బంగాళదుంప

బంగాళాదుంప ఎస్ వైరస్

PVS

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు వైకల్యం చెందుతాయి మరియు కాంస్య రంగులోకి మారతాయి.
  • ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు


బంగాళదుంప

లక్షణాలు

వైరస్ యొక్క లక్షణాలు చాలా మారుతూ ఉంటాయి అలాగే అతిధి మొక్కలు, పర్యావరణ పరిస్థితులతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. చాలా రకాల మొక్కల్లో, వైరల్ సంక్రమణ లక్షణాలు లేకుండా ఉంటుంది. ప్రారంభ వృద్ధి దశలో తెగులు సోకినప్పుడు, ఈనెలు కొద్దిగా లోపలకు నొక్కుకుపోయినట్టు ఉండడం, ఆకులు ముతకగా, బహిరంగ పెరుగుదల, మిల్ట్ మోట్లింగ్, కాంస్య లేదా చిన్న నిర్జీవ(నలుపు) మచ్చలు, కొన్ని రకాలు చూపిస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పేనుబంకను వేటాడి తినే కీటకాలు చాలా ఉన్నాయి. మంచి క్షేత్ర పద్ధతుల ద్వారా ఇవి వృద్ధి చెందేటట్టు చేయాలి. మొక్క ఆకులకు కొన్ని చుక్కల డిటర్జెంట్ ను నీటితో కలిపి పిచికారీ చేయడం ద్వారా పేనుబంకను తుడిచిపెట్టవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వైరస్ ను రసాయనాల ద్వారా నేరుగా చికిత్స చేయలేనప్పటికీ, దీనిని వ్యాపింపచేసే వాహకాలను, ప్రధానంగా పేనుబంకను కొంత వరకు నియంత్రించవచ్చు. పేనుబంక మరియు వాటి రసాయన నియంత్రణ కోసం డేటాబేస్ ను చూడండి. పేనుబంక కోసం లేబుల్ క్లెయిమ్ పురుగుమందులు మా ఉత్పత్తుల షీట్లోఇవ్వబడ్డాయి.

దీనికి కారణమేమిటి?

కార్లావైరస్ అయిన బంగాళాదుంప ఎస్ వైరస్ వల్ల నష్టం జరుగుతుంది. ఇది ప్రధానంగా కొంతకాలం వరకూ పేనుబంక పురుగుల వలన వ్యాపిస్తుంది. పొలంలో నడుస్తున్నప్పుడు, యంత్రాలు, పరికరాలు మరియు దెబ్బ తిన్న మొక్కల ద్వారా కూడా ఇది యాంత్రికంగా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులును పేనుబంక అత్యంత సమర్థవంతంగా వ్యాపింపచేస్తుంది. సీజన్ తరువాత మొక్కలు ఈ వైరస్ కు నిరోధకతను కలిగి ఉంటాయి.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే, ధృవీకరించబడిన నిరోధక రకాల నుండి మొక్కల పదార్థాలను ఉపయోగించండి.
  • నారుమడులను కీటక వాహకాలు లేకుండా ఉంచండి.
  • పొలంలో యాంత్రిక వ్యాప్తిని నివారించడానికి మంచి పారిశుద్ధ్యాన్ని పాటించండి.
  • తెగులు సోకిన మొక్కలతో పాటు ఏదైనా ప్రత్యామ్నాయ అతిధి మొక్కలను (కలుపు మొక్కలు) తొలగించి నాశనం చేయండి.
  • అనుమానాస్పద బంగాళాదుంపలను ఇతర పొలాలకు రవాణా చేయవద్దు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి