ప్రత్తి

పత్తిలో ఆకుముడత వైరస్

CLCuV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • తెల్ల ఈగలు ఈ పత్తిలో ఆకుముడత తెగులును విస్తరింపచేస్తాయి.
  • ఆకుల అంచులు పైకి మెలికెలు తిరిగి పోతాయి మరియు ఆకుల క్రిందిభాగంలో ఆకుల ఆకారంలో అధికమైన ఎదుగుదల కనిపిస్తుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ప్రత్తి

లక్షణాలు

ఆకులు పైకి చుట్టుకు పోవడం ఈ తెగులు ప్రధాన లక్షణం. ఆకుల ఈనెలు పలుచగా అవ్వడం మరియు ముదురు రంగులోకి మారడం జరుగుతుంది. మరియు ఆకుల క్రిందిభాగంలో ఆకుల ఆకారంలో అధికమైన ఎదుగుదల కనిపిస్తుంది. పువ్వులు దగ్గరగా ఉండి పత్తి కాయలతోపాటు రాలిపోవచ్చు. సీజన్లో ముందుగా ఈ తెగులు సంక్రమిస్తే మొక్కల ఎదుగుదల తగ్గిపోయి దిగుబడిలో చాలా అధిక నష్టం కలుగుతుంది

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ తెల్ల ఈగల జనాభాను వీటికి సహజ శత్రువులైన లేస్ వింగ్స్, బిగ్ ఐ బగ్స్ మైన్యూట్ పైట బగ్స్ తో నియంత్రించవచ్చు. అందువలన వీటికి నష్టం కలగకుండా చూడడానికి పురుగుల మందులను తగిన మోతాదులోనే ఉపయోగించాలి. వేప నూనె లేదా పెట్రోలియం జెల్లీ ఆధారిత నూనెలను మొక్కలు మొత్తం కప్పి ఉండేట్టు వాడాలి (ముఖ్యంగా ఆకుల క్రింది భాగంలో). ఈ మధ్యకాలంలో జరిపిన ప్రయోగాల ద్వారా విడదీసిన బాక్టీరియల్ స్ట్రయిన్స్ ను జీవన నియంత్రణ పద్దతిలో వాడడం వలన (బాసిల్లస్, స్యుడోమోనాస్ మరియు బుర్కోహోల్డెరియా) ఈ వైరస్ సంక్రమణను తగ్గించవచ్చు అని నిరూపించబడినది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణా చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులును నియంత్రించడానికి మరియు తగ్గించడానికి ఎటువంటి పద్దతి అందుబాటులో లేదు. ఇమిడాక్లోప్రిమైడ్ లేదా డీనోటిఫెరాన్ వంటి కీటక నాశినులను వుపయోగించి తెల్ల ఈగలను నియంత్రించవచ్చు. ఈ మందులను అధికమోతాదులలో వాడడం వలన ఈ తెల్ల ఈగలు ఈ మందులకు నిరోధకతను ఏర్పరచుకుంటాయి. అందువలన ఈ మందులను జాగ్రత్తగా వాడవలసివుంటుంది. ఇలా గరగకుండా ఉండడానికి ఈ కీటక నాశినులను మార్చి మార్చి వాడవలసి వుంటుంది.

దీనికి కారణమేమిటి?

పత్తి ఆకు ముడుత వైరస్ వలన ఈ లక్షణాలు ఏర్పడతాయి. ఈ వైరస్ను తెల్ల ఈగలు వ్యాపింప చేస్తాయి. గాలివలన ఈ తెల్ల ఈగలు ఎంతవరకు ఎగరగలవో అంతవరకు ఈ తెగులు విస్తరించడం జరుగుతుంది. సీజన్ మధ్య నుండి సీజన్ చివరి వరకు ఈ తెల్ల ఈగలు చాలా సమస్యాత్మకంగా ఉంటాయి. ఈ వైరస్ విత్తనాల వలన సంక్రమించకపోవడం వలన పొగాకు మరియు టమోటా వంటి ప్రత్యామ్న్యాయ అతిథేయ మొక్కల పైన మరియు కలుపు మొక్కల పైన జీవిస్తాయి. వర్షపాతం, ఈ వైరస్ కలిగివున్న ఆంటు మొక్కలు మరియు కలుపు మొక్కలు ఉండడం ఈ వైరస్ వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటాయి. 25-30ºC.ఉష్ణోగ్రతలు ఈ వైరస్కు అనుకూలంగా ఉంటాయి. నర్సరీలలో మొలకల సమయంలో మరియు ఎదిగే దశలలోను ఈ తెగులు సంక్రమించే అవకాశం అధికంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • ఎటువంటి తెగుళ్ళు లేని ధృవీకరించిన సరిఫికేట్ కలిగిన విత్తనాలను మాత్రమే ఉపయోగించండి.
  • అంటుమొక్కలకు తెగుళ్ళు లేవని అవి ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.
  • తెల్ల ఈగల జనాభాను నియంత్రించండి.
  • మొలకలను వాటినుండి రక్షించండి.
  • పొలంలో మరియు పొలం చుట్టుప్రక్కల కలుపు మొక్కలను తొలగించండి.
  • పత్తి జాతికి చెందని మొక్కలతో పంట మార్పిడి చేయండి.
  • పంట కోతల తర్వాత పంట అవశేషాలను పొలంలో లోతుగా పూడ్చిపెట్టండి లేదా కాల్చివేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి