పొగాకు

టోస్పోవైరస్

TSWV, GRSV and TCSV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • మొక్కపై పత్రహరితం కోల్పోయిన లేదా నిర్జీవమైన గాయాలు ఏర్పడతాయి.
  • ఆకులపై రింగుల వంటి మచ్చలు మరియు లైన్ వంటి చారలు ఏర్పడతాయి.
  • పండ్లపై నిర్జీవమైన గాయాలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
పొగాకు

పొగాకు

లక్షణాలు

మొక్క ఆకులపై పత్రహరితం కోల్పోయిన లేదా నిర్జీవమైన గాయాలు ఏర్పడతాయి. ఆకులపై రింగుల వంటి మచ్చలు మరియు లైన్ వంటి చారలు, పచ్చ ఐలాండ్ మొజాయిక్ నమూనాలు ఏర్పడతాయి. కాండం రంగు మారడం, దాని తర్వాత వాలిపోవడం, ఎదుగుదల తగ్గడం, మచ్చలు ఏర్పడడం, కాంస్య రంగులోకి మారడం, రూపం మారడం(ముడుచుకుపోవడం), పత్రహరితం కోల్పోవడం మరియు (టాప్) కణాలు నిర్జీవంగా మారడం వంటి లక్షణాలు కనపడతాయి, ఒకే రకం అతిధేయ మొక్కల జాతులపై ఈ లక్షణాలు మారవచ్చు. పండ్లు అప్పుడప్పుడు రింగుల వంటి నిర్జీవ కణజాలంతో పసుపు లేదా నారింజ రంగులో పాలిపోయిన చిన్న చిన్న మచ్చలను చూపుతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

అంబ్లిసియస్ క్యూమెరిస్, హైపోయాస్పిస్ మైల్స్ మరియు ఓరియస్ ఇన్సిడియోసస్ వంటి తామర పురుగులను తినే కీటకాలను పొలంలో వదలండి. ఈ వైరస్ వాహకాలు జనాభాను తగ్గించడానికి ఇతర పంటలతో పంటను వేరుచేయడం, కాంతిని ప్రతిబింభింపచేసే మల్చింగ్, నెట్టింగ్ లేదా ఇతర సాగు నియంత్రణ పద్ధతులను ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉన్న జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి

దీనికి కారణమేమిటి?

ఈ నష్టం టోస్పో వైరస్ వల్ల సంభవిస్తుంది మరియు తామర పురుగుల ద్వారా నిరంతరంగా మరియు ప్రత్యుత్పత్తి చేసే పద్ధతిలో వ్యాపిస్తుంది. వైరస్ సోకిన మొక్కలను తామర పురుగుల లార్వా తింటాయి మరియు వైరస్‌ను సంక్రమించిన తామర పురుగుల లార్వా మాత్రమే వైరస్‌ను వ్యాపింపచేయగలవు. మొక్కల జాతులు మరియు సాగు రకాలు, ఇనాక్యులేషన్ సమయంలో వున్న వృద్ధి దశ మరియు పోషక మరియు పర్యావరణ పరిస్థితులు వంటి అంశాలు మొక్కపై దీని లక్షణాలను బహిర్గతం చేస్తాయి.


నివారణా చర్యలు

  • తామర పురుగుల జనాభాను నియంత్రించండి.
  • వైరస్‌ను డైరక్ట్ గా మేనేజ్ చేయడానికి, సాధ్యమైనంతవరకు వ్యాధి-రహిత మొలకలను నాటడం, పొలాల్లో కలుపు మొక్కలు మరియు స్వచ్ఛందంగా మొలిచే మొక్కలను తొలగించడం మరియు పొలంలో అనవసరపు మొక్కలను తొలగించడం చాలా సందర్భాలలో సిఫార్సు చేయబడింది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి