి మూలాలపై మరింత పరిశోధన అవసరం. వర్షపు వాతావరణం వ్యాధి వ్యాప్తి రేటును ప్రేరేపిస్తుందని గమనించబడింది.


నివారణా చర్యలు

  • తోటలో అత్యధిక పరిశుభ్రతను పాటించాలి.
  • వ్యాధి సోకిన అన్ని ఆకులు, పండ్లు సేకరించి కాల్చివేయాలి.
  • అంటువ్యాధి మూలాన్ని తగ్గించడానికి వ్యాధి సోకిన కొమ్మలు/రెమ్మల కత్తిరింపు చాలా ముఖ్యం.
  • ఈ నిర్దిష్ట ఏజెంట్ యొక్క ఎపిడెమియాలజీపై మరింత పరిశోధనతో దానిమ్మ పంటలో మరింత సమర్థవంతమైన నివారణ చర్యలు అందుబాటులోకి వస్తాయి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి