కాప్సికమ్ మరియు మిరప

పండు మిరపలో బ్యాక్టీరియల్ మచ్చ తెగులు

Xanthomonas sp.

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • లేత ఆకులపై చిన్న, పసుపు- ఆకుపచ్చ మచ్చలు కనబడతాయి.
  • పసుపు రంగు వలయాలతో కూడిన నీటిలో తడిచినట్టు వున్న ముదురు రంగు మచ్చలు ఎదిగిన ఆకులపైన ఏర్పడతాయి.
  • ఆకులు ఆకృతిని కోల్పోయి చుట్టుకుపోయి ఉంటాయి.
  • పండ్లపైన నీటిలో తడిచినట్టువున్న మచ్చలు ఏర్పడతాయి.
  • తరువాత ఇవి కఠినమైన గోధుమరంగు పొక్కులుగా మారతాయి.

లో కూడా చూడవచ్చు


కాప్సికమ్ మరియు మిరప

లక్షణాలు

ఈ తెగులు వలన చిన్న, పసుపు-ఆకు పచ్చ మచ్చలు ఎదిగే ఆకులపై ఏర్పడి ఆకులు ఆకృతిని కోల్పోయి వంకరలు తిరిగి వుంటాయి. ఎదిగిన ఆకులపై గాయములు కోణాకారములో వుండి, ముదురు ఆకుపచ్చ మరియు చూడడానికి జిడ్డుగా వుండి చుట్టూ పసుపు రంగు వలయాలతో ఉంటాయి. ఫలితంగా ఆ మచ్చలు తుపాకీతో కాల్చిన రంధ్రాల మాదిరిగా కనబడతాయి, ఎందుకంటే ఈ మచ్చల మధ్యభాగం ఎండిపోయి విడిపోయినట్టు అయిపోతుంది. పండ్లపైన మచ్చలు ( 0.5 సెంటీమీటర్స్ వరకు) పాలిపోయిన ఆకుపచ్చ రంగులో మొదలై నీటిలో నానినట్టువుండే మచ్చలుగా మారి చివరకు గోధుమరంగులోకి మారుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

బాక్టీరియల్ మచ్చ తెగులు నివారణ చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒకవేళ ఈ తెగులు సీజన్ ప్రారంభంలో వస్తే మొత్తం పంటను నాశనం చేసే విషయం ఆలోచించండి. కాపర్ వున్న బాక్టీరియా మందులు ఆకులపైన మరియు పండ్ల పైన ఒక రక్షణ కవచం ఏర్పరుస్తాయి. బాక్టీరియా వైరస్ (బాక్టీరియోఫేజెస్) ప్రత్యేకంగా బాక్టీరియాను చంపేవి అందుబాటులో వున్నాయి. 1.3 % సోడియం హైపో క్లోరైట్ లో ఒక నిమిషము లేదా 50 డిగ్రీల సెంటీ గ్రేడ్ వేడి నీటిలో 25 నిమిషాల పాటు విత్తనాలను ముంచి వుంచండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవసంబంధమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కాపర్ ఆధారిత పురుగుల మందులను వాడడం వలన ఈ తెగులును కొంతవరకు నిరోధించవచ్చు. వెచ్చని మరియు తేమ వాతావరణంలో పది నుండి పధ్నాలుగు రోజుల విరామంతో ఈ మందులను వాడండి. మాంకోజెబ్ మరియు కాపర్ కలిగిన మందులను వాడడం ద్వారా ఈ తెగులును నిరోధించవచ్చు.

దీనికి కారణమేమిటి?

బాక్టీరియల్ మచ్చ తెగులు ప్రపంచవ్యాప్తంగా పంటలకు సోకుతుంది. వెచ్చని, తేమ గల వాతావరణ పరిస్థితులలో పండించే మిరప మరియు టమోటా పంటలకు ఇది అత్యంత విధ్వంసకరమైన వ్యాధి. ఈ వ్యాధికారకములు విత్తనములతో కలసి బయటి వైపున గాని లేక లోపల గాని కొన్ని ప్రత్యేకించిన కలుపులో జీవించి తరువాత వర్షం లేక పంటకు పైనుండి నీరు పెట్టడంద్వారా వ్యాప్తి చెందుతాయి. అది ఆకు లోపలికి ఆకు రంధ్రాల ద్వారా మరియు గాయాల ద్వారా ప్రవేశిస్తుంది. వీటి ఎదుగుదలకు సరైన ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్. ఒకసారి పంటకు ఈ తెగులు సోకితే దీనిని నియంత్రించడం చాలా కష్టం మరియు మొత్తం పంట నష్టపోతుంది.


నివారణా చర్యలు

  • ధృవీకరించిన, తెగులు లేని విత్తనాలను వాడండి.
  • మీ ప్రాంతంలో అందుబాటులో వుంటే తెగులు నిరోధక రకాలను వాడండి.
  • వ్యాధి లక్షణాల కొరకు పొలాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
  • ఆకుమచ్చతో వున్న మొలకలను తనిఖీ చేసి, తొలగించి కాల్చివేయండి.
  • పొలంలో మరియు పొలం చుట్టూ కలుపు మొక్కలను తొలగించండి.
  • మొక్కల చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేయడం ద్వారా నేల నుండి మొక్క కలుషితం కాకుండా నివారించవచ్చు.
  • మొక్కలకు పైనుండి నీటిని పెట్టవద్దు.
  • ఆకులు తడిగా వునప్పుడు పొలంలో పనిచేయవద్దు.
  • పంట కోత తరువాత మొక్క వ్యర్థాలను దున్నివేయండి లేదా తీసివేయండి.
  • పనిముట్లను మరియు పరికరములను శుభ్రం చేయండి.
  • ప్రతీ రెండు నుండి మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి