నిమ్మజాతి

నిమ్మ పంటలో పసుపు రంగు మొజాయిక్ వైరస్

CiYMV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులపై పసుపు రంగు నమూనా మచ్చలు.
  • పండ్లపై అస్వాభావికమైన ఉపరితలం మరియు రంగు.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

కొత్తగా వచ్చే ఆకులపై చిన్న పసుపు మచ్చలుగా ఈ తెగులు లక్షణాలు ప్రారంభమవుతాయి, తరువాత ఇవి పెద్దవిగా మారి ఈనెల వెంబడి ప్రకాశవంతమైన పసుపు రంగు నమూనా మచ్చలుగా మారుతాయి. ఎదిగిన ఆకులు తోలు ఆకృతిని కలిగి ఉంటాయి మరియు చిన్న ఆకులు ఎదగకుండా చిన్నవిగానే ఉండిపోతాయి. పండ్లపై పసుపు రంగు ప్యాచీలు మరియు ఉబ్బెత్తుగా ఉన్న ఆకుపచ్చ ప్రాంతాలు ఏర్పడతాయి. చెట్ల పెరుగుదల మరియు పండ్ల ఉత్పత్తి దెబ్బతింటుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ సమస్యకు సేంద్రీయ నియంత్రణ సాధ్యం కాదు.

రసాయన నియంత్రణ

వైరస్‌ను నియంత్రించడానికి ఈ వైరస్ వాహకమైన పిండి నల్లి యొక్క రసాయన నియంత్రణ సరిపోదు. ఎల్లప్పుడూ వైరస్ రహిత అంటు మొక్కలను ఉపయోగించండి.

దీనికి కారణమేమిటి?

సిట్రస్ ఎల్లో మొజాయిక్ వైరస్ (CYMV) మొట్టమొదటసారిగా భారతదేశంలో కనుగొనబడింది మరియు ఇప్పుడు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఒక సాధారణ తెగులు. ఇక్కడ నిమ్మను పెద్దఎత్తున పండిస్తారు. ఈ వ్యాధి కలుషితమైన అంట్ల మొక్కల ద్వారా వ్యాపించవచ్చు మరియు అనేక వాణిజ్య నర్సరీలు ఈ వ్యాధికి సంబంధించిన కేసులను నివేదించాయి. నిమ్మ పిండి నల్లి ద్వారా మరియు కలుషితమైన పరికరాల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. సాధారణ కలుపు మొక్క అయిన బంగారు తీగ ద్వారా ఈ వైరస్ ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు వ్యాపిస్తుంది.


నివారణా చర్యలు

  • పిండి నల్లి (ప్లానోకాకస్ సిట్రి) ఈ వైరస్ కి వాహకం అని గుర్తించబడింది కాబట్టి పిండి నల్లి తెగులు ను నియంత్రించినట్లైతే అది మొజాయిక్ వైరస్ నియంత్రణలో సహాయపడుతుంది.
  • కలుపు మొక్కలు, ముఖ్యంగా బంగారు తీగను పొలంలో నుండి తొలగించండి.
  • వేర్వేరు మొక్కల వద్ద ఉపయోగించే ముందు పనిముట్లను ఎల్లప్పుడూ శుభ్రం చేయండి.
  • ఈ తెగులుకి నిరోధకత కలిగిన విత్తన రకాలు ఇంకా అందుబాటులో లేవు మరియు ఈ తెగులును ముందుగానే గుర్తించడానికి సున్నితమైన నిర్ధారణ సాధనాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి