మొక్కజొన్న

హాల్కస్ స్పాట్ తెగులు

Pseudomonas syringae pv. syringae

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • ఆకుల ఈనెల వెంబడి క్రింది భాగంలో నిమ్మ పచ్చ రంగులో పాలిపోయినట్టు వున్న పారదర్శక మచ్చలు కనపడతాయి.
  • ఈ మచ్చలు పొడవుగా పెరుగుతూ ఒకదానితో ఇంకొకటి కలిసిపోతాయి.
  • ఈ మచ్చల మధ్యభాగంలో గోధుమ రంగు చారలు ఎండిపోయి రాలి పడిపోతాయి.
  • దీనివలన ఆకు చిరిగిపోయినట్టు కనిపిస్తుంది.
  • కొన్ని సార్లు బ్యాక్తీరియా జిగట పదార్ధం కారుతూ ఉంటుంది.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

ఆకుల ఈనెల వెంబడి క్రింది భాగంలో నిమ్మ పచ్చ రంగులో పాలిపోయినట్టు వున్న పారదర్శక మచ్చలు కనపడతాయి. ఈ మచ్చలు పొడవుగా పెరుగుతూ ఒకదానితో ఇంకొకటి కలిసిపోతాయి. ఈ మచ్చల మధ్యభాగంలో గోధుమ రంగు చారలు ఎండిపోయి రాలి పడిపోతాయి. దీనివలన ఆకు చిరిగిపోయినట్టు కనిపిస్తుంది. కొన్ని సార్లు బ్యాక్తీరియా జిగట పదార్ధం కారుతూ ఉంటుంది. ఈ మచ్చలు మెల్లగా పెద్దవవుతూ గోధుమ రంగు నిర్జీవ మచ్చలుగా మారతాయి. తరువాత ఇవి రాలిపోతాయి. కొన్ని మొక్కజొన్న రకాలలో ఆకులు మొత్తం పాలిపోయి మొక్కల పై కణుపులు వక్రీకరణ చెంది ఉంటాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులును నియంత్రించడానికి ఇప్పటివరకు ఎటువంటి జీవ నియంత్రణ పద్దతి లేదు. దీనిని నిరోధించటానికి ప్రత్యామ్నాయ మార్గాలు చాలా తక్కువ. మొక్క జొన్నలో ఈ బ్యాక్తీరియల్ మచ్చను నియంత్రించడానికి ముందస్తుగా నివారణ చర్యలు తీసుకోవడం, సరైన పంట యాజమాన్య పద్ధతులు పాటించడం ఒక్కటే మార్గం

రసాయన నియంత్రణ

ప్రస్తుతం కాపర్ లేదా కాపర్ కలిగి ఉన్న పదార్ధాలతోనే రసాయనిక పద్దతిలో వీటిని నివారిస్తున్నారు. చాలా పిచికారీలు కేవలం తాత్కాలికంగానే ప్రభావం చూపుతాయి, అందుచేత ఈ తెగులును నియంత్రించడం చాలా కష్టం.

దీనికి కారణమేమిటి?

వీటి లక్షణాలు సూక్ష్మ జీవుల బలం, మొక్కల రకాలు మరియు వాతావరణంపై ఆధారపడి ఉంటాయి. మొదట్లో వజ్రపు రూపంలో పొడవాటి మచ్చలు గోధుమ రంగు అంచులతో కింది ఆకుల పై కనిపిస్తాయి. ఈ మచ్చలు వివిధ సైజులలో ఉంటూ ఆకు ఈనెల వరకు వ్యాపిస్తాయి. కొన్ని మొక్కల్లో ఇవి ఒక దగ్గరికి చేరి ఆకుల ఎక్కువ భాగాల్లో మాడు తెగులు రావడానికి దారి తీస్తాయి. కంకులు గోధుమ రంగు తొడుగు కలిగి మరియు రూపు మారే అవకాశం కూడా ఉంటుంది. ఆకుల నష్టం వల్ల దిగుబడి తగ్గిపోతుంది. మొక్కలకు తగిలిన గాయాల ద్వారా ఈ తెగులు మొక్కలలోకి ప్రవేశిస్తుంది. ఈ సూక్ష్మ జీవులు 0 నుండి 35°C ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. 25-30°C వద్ద ఇవి బాగా వ్యాప్తి చెందుతాయి. తడి తేమ వాతావరణంలో ఈ తెగులు తీవ్రత చాలా అధికంగా ఉంటుంది. సీజన్ ప్రారంభ దశలో ఈ తెగులు సోకినట్లైతే కొంతమంది రైతులు మొత్తం పొలంలో పంటను దున్ని నాశనం చేస్తారు.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరంగా ఉన్న మొక్కల విత్తనాలు మాత్రమే వాడాలి.
  • సహనాత్మక విత్తన రకాలను ఎంచుకోవాలి.
  • పొలాన్ని క్రమం తప్పకుండా ఈ తెగులు లక్షణాలకోసం గమనిస్తూ వుండండి.
  • తెగులు సోకిన మొక్కలను వెంటనే తొలగించి కాల్చివేయండి.
  • ఆకులు తడిగా వున్నప్పుడు పొలంలో పనిచేయకండి.
  • మొక్కల పైనుండి నీటిని పెట్టొద్దు.
  • పొలంలో కలుపు మొక్కలను ఇతర అతిధి మొక్కలను తొలగించండి.
  • పొలానికి దగ్గరలో కంపోస్టును తయారు చేయడం కానీ పంట అవశేషాలను ఉంచడం కానీ చేయవద్దు.
  • మీ పరికరాలను హై- ప్రూఫ్ ఆల్కహాల్ లేదా అగ్నితొ (ఏదో ఒకదానితో) బాగా శుభ్రం చేయండి.
  • ఈ తెగులుకు ఆతిధ్యం ఇవ్వని మొక్కలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి