వరి

వరిలో గ్రాసీ స్టంట్ వైరస్

RGSV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • ఎదుగుదల తగ్గిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారడం నిటారుగా పెరగడం ఈ తెగులు లక్షణాలు.
  • ముదురు గోధుమ రంగు లేదా తుప్పు రంగు చుక్కలు ఆకులపైన కనిపిస్తాయి.
  • మొలకల దశలోనే ఈ తెగులు సోకితే అవి పరిణితి చెందవు.
  • మొక్క తరువాత దశలలో ఈ తెగులు సంక్రమిస్తే కంకులు ఏర్పడవు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

వరి పంట అన్ని దశలలోను ఈ తెగులు సంక్రమించే అవకాశం వుంది. కానీ మొక్కలు పిలకలు వేసే దశలో, బాగా ఎదిగే దశలో ఈ తెగులు సోకే అవకాశం చాలా అధికంగా ఉంటుంది. మొక్కలు ఎదగకపోవడం, అధిక మొత్తంలో పిలకలు వేయడం వలన గడ్డి లాగ కనపడడం మరియు మొక్కలు నిటారుగా ఎదగడం వంటి లక్షణాలు ఈ తెగులు సోకిన మొక్కలలో కనిపిస్తాయి. ఆకులు చిన్నగా, సన్నని పాలిపోయిన ఆకు పచ్చరంగులో లేదా పసుపు రంగులో మచ్చలతో ఉంటాయి. బాగా దగ్గరగా వెళ్లి చూసినప్పుడు చాలా అధిక సంఖ్యలో ముదురు గోధుమ రంగు లేదా తుప్పు రంగు మచ్చలు లేదా చుక్కలు ఆకులపైన కనిపిస్తాయి. ఇవి ఆకు మొత్తం వ్యాపించి ఉంటాయి. మొలకల దశలో ఈ తెగులు సంక్రమిస్తే మొక్క పక్వదశకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. తరువాత దశలలో ఈ తెగులు సోకినప్పుడు మొక్క ఎదుగుతుంది కానీ వాటికి కంకులు ఏర్పడవు. ఇది పంట దిగుబడిపైన ప్రభావం చూపిస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులును ప్రత్యక్షంగా నివారించడానికి ఎటువంటి పద్దతి అందుబాటులో లేదు. వేప విత్తనాల గింజల సారం ఈ కీటకాల జనాభాను తగ్గించడంలో మరియు వరి రేగ్డ్ స్టంట్ వైరస్ (RGSV) తెగులు సోకకుండా చేస్తుంది. వాటర్ స్ట్రైడ్ర్లు, మిరిడ్ బగ్స్, సాలీడ్లు మరియు ఈ కీటకాల గుడ్లను ఆశించే కందిరీగలు మరియు ఈగలు ఈ కీటకాలకు సహజ శత్రువులు. ఒక రోజు పాటు నారుమడిని నీటిలో మునిగి వుండేటట్టు చేసినా ఈ కీటకాలను నియంత్రించవచ్చు. ఇలా చేయడం వలన ఈ కీటకాలు నీటిలో మునిగి చనిపోతాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులును పైన ప్రత్యక్షంగా పనిచేసే పురుగుల మందులేమీ లేవు. కానీ వీటి జనాభా బాగా అధికంగా ఉంటే కీటక నాశినులను వాడి వీటిని నియంత్రించవచ్చు. అబామెక్టిన్, బుప్రొఫెజిన్ మరియు ఏటోఫెన్ప్రోక్స్ లను వీటి నియంత్రణకు వాడవచ్చు. ఈ తెగులు వాహకాలను నియంత్రించడానికి, ప్రత్యేకంగా ఏడాది పాటూ వాటిని పండించే ప్రాంతాలలో, ఈ మందులు ప్రతి సారీ పనిచేయవు.

దీనికి కారణమేమిటి?

నీలాపర్వత జాతికి( N. లుంజెన్స్, N. బకెరి మరియు N. ముయిరి) చెందిన గోధుమ ప్లాంట్ హోపర్ కీటకాల వలన సంక్రమిస్తుంది. పిల్ల కీటకాలు మరియు పెద్ద కీటకాలు కూడా ఈ వైరస్ ను దీర్ఘకాలంపాటు వాటిపైన కలిగి ఉంటాయి. అందు వలన క్రొత్త మొక్కలకు ఈ వైరస్ ను నిరంతరం సంక్రమింప చేస్తూ ఈ వైరస్ ఎదిగేటట్టు చేస్తాయి. కానీ ఈ వైరస్ ఈ కీటకాలను అంటిపెట్టుకోవాలంటే కీటకాలు కనీసం 30 నిముషాల పాటు తెగులు సోకిన మొక్కలను తింటూ ఉండాలి. తెగులు దక్షిణ మరియు ఆగ్నేయాసియా, చైనా, జపాన్ మరియు తైవాన్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ మరియు భారత దేశంలో కనిపిస్తుంది. ఒక్క వరి పంట మాత్రమే వేసే ప్రాంతాలలో ఇది అధికంగా కనిపిస్తుంది. ఈ వైరస్ వరి రేగ్డ్ స్టంట్ వైరస్ తో కలసి సంక్రమించే అవకాశం వుంది. N. ల్యూజెన్స్ కీటకాలు కూడా ఈ తెగులుకు వాహకాలుగా ఉంటాయి. ఈ తెగులు వలన పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది.


నివారణా చర్యలు

  • ఈ తెగులు లక్షణాల కోసం లేదా ఇతర కీటకాల ఉనికిని తెలుసుకోవడానికి పొలాన్ని తరుచూ గమనిస్తూ వుండండి.
  • మొక్కల మధ్యన అంతరాన్ని పెంచి మొక్కల మొదళ్ళకు సూర్యరశ్మి చేరేటట్టు చూడండి.
  • ఈ కీటకాల జనాభా బాగా అధికంగా వృద్ధి చెందకుండా ఉండడానికి మీ చుట్టుప్రక్కల రైతులతో కలసి ఒకే సమయంలో పంటను వేయండి.
  • ఈ తెగులును తట్టుకునే వరి వంగడాలను వాడండి.
  • సరైన మోతాదులో ఎరువులను వేయండి.
  • పొలంలో మరియు పొలం చుట్టు ప్రక్కల కలుపు మొక్కలను తొలగించి నాశనం చేయండి.
  • విస్తృత పరిధి కలిగిన కీటక నాశినులను ఉపయోగించవద్దు.
  • ఇవి పంటకు మేలు చేసే కీటకాలకు నష్టం కలిగిస్తాయి.
  • పంట కోతల తర్వాత దుబ్బలను తొలగించి పొలం బైటకు తీసుకునివెళ్ళి నాశనం చేయండి.
  • పొలాన్ని బాగా లోతుగా దున్ని తెగులు సోకిన దుబ్బలను మట్టిలో లోతుగా కలయునట్లు చేయండి.
  • ఇవి బాగా కుళ్ళి కీటకాల యొక్క జీవిత చక్రాన్ని నాశనం చేస్తాయి.
  • ఈ తెగులు సోకని పంటలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి