టమాటో

టమాటో మొజాయిక్ వైరస్

TMV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • తెగులు సోకిన ఆకులు ఆకుపచ్చ మరియు పసుపు వంకర తిరిగి ఉంటాయి.
  • ఆకుల పైన మచ్చలు ఉంటాయి.
  • మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది మరియు పండ్లు తయారవ్వడం బాగా తగ్గిపోతుంది.
  • మ్రుగ్గుతున్న పండ్లపైన పైన గోధుమ రంగు మచ్చలు మరియు వాటి తొక్కపైన గోధుమ రంగు బొడిపెలు ఉంటాయి.

లో కూడా చూడవచ్చు

3 పంటలు

టమాటో

లక్షణాలు

ఏ దశలోనైనా అన్ని మొక్కలకు ఈ తెగులు సోకే అవకాశం వుంది. వాతావరణం బట్టి తెగులు లక్షణాలు మారుతూ ఉంటాయి. తెగులు సోకిన ఆకులు అకుపచ్చ మరియు పసుపు రంగు మచ్చలు లేదా మొజాయిక్ నమూనా కలిగి ఉంటాయి. కొన్ని సందర్భాలలో ముదురు పసుపు రంగు చారలు కనిపిస్తాయి. మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది. పండ్లు తయారవ్వడం కూడా బాగా తగ్గుతుంది. పండ్ల తొక్కల పైన గోధుమరంగు మచ్చలు పండ్లు కూడా గణనీయంగా తగ్గుతాయి.అధికంగా దిగుబడి తాగవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

విత్తనాల్ని నాలుగు రోజుల పాటు 70°C ఉష్ణోగ్రతల్లో వేడి చేయటం లేదా 82-85°C లో 24 ఘంటలపాటు వేడిచేయడంవలన వైరస్ ను తొలగించవచ్చు. ఇంతేకాకుండా విత్తనాల్ని 15 నిమిషాల పాటు గ్రాములు/లీటర్ ట్రైసోడియం ఫాస్ఫేట్ మిశ్రమంలో నానపెట్టి ఆ తర్వాత నీటితో కడిగి ఎండబెట్టడం వలన ఈ తెగులును నివారించవచ్చు.

రసాయన నియంత్రణ

ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే జీవ చికిత్సలు కలసిన నివారణ చర్యలు సమన్వయ పద్ధతులు వాడటం మంచిది. టమాటో మొజాయిక్ వైరస్ కు ఎటువంటి రసాయన చికిత్స అందుబాటులో లేదు.

దీనికి కారణమేమిటి?

ఈ వైరస్ పంట లేదా వేర్ల అవశేషాల్లో కనీసం రెండు ఏళ్ళు జీవిస్తుంది. వేర్లలో కలిగిన చిన్న దెబ్బల నుండి ఈ వైరస్ మొక్కలకు సోకుతుంది. ఈ వైరస్ వ్యాధి సోకిన విత్తనాలు, మొలకలు, కలుపు మరియు వ్యాధి సోకిన మొక్క భాగాల వల్ల వ్యాపిస్తాయి. గాలి, వర్షం, మిడతలు మరియు పక్షులు ద్వారా ఒకపొలం నుండి ఇంకొక పొలానికి ఈ తెగులు విస్తరిస్తుంది. రోజు నిడివి, ఉష్ణోగ్రతలు మరియు కాంతి వంటివి కూడా వ్యాధి తీవ్రతను పెరిగేటట్టు చేస్తాయి.


నివారణా చర్యలు

  • ఆరోగ్యంగావున్న మొక్కల విత్తనాలు వాడాలి.
  • తెగులు నిరోధక రకాలు వాడాలి.
  • ఆవిరిని వాడి భూమిపై ఉన్న వైరస్ ను తొలగించాలి.
  • చేతులు కడుక్కోవడం, చేతులకు తొడుగులు వేసుకోవడం మరియు పరికరాలు శుభ్రంగా ఉంచడం చేయాలి.
  • ఇప్పటికే తెగులు సోకిన పొలంలో ఈ పంటను వేయకండి.
  • టమాటో పంట చుట్టూ పొగాకు ఉత్పత్తులను ( సిగరెట్ లాంటివి) వాడరాదు.
  • కలుపు మొక్కలను తొలగించండి.
  • మరియు పంట అవశేషాల్ని కాల్చివేయాలి.
  • నారుమడులు మరియు పొలాన్ని గమనిస్తూ తెగులు సోకిన మొక్కలను తొలగించి తెగులు సోకిన మొక్కలను తొలగించి కాల్చి వేయండి.
  • టమాటో పంటకు దగ్గరగా ఇతర ప్రత్యామ్న్యాయ అతిధి మొక్కలను వేయకండి.
  • కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి ఈ తెగులు సోకని మొక్కలతో పంటమార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి